సింగిల్స్‌లో భారత్‌కు షాక్‌ | India staring at first defeat at Asia level in five years | Sakshi
Sakshi News home page

సింగిల్స్‌లో భారత్‌కు షాక్‌

Published Sat, Apr 7 2018 12:28 AM | Last Updated on Sat, Apr 7 2018 12:28 AM

 India staring at first defeat at Asia level in five years - Sakshi

తియాన్‌జెన్‌ (చైనా): ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో ఇటీవల సంచలన విజయాలు సాధిస్తోన్న భారత యువ ఆటగాళ్లు రామ్‌కుమార్‌ రామనాథన్, సుమీత్‌ నాగల్‌ డేవిస్‌కప్‌లో మాత్రం నిరాశపరిచారు. చైనాతో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మ్యాచ్‌లో తొలి రోజు జరిగిన రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో భారత్‌కు చుక్కెదురైంది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 132వ ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ 6–7 (4/7), 4–6తో 332వ ర్యాంకర్‌ వీ బింగ్‌ వూ చేతిలో... 213వ ర్యాంకర్‌ సుమీత్‌ నాగల్‌ 4–6, 1–6తో 247వ ర్యాంకర్‌ జీ జాంగ్‌ చేతిలో ఓడిపోయారు.

వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించాలంటే చైనాతో నేడు జరిగే మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ తప్పనిసరిగా గెలవాలి. తొలుత జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో డి వూ–మావో జిన్‌ గాంగ్‌తో పేస్‌–బోపన్న జోడీ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో పేస్‌ నెగ్గితే డేవిస్‌కప్‌ చరిత్రలోఅత్యధిక డబుల్స్‌ విజయాలు సాధించిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.   ఉ.గం. 7.30 నుంచి నియో స్పోర్ట్స్, నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement