
రోమ్: భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ డబుల్స్ విభాగంలో తొలి రౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. మూడో సీడ్ యువాన్ సెబాస్టియన్ కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీతో జరిగిన తొలి రౌండ్‌లో బోపన్న (భారత్)–డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్) జంట 6–7 (5/7), 3–6తో ఓడిపోయింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి రౌండ్‌లో ఓడిన బోపన్న జంటకు 10,020 యూరోలు (రూ. 7 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment