బెంగళూరు: భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ 6–3, 7–6 (7/3)తో ఆదిల్ కల్యాణ్‌పుర్ (భారత్)పై గెలుపొందాడు.
ఈ మ్యాచ్‌లో సాకేత్ ఎనిమిది ఏస్‌లు సంధించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ 6–2, 6–2తో నెడొల్కో (రష్యా)పై, శశికుమార్ 7–6 (8/6), 6–3తో అల్టామిరానో (అమెరికా)పై నెగ్గారు. డబుల్స్ తొలి రౌండ్‌లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–4, 6–3తో సుమీత్ నాగల్ (భారత్)–బ్రైడెన్ ష్నుర్ (కెనడా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
సాకేత్ ముందంజ
Published Wed, Nov 14 2018 1:52 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment