
తొలి రౌండ్‌లో సానియా జంట ఓటమి
బర్మింగ్‌హామ్: కొత్త భాగస్వామితో బరిలోకి దిగిన సానియా మీర్జాకు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. మార్టినా హింగిస్ అందుబాటులో లేని కారణంగా డబ్ల్యుటీఏ ఏగాన్ క్లాసిక్ టోర్నీలో కేసీ డెల్లాక్వా (ఆసీస్)తో ఆడిన సానియా 4-6, 2-6 తేడాతో జీ జెంగ్, యంగ్-జాన్ చాన్ (చైనా) జంట చేతిలో వరుస సెట్లలో ఓడింది. టాప్ సీడ్ సానియా జంట తమకు లభించిన నాలుగు బ్రేక్ పాయింట్ అవకాశాలను వినియోగించుకోలేక తగిన మూల్యం చెల్లించుకుంది. అలాగే తమ సర్వీస్‌ను మూడు సార్లు కోల్పోయింది. తర్వాతి టోర్నీలు ఈస్ట్‌బర్న్, వింబుల్డన్‌లలో మాత్రం ఎప్పటిలాగే సానియా, హింగిస్ జంటగా ఆడతారు.