సాకేత్ ద్వయం కూడా..
ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ టోర్నీ
న్యూఢిల్లీ: తొలిసారి కలిసి ఆడుతున్న సీనియర్ ఆటగాడు మహేశ్ భూపతి-యూకీ బాంబ్రీ జోడి... ఢిల్లీ ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో భూపతి-బాంబ్రీ 7-5, 6-1తో యానిక్ మెర్టెన్స్ (బెల్జియం)-స్టీఫెన్ రొబెర్ట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. మోచేతి గాయం నుంచి కోలుకున్న యూకీ బేస్‌లైన్ సర్వీస్‌లతో అదరగొట్టాడు. మోకాలి గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న భూపతి కూడా మునుపటి షాట్లతో అలరించాడు. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సాకేత్ మైనేని-సనమ్ సింగ్ 7-6 (4), 6-4తో విజయ్ సుందర్ ప్రశాంత్-జీవన్ నెదుచెలియాన్‌పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో ప్రజనీష్ జ్ఞానేశ్వరన్‌కు వాకోవర్ లభించింది. కడుపు నొప్పి కారణంగా ఏడోసీడ్ యాన్ బాయ్ (చైనా) మ్యాచ్ నుంచి వైదొలిగాడు.
సెమీస్‌లో భూపతి-యూకీ
Published Fri, Feb 19 2016 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM
Advertisement
Advertisement