డేవిస్‌కప్‌ మ్యాచ్‌కు యూకీ బాంబ్రీ దూరం | Injured Yuki Bhambri out of India's Davis Cup tie versus Uzbekistan | Sakshi
Sakshi News home page

డేవిస్‌కప్‌ మ్యాచ్‌కు యూకీ బాంబ్రీ దూరం

Published Mon, Apr 3 2017 1:38 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

డేవిస్‌కప్‌ మ్యాచ్‌కు యూకీ బాంబ్రీ దూరం

డేవిస్‌కప్‌ మ్యాచ్‌కు యూకీ బాంబ్రీ దూరం

మోకాలి గాయం కారణంగా భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ఉజ్బెకిస్తాన్‌తో జరిగే డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. ఈనెల 7 నుంచి 9 వరకు బెంగళూరులో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ కీలక పోరు కోసం ఆదివారం సన్నాహక శిబిరం ప్రారంభమైన రోజే యూకీ నిష్క్రమించడంతో భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది.

యూకీ గైర్హాజరు కారణంగా రిజర్వ్‌ ఆటగాళ్లు లియాండర్‌ పేస్, రోహన్‌ బోపన్నలలో ఒకరు ఈ మ్యాచ్‌ బరిలోకి దిగడం ఖాయమైంది. అయితే ఎవరు ఆడతారనే దానిపై వ్యాఖ్యానించేందుకు భారత నాన్‌ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి నిరాకరించారు. మరోవైపు జట్టులో ఏడో ఆటగాడిగా ప్రాక్టీస్‌ కోసం ఎంపికైన విష్ణువర్ధన్‌ కూడా ఆదివారం గాయపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement