ఖతార్ ఓపెన్ క్వార్టర్స్‌లోసానియా-హింగిస్
దోహా: సానియామీర్జా-మార్టినా హింగిస్ విజయయాత్ర మరో టోర్నీలోనూ కొనసాగుతోంది. ఇక్కడ జరుగుతున్న ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా-హింగిస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మంగళవారం రాత్రి హోరాహోరీగా జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నంబర్‌వన్ జోడి 6-4, 4-6, 10-4 స్కోరుతో యి ఫాన్ యు-సైసై జెంగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు టైటిల్స్ గెలిచిన సానియా-హింగిస్ జంటకు ఇది వరుసగా 41వ విజయం.
వరుసగా 41వ విజయం
Published Thu, Feb 25 2016 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM
Advertisement
Advertisement