సెమీస్‌లో సానియా జోడి | in semifinals to enterd sania merza pair | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జోడి

Published Fri, May 6 2016 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

సెమీస్‌లో సానియా జోడి

సెమీస్‌లో సానియా జోడి

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 6-3, 6-2తో ఆరోసీడ్ హల్వకోవా -హర్డెకా (చెక్)పై గెలిచింది.

గంటా 2 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం ఆద్యంతం ఆధిపత్యం చూపెట్టింది. సెమీస్‌లో సానియా జోడి... వానియా కింగ్ (అమెరికా)-అల్లా కుద్రెత్సోవా (రష్యా)తో తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement