Open tennis tournament
-
రన్నరప్ సానియా మీర్జా జంట
క్లీవ్‌ల్యాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–క్రిస్టినా మెకేల్ (అమెరికా) జంట రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడింది. ఆదివారం అమెరికాలోని ఒహాయోలో జరిగిన ఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 5–7, 3–6తో టాప్ సీడ్ సుకో అయోమా–ఎనా షిబహారా (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 6,000 డాలర్ల (రూ. 4 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సీజన్లో తొలి టైటిల్‌కు విజయం దూరంలో...
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. అమెరికాలోని ఒహాయోలో జరుగుతున్న క్లీవ్‌ల్యాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–క్రిస్టినా మెకేల్ (అమెరికా) జంట ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 7–6 (7/5), 6–2తో ఐకెరి (నార్వే) –కేథరిన్ హ్యారిసన్ (అమెరికా) జోడీపై గెలుపొందింది. గంటా 23 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను సానియా జంట నాలుగు సార్లు బ్రేక్ చేసింది. మ్యాచ్ ముగిశాక తన కుమారుడు ఇజ్‌హాన్‌తో కలిసి సానియా ఆనందం పంచుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ సుకో అయోమా–ఎనా షిబహార (జపాన్) జోడీతో సానియా–క్రిస్టినా జంట తలపడుతుంది. -
నాదల్ వస్తున్నాడు
రోమ్: ఏడు నెలల విరామం తర్వాత స్పెయిన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టనున్నాడు. ఈనెల 14 నుంచి 21 వరకు రోమ్‌లో జరిగే ఇటాలియన్ ఓపెన్‌తో నాదల్ పునరాగమనం చేయనున్నాడు. ఫిబ్రవరిలో మెక్సికోలో జరిగిన అకాపుల్కో ఓపెన్‌లో నాదల్ చివరిసారి బరిలోకి దిగి విజేతగా నిలిచాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారితో అంతర్జాతీయ టోర్నీలు నిలిచిపోయాయి. గత నెలలో న్యూయార్క్‌లో సిన్సినాటి ఓపెన్‌తో అంతర్జాతీయ టెన్నిస్ పునఃప్రారంభమైనా నాదల్ ఆ టోర్నీలో ఆడలేదు. న్యూయార్క్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో నాదల్ యూఎస్ ఓపెన్ టోర్నీకీ దూరంగా ఉన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహక టోర్నీ అయిన ఇటాలియన్ ఓపెన్‌లో ఫెడరర్ మినహా టాప్–20 లోని 19 మంది ఆటగాళ్లు ఎంట్రీలు ఖరారు చేశారు. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్–10లో నంబర్‌వన్ యాష్లే బార్టీ మినహా మిగతా తొమ్మిది మంది బరిలోకి దిగుతున్నారు. -
యూఎస్ ఓపెన్ ఎరీనా ఇప్పుడు హాస్పిటల్!
న్యూయార్క్: ప్రతియేటా ఆఖరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు వేదికయ్యే యూఎస్ ఓపెన్ ఎరీనా ఇప్పుడు కరోనా ఆసుపత్రిగా మారనుంది. అమెరికాలో 2 లక్షలకు పైగానే కరోనా బారిన పడ్డారు. దీంతో న్యూయార్క్ సిటీలోని యూఎస్ ఓపెన్ స్టేడియం ఇండోర్ సౌకర్యాలను 350 పడకల హాస్పిటల్‌గా మార్చాలని అక్కడి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఆఫీస్ నిర్ణయించింది. లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియాన్ని పాకశాలగా మార్చనున్నారు. ఇందులో రోజూ డాక్టర్లు, ఇతర సహాయక సిబ్బందితో కలిపి మొత్తం 25 వేల మందికి భోజనాలు పెడతారు. -
వరుసగా 41వ విజయం
ఖతార్ ఓపెన్ క్వార్టర్స్లోసానియా-హింగిస్ దోహా: సానియామీర్జా-మార్టినా హింగిస్ విజయయాత్ర మరో టోర్నీలోనూ కొనసాగుతోంది. ఇక్కడ జరుగుతున్న ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా-హింగిస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మంగళవారం రాత్రి హోరాహోరీగా జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నంబర్‌వన్ జోడి 6-4, 4-6, 10-4 స్కోరుతో యి ఫాన్ యు-సైసై జెంగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు టైటిల్స్ గెలిచిన సానియా-హింగిస్ జంటకు ఇది వరుసగా 41వ విజయం. -
క్వార్టర్స్‌లో పేస్ జోడి
డెల్రే బీచ్ (అమెరికా): భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్-జెర్మీ చార్డీ (ఫ్రాన్స్)జోడి.... డెల్రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ పేస్-చార్డీ 6-4, 7-5తో నాలుగోసీడ్ అమెరికా ద్వయం ఎరిక్ బట్రోక్-స్కాట్ లిప్స్కైలపై నెగ్గారు. గంటా 12 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. పేస్ జంట నాలుగు ఏస్‌లను సంధించింది. 119 పాయింట్లతో 66 గెలుచుకుని మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. రెండుసార్లు సర్వీస్ చేజార్చుకున్న పేస్-చార్డీ... ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. క్వార్టర్స్‌లో పేస్ జోడి... మార్సెల్లో గ్రానోలెర్స్ (స్పెయిన్)-సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)తో తలపడుతుంది. -
సెమీస్‌లో భూపతి-యూకీ
సాకేత్ ద్వయం కూడా.. ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ టోర్నీ న్యూఢిల్లీ: తొలిసారి కలిసి ఆడుతున్న సీనియర్ ఆటగాడు మహేశ్ భూపతి-యూకీ బాంబ్రీ జోడి... ఢిల్లీ ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో భూపతి-బాంబ్రీ 7-5, 6-1తో యానిక్ మెర్టెన్స్ (బెల్జియం)-స్టీఫెన్ రొబెర్ట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. మోచేతి గాయం నుంచి కోలుకున్న యూకీ బేస్‌లైన్ సర్వీస్‌లతో అదరగొట్టాడు. మోకాలి గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న భూపతి కూడా మునుపటి షాట్లతో అలరించాడు. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సాకేత్ మైనేని-సనమ్ సింగ్ 7-6 (4), 6-4తో విజయ్ సుందర్ ప్రశాంత్-జీవన్ నెదుచెలియాన్పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో ప్రజనీష్ జ్ఞానేశ్వరన్‌కు వాకోవర్ లభించింది. కడుపు నొప్పి కారణంగా ఏడోసీడ్ యాన్ బాయ్ (చైనా) మ్యాచ్ నుంచి వైదొలిగాడు.