TATA open
-
టాటా ఓపెన్ విజేత గ్రీక్స్పూర్
పుణే: భారత్‌లో నిర్వహించే ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్ మహారాష్ట్ర (ఏటీపీ 250) శనివారం ముగిసింది. సింగిల్స్‌లో నెదర్లాండ్స్ ఆటగాడు గ్రీక్స్పూర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో గ్రీక్స్పూర్ 4–6, 7–5, 6–3 స్కోరుతో బెంజమిన్ బోన్జి (ఫ్రాన్స్)ను ఓడించాడు. 2 గంటల 16 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్‌ను కోల్పోయినా...పట్టుదలతో ఆడిన 26 ఏళ్ల గ్రీక్స్పూర్ తన కెరీర్లో తొలి ఏటీపీ టైటిల్ సొంతం చేసుకోవడం విశేషం. మరో వైపు డబుల్స్‌లో భారత జోడి శ్రీరామ్ బాలాజీ – జీవన్ నెడుంజెళియన్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాండర్ గిల్ – జొరాన్ వీగన్ (బెల్జియం) ద్వయం 6–4, 6–4తో శ్రీరామ్–జీవన్‌లపై విజయం సాధించింది. -
సుమీత్ నగాల్ అవుట్...
పుణే: దేశంలోని ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్ మహారాష్ట్రలో భారత ఆటగాడు సుమీత్ నగాల్ పోరు ముగిసింది. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఫిలిప్ క్రజినోవిచ్ (సెర్బియా) 6–4, 4–6, 6–4 స్కోరుతో నగాల్‌పై విజయం సాధించాడు. 2 గంటల 24 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ‘వైల్డ్ కార్డ్’ సుమీత్ తీవ్రంగా పోరాడినా లాభం లేకపోయింది. క్రజినోవిచ్ 8 ఏస్‌లు కొట్టగా, నగాల్ 3 ఏస్‌లు నమోదు చేశాడు. మరో మ్యాచ్‌లో అమెరికాకు చెందిన మైకేల్ మో 6–2, 6–4 స్కోరుతో 15 ఏళ్ల భారత సంచలనం మానస్ ధమ్నేపై విజయం సాధించాడు. ఇది కూడా చదవండి: ఫైనల్లో శివ థాపా జాతీయ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ బాక్సర్ శివ థాపా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆరు సార్లు ఆసియా పతకాలు సాధించిన అస్సాం బాక్సర్ థాపా... 63.5 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో జస్వీందర్ సింగ్ (ఢిల్లీ)ని తన నాకౌట్ పంచ్‌తో చిత్తు చేశాడు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించిన రోహిత్ టోకస్ (రైల్వేస్) కూడా 5–0తో జై సింగ్ (ఛత్తీస్‌గఢ్)పై ఘన విజయం సాధించాడు. -
Tata Open: మెయిన్ ‘డ్రా’కు రామ్‌కుమార్
పుణే: భారత్‌లో జరిగే ఏకైక అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీ టాటా ఓపెన్‌లో భారత మూడో ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 432వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6–3, 7–5తో ప్రపంచ 153వ ర్యాంకర్ మతియా బెలూచి (ఇటలీ)పై సంచలన విజయం సాధించాడు. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఏకంగా 14 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఏడుసార్లు కాపాడుకున్న రామ్‌కుమార్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ 62వ ర్యాంకర్ పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)తో రామ్‌కుమార్ తలపడతాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ మాత్రం మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో యూకీ 1–6, 4–6తో ఇలియాస్ ఈమర్ (స్వీడన్) చేతిలో ఓడిపోయాడు. నేటి నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ‘వైల్డ్ కార్డు’ పొందిన భారత టీనేజర్, 15 ఏళ్ల మానస్‌తో మైకేల్ మో (అమెరికా); సుమిత్ నగాల్ (భారత్)తో క్రయినోవిచ్ (సెర్బియా) తలపడతారు. 6,42,735 డాలర్ల (రూ. 53 కోట్లు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సింగిల్స్ విజేతకు 97,760 డాలర్లు (రూ. 80 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. -
విష్ణు–బాలాజీ జంట ఓటమి
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ– 250 టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో విష్ణు వర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం 2–6, 4–6తో టాప్ సీడ్ ల్యూక్ స్మిత్–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తమ సర్వీస్‌ను మూడు సార్లు కోల్పోయింది. నేడు సాదియో –ఫాబియన్ (ఫ్రాన్స్); రోహన్ బోపన్న–రామ్ కుమార్ (భారత్) జోడీల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో రేపు జరిగే ఫైనల్లో ల్యూక్–జాన్ ప్యాట్రిక్ జంట ఆడుతుంది. సుహానా సైనీకి కాంస్యం ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యూత్ కంటెండర్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి సుహానా సైనీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ట్యూనిషియా రాజధాని ట్యూనిస్లో శుక్రవారం జరిగిన అండర్–19 బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో సుహానా 11–9, 9–11, 10–12, 11–13తో ప్రపంచ నంబర్‌వన్ ఎలీనా జహారియా (రొమేనియా) చేతిలో ఓడింది. -
యూకీ బాంబ్రీ శుభారంభం
టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. పుణేలో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యూకీ 6–7 (10/12), 6–2, 7–5తో కొవాలిక్ (స్లొవేకియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో యూకీ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (భారత్) 6–7 (5/7), 2–6తో అల్ట్‌మైర్ (జర్మనీ) చేతిలో ఓడాడు. -
సుమీత్ జంటకు డబుల్స్ టైటిల్
ముంబై: స్వదేశంలో జరిగిన టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు మెరిశారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మూడు విభాగాల్లో భారత క్రీడాకారులు టైటిల్స్ సాధించారు. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి అర్జున్ రామచంద్రన్‌తో కలిసి టైటిల్ దక్కించుకోగా... మహిళల సింగిల్స్‌లో అస్మిత చలిహా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ చాంపియన్స్‌గా నిలిచారు. మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి... మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జోడీ రన్నరప్‌గా నిలిచారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–అర్జున్ ద్వయం 21–10, 21–16తో టాప్ సీడ్ గో జె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జంటను చిత్తుగా ఓడించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో వృశాలి 16–21, 13–21తో అష్మిత చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆసియా జూనియర్ చాంపియన్ లక్ష్య సేన్ 21–15, 21–10తో ప్రస్తుత జూనియర్ ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించాడు. ఈ గెలుపుతో గత నెలలో కెనడాలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కున్లావుత్ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో మేఘన–పూర్వీషా రామ్ ద్వయం 10–21, 11–21తో ఎన్జీ వింగ్ యుంగ్–యెంగ్ ఎన్గా టింగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
టాటా ఓపెన్ టోర్నీ ఫైనల్లో వృశాలి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఎనిమిదో సీడ్ వృశాలి 21–11, 21–12తో ముగ్ధా ఆగ్రే (భారత్)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో అష్మిత (భారత్) 21–19, 21–19తో నాలుగో సీడ్ చానన్‌చిడా జుచారోన్ (థాయ్‌లాండ్)పై నెగ్గి వృశాలితో ఆదివారం జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ (భారత్) 17–21, 21–9, 21–12తో కంటావత్ లీలావెచబుర్ (థాయ్‌లాండ్)పై గెలుపొంది ఫైనల్ చేరాడు. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో తెలంగాణ క్రీడాకారిణి జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ జంట 21–18, 9–21, 25–23తో రుతుపర్ణ పాండా–ఆరతి సునీల్ (భారత్) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి–అర్జున్ రామచంద్రన్ ద్వయం 21–16, 20–22, 21–14తో టిన్ ఇస్రియానెత్– తనుపట్ విరియాంగ్‌కురా (థాయ్‌లాండ్) జంటపై నెగ్గి ఫైనల్లో అడుగుపెట్టింది. -
టాటా ఓపెన్ విజేత సిమోన్
పుణే: మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఫ్రాన్స్ టెన్నిస్ ప్లేయర్ గైల్స్ సిమోన్ కెరీర్లో మరో టైటిల్‌ను గెలిచాడు. భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్‌లో సిమోన్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సిమోన్ ఫైనల్లో 7–6 (7/4), 6–2తో ప్రపంచ 14వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. విజేతగా నిలిచిన సిమోన్కు 89,435 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 56 లక్షల 65 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఒకప్పుడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న సిమోన్ ఈ టోర్నీలో అద్భుత ఆటతీరును కనబరిచాడు. రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై గెలిచిన అతను... సెమీఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, టాప్ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)ను మట్టికరిపించాడు. చివరిసారి సిమోన్ 2015 ఫిబ్రవరిలో మార్సెలి ఓపెన్ టైటిల్‌ను సాధించాడు. మరోవైపు డబుల్స్ ఫైనల్లో రాబిన్ హాస్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట 7–6 (7/5), 7–6 (7/5)తో సిమోన్–హెర్బర్ట్ (ఫ్రాన్స్) జోడీని ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. -
రుత్వికకు టైటిల్
టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ ముంబై: టాటా ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్వికా శివాని మహిళల టైటిల్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో రుత్విక 19-21, 21-18, 21-14తో అరుంధతి పంతవానేపై గెలిచింది. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో గురుసాయిదత్ 16-21, 22-20, 17-21తో హెచ్.ఎస్.ప్రణయ్ చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో అపర్ణా బాలన్-ప్రజక్తా సావంత్ 21-13, 10-21, 21-13తో మేఘన-మనీషాపై; మిక్స్‌డ్‌లో సిక్కి రెడ్డి-మనూ అత్రి జంట 21-19, 19-21, 21-10తో అక్షయ్ దివాల్కర్-ప్రద్న్యా గాద్రెపై నెగ్గారు. పురుషుల డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-మనూ అత్రి 21-15, 21-15తో శ్లోక్ రామచంద్రన్-సంయమ్ శుక్లాపై నెగ్గారు.