
భారత టెన్నిస్ అగ్రశ్రేణి డబుల్స్ ప్లేయర్ దివిజ్ శరణ్ సిటీ ఓపెన్ ఏటీపీ–500 టోర్నమెంట్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. వాషింగ్టన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో శరణ్–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీ 7–5, 7–6 (8/6)తో ఇల్యా ఇవాష్క (బెలారస్)–డానిల్ మెద్వెదేవ్ (రష్యా) ద్వయంపై విజయం సాధించింది.
మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో లియాండర్ పేస్ (భారత్)–జేమ్స్ సెరెటాని (అమెరికా)లతో శరణ్–సితాక్ తలపడతారు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) 3–6, 3–6తో క్రుగెర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు.