టాటా ఓపెన్‌ విజేత గ్రీక్‌స్పూర్‌  | Tata Open 2023: Tallon Griekspoor Clinches Maiden ATP Title | Sakshi
Sakshi News home page

టాటా ఓపెన్‌ విజేత గ్రీక్‌స్పూర్‌ 

Published Sun, Jan 8 2023 7:08 AM | Last Updated on Sun, Jan 8 2023 7:08 AM

Tata Open 2023: Tallon Griekspoor Clinches Maiden ATP Title - Sakshi

పుణే: భారత్‌లో నిర్వహించే ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్‌ మహారాష్ట్ర (ఏటీపీ 250) శనివారం ముగిసింది. సింగిల్స్‌లో నెదర్లాండ్స్‌ ఆటగాడు గ్రీక్‌స్పూర్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో గ్రీక్‌స్పూర్‌ 4–6, 7–5, 6–3 స్కోరుతో బెంజమిన్‌ బోన్జి (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. 2 గంటల 16 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్‌ను కోల్పోయినా...పట్టుదలతో ఆడిన 26 ఏళ్ల గ్రీక్‌స్పూర్‌ తన కెరీర్‌లో తొలి ఏటీపీ టైటిల్‌ సొంతం చేసుకోవడం విశేషం.  

మరో వైపు డబుల్స్‌లో భారత జోడి శ్రీరామ్‌ బాలాజీ – జీవన్‌ నెడుంజెళియన్‌ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాండర్‌ గిల్‌ – జొరాన్‌ వీగన్‌ (బెల్జియం) ద్వయం 6–4, 6–4తో శ్రీరామ్‌–జీవన్‌లపై విజయం సాధించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement