Mahesh Bhupathi
-
Olympics: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే..
ప్రతీ ఒక్క అథ్లెట్ అంతిమ లక్ష్యం ఒలింపిక్స్ పతకం సాధించడమే అనడంలో సందేహం లేదు. ఆశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ధీటుగా నిలబడి కలను పండించుకుని.. మెడల్స్ మెడలో వేసుకునే వారు ‘విజేతలు’గా ప్రశంసలు అందుకుంటారు.అయితే.. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేక ఆఖరి మెట్టుపై బోల్తా పడి నిరాశతో వెనుదిరిగిన వాళ్లు ‘పరాజితులు’గా మిగిలిపోతారు. ప్యారిస్ ఒలింపిక్స్-2024 నేపథ్యంలో.. అలా పతకం గెలిచే దిశగా వచ్చి ఓటమితో ముగించిన భారత క్రీడాకారుల గురించి తెలుసుకుందాం.ఫుట్‌బాల్ జట్టుమెల్బోర్న్ ఒలింపిక్స్-1956లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు ఇలాంటి పరాభవం ఎదురైంది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను క్వార్టర్ ఫైనల్లో 4-2తో ఓడించిన భారత్ సెమీస్‌కు దూసుకువెళ్లింది.నాడు మన ఆటగాడు నివిల్లే డిసౌజా ఆసీస్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టి ఈ ఘనత సాధించిన తొలి ఆసియా ఫుట్‌బాలర్‌గా నిలిచాడు.సెమీ ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తాడని భావించిన వాళ్లకు నిరాశే ఎదురైంది. యుగోస్లేవియాతో సెమీస్‌లో భారత్ ఆరంభంలో గట్టిపోటీనిచ్చినా ద్వితీయార్థ భాగంలో అనూహ్యంగా పుంజుకుంది ప్రత్యర్థి. ఫలితంగా భారత్ ఓటమిపాలైంది.ఈ క్రమంలో కాంస్యం కోసం బల్గేరియా జట్టుతో పోటీపడ్డ భారత ఫుట్‌బాల్ టీమ్ 0-3తో ఓడి పతకాన్ని చేజార్చుకుంది.‘ఫ్లైయింగ్ సిఖ్’ హృదయం ముక్కలైన వేళ..రోమ్ ఒలింపిక్స్-1960లో భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ తృటిలో కాంస్య పతకం కోల్పోయాడు. 400 మీటర్ల పరుగు పందెంలో.. ప్రత్యర్థుల వేగాన్ని అంచనా వేసే క్రమంలో చూపు తిప్పిన మిల్కాకు అదే శాపమైంది.ప్రత్యర్థిని గమనించే క్రమంలో వేగం తగ్గించిన మిల్కా.. సెకనులో పదో వంతు తేడాతో వెనకబడి నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన జీవితంలో అత్యంత చేదు జ్ఞాపకంగా ఈ అనుభవం మిగిలిపోయింది.ఆ తర్వాత రెండేళ్లకు ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు గెలిచినా ఒలింపిక్ పతకం చేజారిన తీరును తాను మరువలేనని దివంగత మిల్కా సింగ్ గతంలో ఓం సందర్భంలో తెలిపారు. భారత మహిళా హాకీ జట్టు చేజారిన మెడల్1980లో తొలిసారిగా భారత మహిళా హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పాల్గొంది. ఆ యేడు మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌కు నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్ వంటి మేటి జట్లు దూరంగా ఉన్నాయి.నాడు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లికన్స్(యూఎస్ఎస్ఆర్) అఫ్గనిస్తాన్‌పై దురాక్రమణకు పాల్పడిన తీరును నిరసిస్తూ.. క్రీడల్లో పాల్గొనకుండా బాయ్‌కాట్ చేశాయి. ఈ క్రమంలో భారత మహిళా జట్టుకు పెద్దగా పోటీ లేకుండా పోవడంతో పతకంతో తిరిగి వస్తుందనే ఆశ చిగురించింది.అయితే, యూఎస్ఎస్ఆర్తో చివరగా తలపడ్డ భారత్ 1-3తో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.పరుగుల రాణికి చేదు అనుభవంలాస్ ఏంజెల్స్-1984 ఒలింపిక్స్‌లో ఉషపైనే భారత్ ఆశలు పెట్టుకుందిపెట్టుకుంది. అయితే, మిల్కా సింగ్ మాదిరే ఆమె కూడా తృటిలో పతకం చేజార్చుకుంది.400 మీటర్ల హార్డిల్స్ పోటీలో సెకనులో వందో వంతు తేడాతో వెనుకబడ్డ ఈ ‘పయ్యోలీ ఎక్స్‌ప్రెస్’ హృదయం ముక్కలైంది. రొమేనియాకు చెందిన క్రిస్టియానా కోజోకరో మూడోస్థానంలో నిలవగా.. పీటీ ఉష పతకం లేకుండా రిక్త హస్తాలతో వెనుదిరిగింది. టెన్నిస్‌లో చేజారిన కాంస్యంలాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి భారత్ కాంస్యానికి చేరువగా వచ్చింది. అయితే, పాత కథే పునరావృతమైంది.ఈసారి టెన్నిస్ మెన్స్ డబుల్స్‌లో భారత్‌కు పరాభవం ఎదురైంది. లియాండర్ పేస్- మహేశ్ భూపతి ద్వయం క్రొయేషియా జోడీ మారియో ఆన్సిక్- ఇవాన్ జుబిసిక్తో జరిగిన మారథాన్ మ్యాచ్‌లో 6-7 6-4 14-16 తేడాతో ఓడిపోయారు.కాంస్యం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓటమి ఎదురుకావడంతో నిరాశగా నిష్క్రమించారు. అంతకు ముందు సెమీస్‌లో జర్మనీ జంట నికోలస్ కీఫర్- రైనెర్ షట్లర్ చేతిలో పరాజయం పాలై ఫైనల్స్ చేరే సువర్ణావకాశం చేజార్చుకున్నారు పేస్- భూపతి.ఇక ఇదే ఒలింపిక్స్‌లో భారత మహిళా వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవీ సైతం 48 కేజీల విభాగంలో ఫైనల్ అటెంప్ట్‌లో డిస్క్వాలిఫై అయింది.మొత్తంగా 190 కిలోలు ఎత్తిన కుంజరాణి బ్రాంజ్ మెడలిస్ట్ ఆరీ విరాథ్వార్న్(థాయిలాండ్) కంటే పది కేజీలు తక్కుగా లిఫ్ట్ చేసినందుకు పతకానికి దూరమైంది.లండన్ ఒలింపిక్స్‌లోనూ ఇలాగేఈసారి షూటింగ్లో భారత్ పతకానికి చేరువగా వచ్చింది. జోయ్‌దీప్ కర్మాకర్ మెన్స్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో ఫైనల్ చేరాడు. బ్రాండ్ మెడల్ విజేత కంటే 1.9 పాయింట్లు వెనుకబడి కాంస్యం గెలిచే అవకాశం పోగొట్టుకున్నాడు.మరో‘సారీ’ ఇదే ‘కర్మ’ భారత్ నుంచి ఒలింపిక్స్‌లో తొలిసారిగా జిమ్నాస్టిక్స్ విభాగంలో తలపడిన మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. రియో డి జెనిరో-2016 ఒలింపిక్స్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ త్రిపుర అమ్మాయి.. నాలుగో స్థానంలో నిలిచింది.కాంస్యం గెలిచిన అమ్మాయి.. దీపా స్కోరు చేసిన పాయింట్లకు వ్యత్సాసం 0.150 కావడం గమనార్హం.టోక్యోలోనూ కలిసిరాలేదుదాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత టోక్యో ఒలింపిక్స్-2020లో భాగంగా భారత మహిళా హాకీ జట్టు మరోసారి పతకం గెలిచే అవకాశం ముంగిట నిలిచింది.క్వార్టర్ ఫైనల్లో అనూహ్య రీతిలో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టిన రాణీ రాంపాల్ బృందంపై ప్రశంసల జల్లు కురిసింది.అయితే, కీలకమైన సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో స్వర్ణం ఆశ చేజారినా.. కాంస్యం గెలుస్తారనే నమ్మకం మాత్రం చావలేదు.అయితే, గ్రేట్ బ్రిటన్ జట్టు భారత్ ‘కంచు’ ఆశలపై నీళ్లు చల్లింది. 4-3తో ఓడించి కాంస్యాన్ని ఎగురేసుకుపోయింది. ఈ ఓటమితో భారత జట్టుతో పాటు వంద కోట్లకు పైగా భారతీయుల హృదయాలూ ముక్కలయ్యాయి.ఇదే ఒలింపిక్స్‌లో గోల్ఫర్ అదితి అశోక్ కూడా ఇలాగే నాలుగో స్థానంతో సరిపెట్టుకుని చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది.ఇప్పటి వరకు ఎన్ని పతకాలంటే..విశ్వ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 35 పతకాలు గెలిచింది. భారత హాకీ పురుషుల జట్టు 1928- 1956 మధ్య కాలంలో వరుసగా ఆరుసార్లు పసిడి పతకాలు గెలిచింది.ఆ తర్వాత 1964, 1980లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇక మళ్లీ షూటర్ అభినవ్ బింద్రా, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మాత్రమే భారత్‌కు పసిడి అందించారు.చదవండి: పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో టీమిండియా స్టార్! -
ఆర్సీబీని ఏకి పారేసిన టెన్నిస్ దిగ్గజం.. అమ్మిపారేయండంటూ అసహనం
ఆర్సీబీ యాజమాన్యంపై భారత టెన్నిస్ దిగ్గజం.. డబుల్స్, మిక్సడ్ డబుల్స్ స్పెషలిస్ట్ (12 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విన్నర్) మహేశ్ భూపతి తీవ్రస్థాయి ధ్వజమెత్తాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ చెత్త ప్రదర్శన నేపథ్యంలో భూపతి అసహనం వ్యక్తం చేశాడు. నిన్న (ఏప్రిల్ 15) ఆర్సీబీపై సన్‌రైజర్స్ రికార్డు స్కోర్ చేసిన అనంతరం భూపతి ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఇలా అన్నాడు. క్రికెట్ అభిమానులు, ఐపీఎల్ అభిమానులు, ఆటగాళ్ళ కోసం బీసీసీఐని విజ్ఞప్తి చేస్తున్నా. బీసీసీఐ చొరవ తీసుకుని ఆర్సీబీని స్పోర్ట్స్ ఫ్రాంచైజీ నిర్మాణంపై శ్రద్ధ చూపే కొత్త యాజమాన్యానికి అప్పగించండి. ఆర్సీబీ తాజా ప్రదర్శన చాలా బాధాకరం అంటూ భూపతి తన ట్వీట్లో పేర్కొన్నాడు. For the sake of the Sport , the IPL, the fans and even the players i think BCCI needs to enforce the Sale of RCB to a New owner who will care to build a sports franchise the way most of the other teams have done so. #tragic — Mahesh Bhupathi (@Maheshbhupathi) April 15, 2024 స్వతహాగా ఆర్సీబీ అభిమాని అయిన భూపతి తన ఆరాధ్య ఆటగాళ్లతో కూడిన ఫ్రాంచైజీ పేలవ ప్రదర్శన చూసి విరక్తి చెంది ఈ ట్వీట్ చేశాడని తెలుస్తుంది. భూపతి విరాట్, డుప్లెసిస్‌లను బాగా అభిమానిస్తాడు. విరాట్‌పై అభిమానాన్ని భూపతి గతంలో చాలా సందర్భాల్లో బహిర్గతం చేశాడు. ఆర్సీబీ తాజా దుస్థితికి యాజమాన్య వైఖరి కారణమని భావిస్తున్న భూపతి కొత్త యాజమాన్యానికి ఫ్రాంచైజీ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐని కోరాడు. ఈ సీజన్లో ఆర్సీబీ ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన సన్‌రైజర్స్-ఆర్సీబీ మ్యాచ్ విషయానికొస్తే.. బౌలర్ల చెత్త ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. -
ఇద్దరితో బ్రేకప్, వివాహితుడైన టెన్నిస్ స్టార్‌తో నటి పెళ్లి!
మిస్ యూనివర్స్, మోడల్, నటిగా లారా దత్తా జగమంతా పరిచయం. టాప్ టెన్నిస్ స్టార్‌గా మహేశ్ భూపతి కూడా ప్రపంచానికి తెలుసు! ఈ ఇద్దరూ ఒకరితో ఒకరు ఎదురుపడే వరకూ ఒకరి గురించి ఒకరు వినే ఉన్నారు.. ముఖ పరిచయం తక్షణమే ఒకరి ప్రేమలో ఒకరు పడ్డారు! ఆ కథే ఇక్కడ ‘మొహబ్బతే’గా.. విశ్వసుందరిగా లారా దత్తా ప్రపంచానికి తెలిసేటప్పటికే ఆమె జీవితంలో ఉన్న స్నేహితుడు, సహచరుడు కెల్లీ దోర్జీ. భూటాన్ దేశస్థుడు. ముంబై బేస్డ్ మోడల్. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని భావించారు వారి అనుబంధం గురించి తెలిసినవాళ్లంతా. తొమ్మిదేళ్ల డేటింగ్ తర్వాత హఠాత్తుగా లారా ప్రవర్తనను విమర్శించడం మొదలుపెట్టాడు కెల్లీ. ప్రముఖ మోడల్, నటుడు డినో మోరియాతో ఆమె సన్నిహితంగా మెదులుతోందంటూ. ఆ విమర్శలు తర్వాత ఆరోపణలుగా మారి.. ఆఖరకు ఆ రిలేషన్ బ్రేక్ అయిపోయింది. కెల్లీ ఊహించినట్టుగా డినో మోరియాతో లారా పెద్దగా కలసిలేదు. సంతోషంగానూ ఉన్నట్టు లేదు. డినో పక్కన నందితా మహంతి అనే అమ్మాయి పేరు జత కూడింది. ఆ రూమర్‌ని డినో మోరియా ఖండించలేదు. లారా హర్ట్ అయింది. అతనితోనూ తెగతెంపులు చేసుకుంది. అలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే మహేశ్ భూపతితో ఆమెకు ములాఖాత్ అయింది. మహేశ్ భూపతి స్పోర్ట్స్ కంపెనీలో ఈ ఇద్దరికీ ముఖాముఖి పరిచయం అయింది. ఆ మీటింగ్ ఏదో యాడ్‌కి సంబంధించి అని ప్రచారంలో ఉంది కానీ.. నిజానికి లారాను కలవడానికే మహేశ్ ఆ మీటింగ్‌ను ఏర్పాటు చేశాడు.. యాడ్ అనేది ఓ మిష మాత్రమే అని అంటారు మహేశ్ భూపతి సన్నిహితలు. మొత్తానికి తొలి పరిచయంలోనే మహేశ్ సింప్లిసిటీకి ముగ్ధురాలైపోయింది లారా. అప్పటికే లారా మీద మనసు పడి ఉన్నాడు కాబట్టి మహేశ్ కూడా ఆమె పట్ల మరింత ఆకర్షితుడై పోయాడు. అలా వాళ్ల ప్రేమ మొదలైంది. కొన్ని రోజుల్లోనే పరస్పరం ఆ ప్రేమను ప్రకటించుకు న్నారు. కానీ అంతా సవ్యంగా సాగడానికి అదివరకే మహేశ్ వివాహితుడవడం ఓ అడ్డంకిగా మారింది. లారా.. మహేశ్ ఊహకు అందకముందే (2002) అతనికి మోడల్ శ్వేతా జైశంకర్‌తో పెళ్లయింది. ఏడేళ్ల ఆ బంధం మహేశ్‌కు లారా మీద పుట్టిన ప్రేమతో పలచనైంది. లారాతోనే తతిమా జీవితపు ప్రయాణం అని మహేశ్ నిర్ణయించుకునేసరికి.. విడాకులతో శ్వేత అతనికి ఆ నిర్ణయాన్ని అమలుపర్చుకునే స్వేచ్ఛనిచ్చింది. కానీ లారాకు ‘హోమ్ బ్రేకర్’ అనే అపవాదు తప్పలేదు. మహేశ్ భూపతి కోసం ఆ అపవాదును మోసింది ఆమె. ‘ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే నేను, మహేశ్ ఇద్దరం ఓ ఒప్పందం చేసుకున్నాం. సాధ్యమైనంత వరకు ఇద్దరం కలిసే బిడ్డను పెంచాలి. అది సాధ్యంకాని పక్షంలో మా ఇద్దరిలో కచ్చితంగా ఎవరో ఒకరైతే బిడ్డను చూసుకోవాలని. పదేళ్లుగా ఆ ఒప్పందాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నాం’ అని చెప్పింది లారా దత్తా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత... 2011, ఫిబ్రవరి 16న.. అంటే వాలంటైన్స్ డే అయిన రెండు రోజులకు మహేశ్ భూపతి, లారా దత్తా ఒకింటివారయ్యారు. ముంబైలో ఫిబ్రవరి పదహారున అత్యంత సన్నిహితుల మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం, తర్వాత ఫిబ్రవరి 20న గోవాలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మహేశ్ భూపతి మాజీ భార్య శ్వేత కూడా చెన్నైకి చెందిన రఘు కైలాస్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. మహేశ్ భూపతి, లారా దత్తా దంపతులకూ ఓ కూతురు. పేరు సైరా. - ఎస్సార్ -
Leander Paes- Mahesh Bhupathi: విభేదాల్లోనూ విజయాలు!
Leander Paes- Mahesh Bhupathi Web Series Break Point: వ్యక్తిగతంగా ఒకరితో మరొకరికి పడకపోయినా కోర్టులో దిగితే మాత్రం కలిసి కట్టుగా అద్భుత విజయాలు సాధించడం తమకే చెల్లిందని భారత టెన్నిస్ స్టార్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి నిరూపించారు. దశాబ్దానికిపైగా భారత టెన్నిస్ ముఖ చిత్రంగా ఉన్న వీరిద్దరు 1994–2006, 2008–2011 మధ్య డబుల్స్ జోడీగా చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. 1999లో జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో (ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్)నూ పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరిన ఈ జంట... ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ల్లో విజేతలుగా నిలిచింది. అనంతరం 2001 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ జోడి మరోసారి చాంపియన్‌గా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో వీరిని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ అంటూ భారతీయులు కీర్తించారు. అయితే ఈ గొప్ప ఘనతలు సాధించే సమయంలో తమ మధ్య సఖ్యత లేదని వీరు వ్యాఖ్యానించారు. అయినా ఏదో తెలియని సోదరభావం తమని కలిసి ఆడేలా చేసిందని వీరు పేర్కొన్నారు. పేస్, భూపతిల ఆట, అనుబంధం, స్పర్ధలు, గెలుపోటములు... ఇలా ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని పలు ఆసక్తికర అంశాలతో ‘బ్రేక్ పాయింట్’ అనే వెబ్ సిరీస్ నిర్మితమైంది. దీనికి సంబంధించిన ట్రయిలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేస్, భూపతి అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అశ్విని అయ్యర్ తివారి, నితీశ్ తివారిల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రేక్ పాయింట్’ ‘జీ5’ ఓటీటీలో అక్టోబర్ 1న విడుదల కానుంది. -
మరీ ఇంత దారుణమా?: మహేశ్ భూపతి
న్యూఢిల్లీ: తనను భారత డేవిస్‌కప్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించడంపై మాజీ టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి ఆవేదన వ్యక్తం చేశాడు. టెన్నిస్ కెరీర్‌కు ఎప్పుడో దూరమైన భూపతి.. డేవిస్‌కప్ ఆడే భారత జట్టుకు ఇప్పటివరకూ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఐటా) అతన్ని కెప్టెన్సీ పదవి నుంచి అర్థాంతరంగా తొలగించడంపై భూపతి మండిపడ్డాడు. మరీ ఇంత దారుణంగా వ్యహరిస్తారా అంటూ ఐటా తీరును తప్పుబట్టాడు. ‘ నన్ను భారత డేవిస్‌కప్ కెప్టెన్సీ నుంచి తప్పించాలంటే ఆ పని ముందే చేయాల్సింది. ఈ ఏడాది ఆరంభంలో ఇటలీతో జరిగిన డేవిస్‌కప్‌లో భారత్ ఓడిపోయినప్పుడే కెప్టెన్సీ నుంచి తప్పించాల్సింది. ఇప్పుడు దాన్ని సాకుగా చూపుతూ ఉన్నపళంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇక్కడ ఐటా వ్యవహరించిన తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక్కసారిగా నన్ను తప్పించడం వెనుక కుట్ర జరిగింది. నేను ఎప్పుడూ ఆటగాళ్ల కోసం వారి రక్షణ కోసం ఆలోచిస్తూ వచ్చాను. దానిలో భాగంగానే డేవిస్‌కప్ మ్యాచ్‌లు ఆడటానికి పాకిస్తాన్ వెళ్లలేమని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీఎఫ్)కు తేల్చిచెప్పాను దాంతో తటస్థ వేదికపై ఆడటానికి ఐటీఎఫ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 15వ తేదీన జరిగిన ఒక సమావేశానికి నేను కెప్టెన్సీ హోదాలో హాజరయ్యా. ఉన్నట్టుండి నా కెప్టెన్సీకి స్వస్థి పలికారు. నవంబర్ 4వ తేదీన నన్ను కెప్టెన్‌గా తొలగిస్తూ ఐటా సెక్రటరీ జనరల్ హిరోన్మయ్ ఛటర్జీ ఫోన్లో చెప్పారు. కానీ కారణాలు చెప్పలేదు. విభజించు-పాలించు విధానాన్ని ఐటా అవలంభిస్తోంది’ అని మహేశ్ భూపతి విమర్శించాడు. -
‘ఆ ముగ్గురు’ కలిసి పని చేయాలి!
మొనాకో: ఈతరం భారత టెన్నిస్ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించాలంటే ముగ్గురు దిగ్గజాలు లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా కలిసి పని చేయాలని మాజీ వరల్డ్ నంబర్‌వన్, జర్మన్ స్టార్ బోరిస్ బెకర్ అభిప్రాయపడ్డాడు. టెన్నిస్ అభివృద్ధి కోసం కాకుండా ఈ ముగ్గురు తమలో తాము కలహించుకోవడం తాను చూస్తున్నానని అతను అన్నాడు. గత కొంత కాలంగా డబుల్స్ భాగస్వాముల విషయంలో పేస్, భూపతి, సానియా వివాదంలో భాగమయ్యారు. వీరి మధ్య విభేదాలు బహిరంగంగా రచ్చకెక్కాయి. ఇదే విషయాన్ని బెకర్ గుర్తు చేశాడు. ‘టెన్నిస్‌లో భారత్ గతంలో మంచి ఫలితాలు సాధించింది. అయితే ఇప్పుడు కూడా పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్ల అవసరం ఉంది. వారిలో కొందరన్నా మరింత ముందుకు వెళ్లి ఫలితాలు సాధిస్తారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు కానీ మున్ముందు విజయాలు దక్కవచ్చు. దేశంలో ఆటకు మంచి ఆదరణ కూడా ఉంది. పేస్, భూపతి, సానియాలాంటి వారి అవసరం ఇప్పుడు దేశానికి ఉంది. వారు ఆట కోసం ఏదైనా చేయాలి. వారి మధ్య గొడవలు ఉన్నాయనే విషయం నాకు తెలుసు. కానీ ముగ్గురు కలిసి పని చేయడమొక్కటే పరిష్కార మార్గం’ అని బెకర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్‌ల ఘనతను తాజా ఫామ్ ప్రకారం చూస్తే వచ్చే రెండేళ్లలో నొవాక్ జొకోవిచ్ అధిగమిస్తాడని బెకర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓటమిని ఒప్పుకోని తత్వం ఉన్న జొకోవిచ్ అద్భుత రీతిలో పునరాగమనం చేయడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని కూడా అతను అన్నాడు. జొకోవిచ్‌కు 2014–16 మధ్య బెకర్ కోచ్‌గా వ్యవహరించగా... ఆ సమయంలో సెర్బియా స్టార్ ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచాడు. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు!
లియాండర్ పేస్ వ్యాఖ్య కోల్‌కతా: సుదీర్ఘ కెరీర్లో ఎంతో సాధిం చిన తాను ఇక కొత్త గా నిరూపించుకునేదేమీ లేదని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అన్నాడు. ఈ ఏడాది డేవిస్ కప్ జట్టు నుంచి ఈ వెటరన్ ఆటగాడిని నాన్– ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తప్పించాడు. అయితే టెన్నిస్‌నే ప్రేమించే తాను సత్తా ఉన్నంత కాలం ఆడతానని, ఇప్పట్లో రిటైర్మెంట్ యోచనే లేదని తేల్చి చెప్పాడు. ‘నేను ఎవరిముందు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. నేనేంటో నా కెరీరే సమాధానమిస్తుంది. ఈ వయసు లోనూ టెన్నిస్ ఆడుతున్నానంటే దానికి కారణం... నేను టెన్నిస్‌ను అమితంగా ప్రేమించడమే. దేశం తరఫున ఎన్నో విజయాలు సాధించాను. గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఆడేది వ్యక్తిగతమైనా... బరిలోకి దిగేది మాత్రం... మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించేందుకే’ అని పేస్ భావోద్వేగంతో చెప్పాడు. వచ్చే ఏడాది మరిన్ని టైటిల్స్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు. 2018లో కొత్త మిక్స్డ్ డబుల్స్ భాగస్వామితో బరిలోకి దిగుతానని, మళ్లీ విజయాలు సాధిస్తానని అతను చెప్పాడు. -
భార్యను కోపడ్డ మహేష్ భూపతి, ఎందుకు ?
సాక్షి, ముంబై: భారీ వర్షాలతో ముంబై నగర జీవనం అస్తవ్యస్తం అయింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాణిజ్య రాజధాని స్తంభించిన విషయం విదితమే. ముంబై వరదలు సాధారణ ప్రజలతో పాటు ప్రముఖుల జీవితాలని ప్రభావితం చేశాయి. వాటినుంచి భారత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి, అతని భార్య లారా దత్తా తప్పించుకోలేక పోయారు. లారా దత్తా ఇంట్లోకి వరద నీరు రావడాన్ని అడ్డకోవడానికి ఓ విచిత్రమైన పని చేసింది. వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లలో వాడిన తువ్వాలను మహేష్ జ్ఞాపకాలుగా ఉంచుకున్నాడు. అయితే ముంబైలో కురిసిన భారీ వర్షాలకు ఇంట్లోకి వరద నీరు రావడంతో.... ఆ నీటిని అడ్డుకోవడానికి మహేష్ ఎంతో అపురూపంగా దాచుకున్న ఆ టవల్స్‌ను అడ్డంగా పెట్టింది. ఆ ఫోటోను లారా దత్ తన ట్వట్టర్లో పోస్టు చేసింది. అంతేకాదు వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ తువ్వాళ్లు ఇలా ఉపయోగపడ్డాయంటూ పోస్టు చేసింది. వర్షంలో చిక్కుకున్న అందరూ సురక్షితంగా ఇంటికి చేరాలని ఆకాంక్షించింది. అయితే భార్య చేసిన పనిపై మహేష్ భూపతి మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'నువ్వేమైనా నన్ను ఆట పట్టిస్తున్నావా!!!! అవి కొన్నేళ్ల నా శ్రమకు ప్రతిఫలం' అంటూ బదులిచ్చాడు. ముంబయి, థానే, పల్ఘర్, రాయఘడ్లతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాతాంల్లో గత నాలుగురోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. Putting our Wimbledon,US Open, Aus Open &French Open towels to good use!😄@Maheshbhupathi #MumbaiRain.Stay safe & indoors if possible folks!🙏 pic.twitter.com/uEV30SPfT5 — Lara Dutta Bhupathi (@LaraDutta) August 29, 2017 -
‘డబుల్’ ఫాల్ట్!
► సద్దుమణగని డేవిస్ కప్ వివాదం ► వ్యక్తిగత సంభాషణను భూపతి బయట పెట్టడంపై పేస్ ఆగ్రహం ► ఇద్దరిదీ తప్పంటున్న ఏఐటీఏ బెంగళూరు: ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ పోరులో విజయం సాధించి భారత్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించినా... ఈ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. పాత విభేదాలతోనే పేస్‌ను పక్కన పెట్టినట్లు వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నంలో పేస్‌కు, తనకు మధ్య జరిగిన సంభాషణను నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి బయటపెట్టగా... ఇది ముమ్మాటికీ తప్పంటూ పేస్ విమర్శించాడు. మరోవైపు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ), మాజీ ఆటగాళ్లు మాత్రం ఇద్దరినీ తప్పు పడుతున్నారు. ఈ విషయంలో పేస్, భూపతి మరింత పరిణతితో వ్యవహరించాల్సిందని వారు విమర్శించారు. కావాలని చేయలేదు... డేవిస్ కప్ మ్యాచ్ ఆడే తుది జట్టులో పేస్‌కు అవకాశం ఇవ్వకుండా నలుగురు ఆటగాళ్లను నాన్ ప్లేయింగ్ కెప్టెన్ హోదాలో మహేశ్ భూపతి ఎంచుకున్నాడు. అయితే తనతో పాత విభేదాల కారణంగానే ఇలా చేశారంటూ పేస్ ఆ రోజే విమర్శించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం భూపతి దీనిపై వివరణ ఇస్తూ పేస్పై తీవ్ర విమర్శలు కూడా చేశాడు. ‘ఇందులో వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. నా ఇరవై ఏళ్ల కెరీర్లో ఎన్ని విమర్శలు వచ్చినా ఎంతో తప్పనిసరి అయితే తప్ప వివరణ ఇవ్వలేదు. 1994లో తొలిసారి డేవిస్ కప్ జట్టులోకి వచ్చినప్పుడు నేను కూడా పేస్ అభిమానినే. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దానిపై నేను ఓ పుస్తకం రాయగలను. ‘గౌరవం’ అనే పదానికి అతనికి అర్థం కూడా తెలీదు. నాకు జట్టుకు సంబంధించిన అన్ని అంశాల్లో ఏఐటీఏ స్వేచ్ఛ ఇచ్చింది. అసలు పోరు మధ్యలోనే పేస్ జట్టును వదిలి వెళ్లిపోవడం ఏమిటి’ అని మహేశ్ వ్యాఖ్యానించాడు. దీంతో ఆగకుండా తుది జట్టు ఎంపికకు సంబంధించి తనకు, పేస్‌కు మధ్య వాట్సప్‌లో జరిగిన చాటింగ్‌ను కూడా అతను ఈ సందర్భంగా బయట పెట్టాడు. నన్ను ఎందుకు అవమానించారు? అయితే భూపతి వ్యవహారశైలి పట్ల పేస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వ్యక్తిగత సంభాషణను ఒక డేవిస్ కప్ కెప్టెన్ ఎలా బయటపెడతాడంటూ పేస్ ప్రశ్నించాడు. పేస్ పదే పదే కోరినా అతనికి జట్టులో స్థానంపై ఇంకా స్పష్టత ఇవ్వలేనంటూ భూపతి ఇందులో చెబుతూ వచ్చాడు. ‘మా మధ్య మాటల్లో అన్నింటికంటే ఫామ్ ప్రధానమనే చెప్పాడు. కానీ నిజంగా జట్టును ఎంపిక చేసేటప్పుడు దీనిని పట్టించుకోలేదు. నేను బెంగళూరుకు రాక ముందే నిర్ణయం తీసేసుకున్నారని అర్థమవుతోంది. కానీ నాకు చోటు లేదని స్పష్టంగా చెప్పలేదు. ఇది నన్ను అవమానించడమే. ఇదంతా అవసరం లేదు కదా’ అని పేస్ వ్యాఖ్యానించాడు. డేవిస్ కప్‌లో తన పాత్ర గురించి మహేశ్ చేసిన వ్యాఖ్యలపై కూడా పేస్ వివరణ ఇచ్చాడు. ‘అతని ఏకపక్ష వాదనకు నేను మున్ముందు ప్రత్యుత్తరం ఇవ్వగలను. అయితే దేశం తరఫున ఎవరు ఏం చేశారో అభిమానులకు, ప్రజలందరికీ తెలుసు. దీనిపై మాట్లాడటం వృథా. చరిత్ర ఎప్పుడూ అబద్ధం చెప్పదు’ అని పేస్ స్పష్టం చేశాడు. సీనియర్లు ఇద్దరు ఈ విషయంలో మరింత పరిణతితో వ్యవహరించాల్సింది. మ్యాచ్ మధ్యలో పేస్ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. తన ఆలోచనలు, జట్టు ఎంపికపై మహేశ్ మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నాడు. అయితే జట్టులో నువ్వు భాగం కాదంటూ పేస్‌కు భూపతి కాస్త మర్యాదగా ముందే చెబితే బాగుండేది. 27 ఏళ్ల పాటు దేశం తరఫున ఆడిన వ్యక్తికి ఆ గౌరవం పొందేందుకు తగిన అర్హత ఉంది. వాట్సప్ సంభాషణ గురించి మాకూ తెలుసు. తగిన సమయంలో కూర్చొని వారిద్దరితో మాట్లాడతాం. ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలనేది మా ఆలోచన. – హిరణ్మయి ఛటర్జీ, ఏఐటీఏ ప్రధాన కార్యదర్శి నా దృష్టిలో ఈ వివాదం ముగిసిన అధ్యాయం. ఇప్పుడు పేస్, మహేశ్ మధ్య ఉన్న పాత గొడవలు ముఖ్యం కాదు. ప్రస్తుత స్థితిలో మన ఆటగాళ్లు వరల్డ్ గ్రూప్‌లోకి వెళ్లలేరు. ఫెడ్ కప్, గ్రాండ్‌స్లామ్‌లకు అర్హత సాధించడంలేదు. ఇప్పుడు భారత ఆటగాళ్లను ప్రపంచ టాప్–50లోకి ఎలా తీసుకు రావాలనేదే లక్ష్యంగా ఉండాలి. అది జరిగితే అన్నీ చక్కబడతాయి. అప్పుడు మిగతాదంతా అనవసరం. – విజయ్ అమృత్‌రాజ్, భారత మాజీ ఆటగాడు పాత విభేదాలు మళ్లీ బయట పడటం దురదృష్టకరం. ఇందులో ఇద్దరి తప్పూ ఉంది. మహేశ్ వ్యవహారశైలి సరిగా లేదు. నువ్వు తుది జట్టులో లేవంటూ అతను పేస్‌కు ఒక మెయిల్ ఎందుకు పంపలేదు. రోహన్ బోపన్నను ఎంచుకోవాలని రెండు నెలల ముందే అనుకుంటే పేస్‌ను ఎటూ కాకుండా చేయడం ఎందుకు. తను ఆడతానని కచ్చితంగా తెలీనప్పుడు పేస్ బెంగళూరు వరకు ఎందుకు వెళ్లాడు. మ్యాచ్ మధ్యలోనే లియాండర్ వెళ్లిపోయాడని మహేశ్ విమర్శించడంలో అర్థం లేదు. అప్పటికే జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచింది. అక్కడే ఉండిపోయి అతను చేసేదేముంది. – ఆనంద్ అమృత్‌రాజ్, డేవిస్ కప్ మాజీ కెప్టెన్ -
రెండు సింగిల్స్ మనవే
⇒రామ్‌కుమార్, ప్రజ్నేశ్ విజయం ⇒ఉజ్బెకిస్తాన్‌పై 2–0తో ఆధిక్యం ⇒నేడు డబుల్స్ మ్యాచ్ గెలిస్తే వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు భారత్ అర్హత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత యువ ఆటగాళ్లు రామ్‌కుమార్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ అంచనాలకు అనుగుణంగా రాణించారు. కాస్త పోటీ ఎదురైనా... పట్టుదలతో పోరాడి విజయాలు అందుకున్నారు. ఫలితంగా ఉజ్బెకిస్తాన్‌తో మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. వరల్డ్ గ్రూప్‌నకు అర్హత సాధించేందుకు కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. బెంగళూరు: సొంతగడ్డపై భారత యువ ఆటగాళ్లు మెరిశారు. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత్‌ను 2–0తో ఆధిక్యంలో నిలిపారు. డేవిస్‌కప్ టెన్నిస్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్‌లో భాగంగా ఉజ్బెకిస్తాన్‌తో జరుగుతోన్న పోటీలో తొలి రోజు భారత్‌దే పైచేయిగా నిలిచింది. తొలి సింగిల్స్‌లో 22 ఏళ్ల రామ్‌కుమార్ రామనాథన్ 6–2, 5–7, 6–2, 7–5తో తెముర్ ఇసామిలోవ్పై గెలుపొందగా... రెండో సింగిల్స్‌లో డేవిస్‌కప్‌లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న 26 ఏళ్ల ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 7–5, 3–6, 6–3, 6–4తో సంజార్ ఫెజీబ్ను ఓడించాడు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో భారత్‌కు విజయం దక్కితే సెప్టెంబరులో జరిగే ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు బెర్త్ ఖాయమవుతుంది. ఈ పోటీలో తమ ఆశలు సజీవంగా ఉండాలంటే డబుల్స్‌లో ఉజ్బెకిస్తాన్ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇసామిలోవ్తో 3 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్‌కు రెండో సెట్, నాలుగో సెట్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. డేవిస్‌కప్‌లో తన ఏడో మ్యాచ్ ఆడుతోన్న రామ్‌కుమార్ తొలి సెట్లో ఇసామిలోవ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. రెండో సెట్లోని 12వ గేమ్‌లో రామ్‌కుమార్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఇసామిలోవ్ సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్లో రామ్‌కుమార్ మళ్లీ విజృంభించి రెండు బ్రేక్ పాయింట్లు సంపాదించాడు. నాలుగో సెట్ హోరాహోరీగా సాగినా 11వ గేమ్‌లో ఇసామిలోవ్ సర్వీస్‌ను రామ్‌కుమార్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో రామ్‌కుమార్ 16 ఏస్‌లు సంధించి, 14 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఫెజీబ్తో 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. డేవిస్‌కప్‌లో తనకు లభించిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎడంచేతి వాటం క్రీడాకారుడైన ప్రజ్నేశ్ మూడో సెట్లో 1–3తో వెనుకబడ్డా వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను దక్కించుకోవడం విశేషం. నాలుగో సెట్లోనూ ఈ చెన్నై ప్లేయర్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. -
పేస్ ఎక్స్‌ప్రెస్‌కు బ్రేక్!
⇒డేవిస్ కప్ జట్టులో చోటు దక్కని లియాండర్ ⇒27 ఏళ్లలో ఇదే తొలిసారి ⇒బోపన్నకే ప్రాధాన్యతనిచ్చిన మహేశ్ భూపతి ⇒తీవ్రంగా విరుచుకుపడ్డ పేస్ భారత డేవిస్ కప్ చరిత్రలో ఒక శకం ముగిసింది! దాదాపు మూడు దశాబ్దాలుగా జట్టులో అంతర్భాగమై పలు చిరస్మరణీయ విజయాలు అందించిన లియాండర్ పేస్‌కు మ్యాచ్ బరిలోకి దిగే తుది జట్టులో స్థానం లభించలేదు. ఉజ్బెకిస్తాన్‌తో జరిగే పోరులో డబుల్స్ మ్యాచ్‌లో పేస్‌ను కాదని రోహన్ బోపన్నను నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి ఎంచుకున్నారు. బెంగళూరులో పరిస్థితులే కారణమంటూ మహేశ్ వివరణ ఇచ్చినా... తనతో పాత విభేదాల వల్ల కావాలనే పక్కన పెట్టినట్లు పేస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డేవిస్‌కప్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా నిలిచేందుకు కేవలం ఒక విజయం దూరంలో ఉన్న సమయంలో చోటు కోల్పోయిన ఈ దిగ్గజం ఇక ముందు దేశం తరఫున ఆడటం దాదాపు అసాధ్యం కావచ్చు! బెంగళూరు: లియాండర్ పేస్ తొలి సారిగా భారత్ తరఫున 1990లో జపాన్‌తో జైపూర్‌లో జరిగిన డేవిస్ కప్ మ్యాచ్ బరిలోకి దిగాడు. నాటినుంచి ఇప్పటి వరకు అతను అందుబాటులో ఉన్న ప్రతీ సారి బరిలోకి దిగాడు. గాయంలాంటి కారణాలతో తనంతట తాను తప్పుకోవడం మినహా ఫామ్ పేరుతో పేస్‌ను ఒక్కసారి కూడా తప్పించలేదు. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో అతడిని పక్కన పెట్టారు. నేటి నుంచి ఆదివారం వరకు ఇక్కడ జరిగే ఆసియా/ఓసియానియా గ్రూప్ 1 మ్యాచ్‌లో తలపడే నలుగురు సభ్యుల భారత జట్టును గురువారం నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి ప్రకటించారు. డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ కలిసి ఆడతారు. సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఒలింపిక్స్ కాంస్య పతకం, 18 గ్రాండ్‌స్లామ్‌ల టైటిల్స్ విజేత పేస్ కంటే కూడా బోపన్న వైపు భూపతి మొగ్గు చూపారు. ప్రస్తుతం ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో పేస్ 53వ స్థానంలో ఉండగా, బోపన్న 24వ స్థానంలో కొనసాగుతున్నాడు. ‘ఇక్కడి వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతుంటాయి. రోహన్ చాలా బాగా సర్వీస్ చేస్తున్నాడు. అతని ఎంపికకు అదే ప్రధాన కారణం. పేస్‌ను తప్పించాలనేది చాలా కఠిన నిర్ణయం. అందుకే దానిని తీసుకునేందుకు ఆలస్యమైంది. నేను మొదటి నుంచి ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లనే ఎంచుకోవాలని భావిస్తూ వచ్చాను. ఎందుకంటే వీరిలో ఇద్దరికి డేవిస్‌కప్‌లో ఆడిన అనుభవం లేదు. అందుకే ఇద్దరు డబుల్స్ స్పెషలిస్ట్‌లను తీసుకునే సాహసం చేయలేకపోయాను. అయితే టాప్–5లో ఉంటే తప్ప డబుల్స్ స్పెషలిస్ట్‌లు అనేదానిని నేను నమ్మను’ అని భూపతి వివరించారు. పేస్ బుధవారమే నగరానికి వచ్చాడని, అతనితో పోలిస్తే గత ఆదివారంనుంచి కలిసి సాధన చేస్తున్న రోహన్, బాలాజీలకే మంచి విజయావకాశాలు ఉంటాయని భూపతి అభిప్రాయ పడ్డారు. పేస్ కాస్త ముందుగా వచ్చి ఉంటే తమ ఆలోచనలో కూడా మార్పు ఉండేదేమోనన్న మహేశ్... ఈ మ్యాచ్‌కు దూరమైనంత మాత్రాన పేస్ కెరీర్ ముగిసినట్లు కాదని అన్నారు. ఇందుకా నన్ను పిలిచింది! డేవిస్ కప్ జట్టునుంచి తనను తొలగించడం పట్ల లియాండర్ పేస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను కావాలని తప్పించేందుకే అర్హతా ప్రమాణాలను ఇష్టారాజ్యంగా మార్చుకున్నారని అతను విమర్శించాడు. తనకు, భూపతికి మధ్య ఉన్న విభేదాలే అందుకు కారణం కావచ్చని పేస్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ‘జట్టు ఎంపిక ఒకసారేమో ర్యాంకింగ్స్ ప్రకారం జరుగుతుంది. మరోసారి వారి ఇష్టాలు, వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా జరుగుతుంది. కొన్ని సార్లు వ్యక్తిగతంగా కాకుండా ఎడమ వైపు కోర్టులో ఎవరు ఆడతారు, కుడి వైపు కోర్టులో ఎవరు ఆడతారు అనేదానిపై చర్చించి నిర్ణయిస్తారు. ఇప్పుడేమో ఫామ్‌ను బట్టి తీసుకుంటారు. ఫామ్ మాటకొస్తే ఎవరు బాగా ఆడుతున్నారో అందరికీ తెలుసు’ అని పేస్ తీవ్రంగా విరుచుకు పడ్డాడు. గత వారమే పేస్ లియోన్‌లో జరిగిన మెక్సికో చాలెంజర్ టైటిల్‌ను గెలిచాడు. కొందరు ఇక్కడి వాతావరణం గురించి మాట్లాడుతున్నారని, అయితే సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న లియోన్‌లో టోర్నీ నెగ్గిన తనకు 920 మీటర్ల ఎత్తులో ఉన్న బెంగళూరులో ఆడటంలో సమస్య ఎలా ఎదురవుతుందని పేస్ వ్యంగ్యంగా అన్నాడు. కేవలం దేశంపై ప్రేమతో తాను సుదీర్ఘ ప్రయాణం చేసి మెక్సికోనుంచి వచ్చానని, ఇలా అవమానించకుండా ఫోన్లోనే చోటు లేదని చెప్పేస్తే సరిపోయేదని అతను చెప్పాడు. ‘పరిణామాలు ఎలా ఉన్నా దేశం పట్ల నా ప్రేమ షరతులు లేనిది. అందుకే ఇంత దూరం వచ్చాను. ఒక ఫోన్ చేసి నేను కావాలా వద్దా అని చెబితే ఇంత రచ్చ జరగకపోయేది కదా. అయితే నేను మున్ముందు ఇంకా ఎక్కువగా శ్రమిస్తాను. మళ్లీ భారత్ తరఫున డేవిస్ కప్ ఆడతాననే నమ్మకముంది’ అని పేస్ ఉద్వేగంగా చెప్పాడు. నేడు ఎవరితో ఎవరు? రామ్‌కుమార్& తేమూర్ ఇస్మయిలోవ్ (తొలి సింగిల్స్) ప్రజ్నేశ్ గుణేశ్వరన్& ఫైజీవ్ (రెండో సింగిల్స్) -
డబుల్స్ జోడీపై నిర్ణయం తీసుకోలేదు
డేవిస్ కప్ కెప్టెన్ మహేశ్ భూపతి బెంగళూరు: ఉజ్బెకిస్తాన్‌తో జరిగే డేవిస్ కప్ మ్యాచ్‌లో భారత డబుల్స్ జోడీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తెలిపారు. ఆసియా ఓషియానియా జోన్ గ్రూప్–1 రెండో రౌండ్ మ్యాచ్ ఈనెల 7 నుంచి 9 వరకు జరగనుంది. అయితే జట్టు తరఫున నలుగురు సింగిల్స్ ఆటగాళ్లను భూపతి ఎంచుకోవడంతో డబుల్స్ జోడీపై ఆసక్తి పెరిగింది. లియాండర్ పేస్, రోహన్ బోపన్నలను రిజర్వ్‌లుగా ఉంచారు. ‘విజయాలతో మూడు పాయింట్లు ఎలా సాధించాలనే దానిపైనే మా దృష్టి ఉంది. ఏ ఒక్క మ్యాచ్ గురించో ఆలోచించడం సరికాదు. చాలా రోజులుగా డబుల్స్ మ్యాచ్ గురించే చాలా మంది మాట్లాడుతున్నారు. మరో రెండు రోజుల దాకా స్పష్టత రాదు’ అని భూపతి తేల్చారు. అయితే యూకీ బాంబ్రీ గాయం కారణంగా దూరం కావడంతో పేస్, బోపన్నలో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇస్టోమిన్ దూరం: మరోవైపు ఉజ్బెకిస్తాన్ స్టార్ ప్లేయర్, ప్రపంచ 71వ ర్యాంకర్ డెనిస్ ఇస్టోమిన్ గాయం కారణంగా భారత్‌తో జరిగే మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఎడమ పాదంలో గాయమవడంతో అతను రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోనున్నాడని ఉజ్బెకిస్తాన్ కెప్టెన్ పీటర్ లెబెడ్ తెలిపారు. క్వార్టర్ ఫైనల్లో శ్యామ్ న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్లో థాయ్‌లాండ్ బాక్సర్ థాని నరీన్రామ్పై శ్యామ్ గెలుపొందాడు. శ్యామ్‌తోపాటు మనోజ్ కుమార్ (69 కేజీలు), రోహిత్ టోకస్ (64 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే వికాస్ కృషన్ (75 కేజీలు), శివ థాపా (60 కేజీలు), దేవేంద్రో సింగ్ (52 కేజీలు)తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
రిజర్వ్ సభ్యులుగా పేస్, బోపన్న
తుది జట్టులో నలుగురూ సింగిల్స్ ఆటగాళ్లే: భూపతి న్యూఢిల్లీ: డేవిస్ కప్ కోసం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి నొప్పింపక... తానొవ్వక పద్ధతిని అవలంభించాడు. లియాండర్ పేస్, రోహన్ బోపన్న ఈ ఇద్దరు డబుల్స్ ఆటగాళ్లలో ఒకరికి తీపి, మరొకరికి చేదు పంచలేక ఆ ఇద్దరినీ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంచుకున్నాడు. తుది జట్టు కోసం అతను పూర్తిగా నలుగురు సింగిల్స్ ఆటగాళ్లనే తీసుకున్నాడు. ప్రస్తుతానికైతే రామ్‌కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ, ప్రజ్నేశ్ గున్నేశ్వరన్, శ్రీరామ్ బాలాజీలు తుది జట్టు సభ్యులని భూపతి ప్రకటించాడు. ఒకవేళ అప్పటి అవసరానికి అనుగుణంగా డబుల్స్ కోసం బోపన్న, పేస్లలో ఒకరిని తీసుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ తప్పకుండా తీసుకుంటామని మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు ఆ అవకాశముంటుం దని బదులిచ్చాడు. డేవిస్‌కప్ ఆసియా ఓసియానియా పోరులో భాగంగా భారత్ వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకు ఉజ్బెకిస్తాన్‌తో తలపడనుంది. ప్రస్తుతం డేవిస్ కప్‌లో రికార్డు డబుల్స్ విజయాలపై కన్నేసిన పేస్ తనకా అవకాశం వస్తుందో రాదో తెలుసుకునేందుకు ఇంకొంత కాలం నిరీక్షించక తప్పదేమో! 42 విజయాలతో పేస్, నికోలా పీట్రాంజెలి (ఇటలీ) రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. -
పేస్‌కు చోటు లభించింది కానీ...
న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ టెన్నిస్ జట్టులో సీనియర్, దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్‌కు చోటు దక్కింది. అయితే మ్యాచ్‌లో బరిలోకి దిగే విషయాన్ని మాత్రం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతికి అప్పగించారు ‘ఐటా’ సెలక్టర్లు. సోమవారం సమావేశమైన ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సెలక్షన్ కమిటీ ఆరుగురితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు సింగిల్స్ ఆటగాళ్లున్నారు. రామ్‌కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ, ప్రజ్ఞేశ్ గున్నెశ్వరన్, శ్రీరామ్ బాలాజీలను సింగిల్స్ కోసం ఎంపిక చేయగా... రోహన్ బోపన్న, లియాండర్ పేస్ డబుల్స్ ఆటగాళ్లు. అయితే బరిలోకి దిగే నలుగురిని కెప్టెన్ మహేశ్ భూపతి నిర్ణయిస్తారని ‘ఐటా’ కార్యదర్శి హిరణ్మయ్ ఛటర్జీ తెలిపారు. ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్ పోరులో భాగంగా భారత్... ఉజ్బెకిస్తాన్‌తో తలపడుతుంది. బెంగళూరులో వచ్చే నెల 7 నుంచి ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. దీనికి సరిగ్గా పది రోజుల ముందు తుది నలుగురు ఆటగాళ్లను భూపతి ఎంపిక చేసుకుంటాడని ఛటర్జీ పేర్కొన్నారు. మరో విజయం సాధిస్తే పేస్ డేవిస్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ విజయాలు సాధించిన క్రీడాకారుడిగా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. -
'మహేశ్ భూపతికి అర్హత ఉంది'
చెన్నై: భారత టెన్నిస్‌కు రెండు కళ్లుగా భావించే లియాండర్ పేస్, మహేశ్ భూపతి కలిసి ఎన్ని విజయాలు సాధించినా ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం అందరికీ తెలిసిందే. అయితే మహేశ్ భూపతిని భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ నియమించడాన్ని లియాండర్ పేస్ సమర్ధించాడు. భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా చేసే అన్ని అర్హతలూ భూపతికి ఉన్నాయని పేర్కొన్నాడు. దాంతో పాటు తన వీడ్కోలుపై కూడా సూచాయగా కొన్ని విషయాలను పేస్ వెల్లడించాడు. 'నేను ప్రస్తుతం సరదాగా కోసం ఆడుతున్నాను. నేను గేమ్‌ను ప్రేమిస్తున్నాను కాబట్టే ఇంకా ఆడుతున్నా. నేను వీడ్కోలు తీసుకునే నిర్ణయం తప్పకుండా వస్తుంది. ఆ సమయంలో అందరికీ చెప్పే టెన్నిస్ జీవితం నుంచి వైదొలుగుతా. మీరంతా నన్ను 20 ఏళ్లుగా అభిమానిస్తున్నారు. రాబోవు కాలంలో ఏమి జరుగుతుందో చూద్దాం. డేవిస్ కప్ కెప్టెన్‌గా చేసే అన్ని అర్హతలు మహేశ్ భూపతికి ఉన్నాయి. డేవిస్ కప్ కు భూపతికి ఎందుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ చేయకూడదు' అని భూపతి పేర్కొన్నాడు. -
భూపతి కొత్త ఇన్నింగ్స్
భారత డేవిస్‌కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా నియామకం న్యూజిలాండ్‌తో పోటీ తర్వాత బాధ్యతల స్వీకరణ రోహన్ బోపన్నపై వేటు న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. వచ్చే ఏడాదిలో అతను భారత డేవిస్ కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. 42 ఏళ్ల మహేశ్ భూపతి 1995లో క్రొయేషియాతో మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2011 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 35 డేవిస్ కప్ పోటీల్లో బరిలోకి దిగాడు. మొత్తం 55 మ్యాచ్‌లు ఆడి 35 మ్యాచ్‌ల్లో గెలిచి, 20 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా భూపతి మిక్స్డ్ డబుల్స్‌లో ఎనిమిది, పురుషుల డబుల్స్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు. ప్రస్తుత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్‌కు ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు పుణేలో న్యూజిలాండ్‌తో జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్ చివరిది కానుంది. ఈ నెలాఖరుతోనే ఆనంద్ అమృత్‌రాజ్ ఒప్పందం గడువు పూర్తి కానుంది. అయితే 64 ఏళ్ల అమృత్‌రాజ్‌కు గౌరవసూచకంగా ఆయనను మరో రెండు నెలలపాటు ఈ పదవిలో కొనసాగించాలని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. ‘కెప్టెన్‌గా అందరికీ అవకాశం రావాలి. ఏ పదవీ శాశ్వతంగా ఏ ఒక్కరికీ సొంతం కాదు. మహేశ్ భూపతితో వ్యక్తిగతంగా మాట్లాడాం. కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తావా అని అడిగితే అతను అంగీకరించాడు. దాంతో ఈ మార్పు జరుగుతుంది. అమృత్‌రాజ్‌కు గౌరవప్రదంగా వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనను న్యూజిలాండ్‌తో పోటీకి కెప్టెన్‌గా కొనసాగిస్తున్నాం’ అని ఏఐటీఏ సెక్రటరీ జనరల్ హిరణ్మయ్ చటర్జీ తెలిపారు. కొత్త కోచ్ ఎంపిక విషయంలో మాత్రం ఏఐటీఏ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత కోచ్ జీషాన్ అలీనే కొంతకాలం కొనసాగించనున్నారు. కోచ్ పదవి కోసం సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, రమేశ్ కృష్ణన్‌తో ఏఐటీఏ ఎలాంటి సంప్రదింపులు చేయలేదని హిరణ్మయ్ స్పష్టం చేశారు. మరోవైపు ఎస్పీ మిశ్రా, రోహిత్ రాజ్‌పాల్, నందన్ బాల్, జీషాన్ అలీ, హిరణ్మయ్ చటర్జీలతో కూడిన సెలెక్షన్ కమిటీ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేసింది. భారత నంబర్‌వన్ డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్నపై వేటు పడింది. జోడీగా డబుల్స్ మ్యాచ్‌ల్లో లియాండర్ పేస్–రోహన్ బోపన్న ఆశించిన ఫలితాలు సాధించలేదని కమిటీ అభిప్రాయపడింది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ మైనేని–లియాండర్ పేస్ జంట అద్భుతంగా ఆడిందని ఈ కమిటీ గుర్తు చేసింది. బోపన్నను ఎంపిక చేస్తే సింగిల్స్‌లో మూడో ఆటగాడిని ఎంపిక చేసే అవకాశం చేజారుతుందని చీఫ్ సెలెక్టర్ మిశ్రా తెలిపారు. భారత డేవిస్‌కప్ జట్టు: లియాండర్ పేస్, యుకీ బాంబ్రీ, సాకేత్ మైనేని, రామ్‌కుమార్ రామనాథన్, ప్రఘ్నేశ్ గుణేశ్వరన్. -
భూపతిని ఎప్పటికీ గౌరవిస్తా: పేస్
ముంబై: భారత టెన్నిస్‌కు రెండు కళ్లుగా భావించే లియాండర్ పేస్, మహేశ్ భూపతి కలిసి ఎన్ని విజయాలు సాధించినా ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం అందరికీ తెలిసిందే. అయితే తన ఒకనాటి మిత్రుని గురించి పేస్ పెదవి విప్పాడు. తామిద్దరి మనస్తత్వాలు విభిన్నమని, భూపతిపై తనకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదని స్పష్టం చేశాడు. ‘నేను, భూపతి భిన్న ధృవాలం. ఎవరికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నాం. మా ఇద్దరిలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అంటే చెప్పలేను. ఎందుకంటే ఇద్దరిదీ తప్పు ఉండొచ్చు.. ఇద్దరిదీ కరెక్టే అయి ఉండొచ్చు. ఆటలోనూ ఎవరి శైలి వారిదే. కానీ మా ఇద్దరి మధ్య గౌరవం ఉంది. వ్యక్తిగతంగా మేమెంతో సాధించాం. అది ఎక్కడికీ పోదు. నేను అతడితో కలిసి సాధించిన విజయాల కారణంగా భూపతిని కచ్చితంగా గౌరవిస్తాను’ అని ‘ఒలింపిక్ పతకం ఎలా గెలవాలి?’ అనే కార్యక్రమంలో పాల్గొన్న పేస్ తెలిపాడు. పేస్, భూపతి కలిసి గతంలో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచారు. -
సన్నద్ధం కాకుండానే...
* ‘రియో’లో పేస్-బోపన్న జంట * వైఫల్యంపై భూపతి అభిప్రాయం ముంబై: ఎలాంటి సన్నాహాలు లేకుండా రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నందుకే లియాండర్ పేస్-రోహన్ బోపన్న జంట తొలి రౌండ్లోనే నిష్కమ్రించిందని భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి అభిప్రాయపడ్డాడు. ‘పేస్-బోపన్న కలసి సాధన చేయలేదు. మేమిద్దరం ఏథెన్‌స, బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆడిన సమయంలో పలు టోర్నమెంట్లలో కలిసి ఆడాం. కానీ పేస్-బోపన్న అలా చేయలేదు. ఫలితంగా పురుషుల డబుల్స్‌లో పతకంపై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న-సానియా జంటకు పతకం నెగ్గే అవకాశం లభించినా వదులుకున్నారు’ అని ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా భూపతి వ్యాఖ్యానించాడు. -
ఇలా ప్రిపేర్ అయితే పతకం వస్తుందా?
భారత టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్, రోహన్ బోపన్న రియో ఒలింపిక్స్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని వెటరన్ ఆటగాడు మహేష్ భూపతి తప్పుపట్టాడు. రియో ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ డబుల్స్‌లో పేస్, బోపన్న జోడీ తొలిరౌండ్లోనే ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 'ఈ మెగా ఈవెంట్‌కు ముందు పేస్, బోపన్నలు సరిగా సాధన చేయలేదు. అత్యున్నత స్థాయి ఈవెంట్లు, మ్యాచ్‌లు ఆడలేదు. వీళ్లు పతకాలు గెలుస్తారని అంచనా వేయలేదు. 2004, 2008 ఒలింపిక్స్‌కు ముందు నేను, లియాండర్ ఎన్నో ఈవెంట్లలో ఆడాం. ఒత్తిడిని అధిగమించడానికి ఇది ఎంతో కీలకం. అయితే ఈ ఏడాది ఇలా సాధన చేయలేదు కాబట్టే విఫలమయ్యాం' అని మహేష్ భూపతి అన్నాడు. -
ప్రిక్వార్టర్స్‌లో భూపతి జంట
న్యూఢిల్లీ: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో మహేశ్ భూపతి (భారత్)-ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) ద్వయం శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో భూపతి-మార్టిన్ జంట 6-7 (3/7), 7-5, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)-గిడో పెల్లా (అర్జెంటీనా) జోడీని ఓడించింది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భూపతి జంట ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో కీలకదశలో పాయింట్లు నెగ్గి విజయాన్ని దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్‌లో అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా)-నెనాద్ జిమోనిచ్ (సెర్బియా)లతో భూపతి-మార్టిన్ తలపడతారు. ఇదే టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ జంట రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా)కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
క్వార్టర్స్‌లో సాకేత్
యానింగ్ (చైనా): కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత రెండో ర్యాంకర్ సాకేత్ మైనేనికి మిశ్రమ ఫలితాలు లభించాయి. సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన ఈ హైదరాబాద్ ప్లేయర్... డబుల్స్ విభాగంలో మాత్రం తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సాకేత్ 6-3, 7-6 (7/4)తో నికొలస్ బారింటస్ (కొలంబియా)పై విజయం సాధించాడు. డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్-మహేశ్ భూపతి (భారత్) జంట 4-6, 4-6తో డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)-అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆర్థర్ డీగ్రీఫ్ (బెల్జియం)తో సాకేత్ ఆడతాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సాకేత్
న్యూఢిల్లీ: గతవారం ముగిసిన ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సాకేత్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 158వ ర్యాంక్‌లో నిలిచాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ ఎనిమిది స్థానాలు పడిపోయి 107వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గతవారమే కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడాభివృద్ధి నిధి నుంచి యూకీకి రూ. 37 లక్షలు... సాకేత్‌కు రూ. 36 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసింది. గతేడాది ఢిల్లీ ఓపెన్ విజేతగా నిలిచిన సోమ్‌దేవ్ ఈసారి టోర్నీలో ఆడకపోవడంతో 87 స్థానాలు పడిపోయి 279వ ర్యాంక్‌లో నిలిచాడు. ఢిల్లీ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గిన మహేశ్ భూపతి డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 61 స్థానాలు పురోగతి సాధించి 225వ ర్యాంక్‌లో నిలిచాడు. రోహన్ బోపన్న ఎనిమిదో ర్యాంక్‌లో, లియాండర్ పేస్ 57వ ర్యాంక్‌లో ఉన్నారు. -
సాకేత్ జోరు
న్యూఢిల్లీ : ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించిన సాకేత్... డబుల్స్ విభాగంలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) ద్వయం 6-3, 6-3తో టాప్ సీడ్ దివిజ్ శరణ్ (భారత్)-ఫ్లావియో సిపొల్లా (ఇటలీ) జంటపై సంచలన విజయం సాధించింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6-4, 6-1తో జె లీ (చైనా)ను ఓడించాడు. శనివారం జరిగే డబుల్స్ ఫైనల్లో మహేశ్ భూపతి-యూకీ బాంబ్రీ (భారత్) జంటతో సాకేత్-సనమ్ తలపడతారు. -
సెమీస్‌లో భూపతి-యూకీ
సాకేత్ ద్వయం కూడా.. ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ టోర్నీ న్యూఢిల్లీ: తొలిసారి కలిసి ఆడుతున్న సీనియర్ ఆటగాడు మహేశ్ భూపతి-యూకీ బాంబ్రీ జోడి... ఢిల్లీ ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో భూపతి-బాంబ్రీ 7-5, 6-1తో యానిక్ మెర్టెన్స్ (బెల్జియం)-స్టీఫెన్ రొబెర్ట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. మోచేతి గాయం నుంచి కోలుకున్న యూకీ బేస్‌లైన్ సర్వీస్‌లతో అదరగొట్టాడు. మోకాలి గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న భూపతి కూడా మునుపటి షాట్లతో అలరించాడు. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సాకేత్ మైనేని-సనమ్ సింగ్ 7-6 (4), 6-4తో విజయ్ సుందర్ ప్రశాంత్-జీవన్ నెదుచెలియాన్పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో ప్రజనీష్ జ్ఞానేశ్వరన్‌కు వాకోవర్ లభించింది. కడుపు నొప్పి కారణంగా ఏడోసీడ్ యాన్ బాయ్ (చైనా) మ్యాచ్ నుంచి వైదొలిగాడు. -
‘ఆట’ మొదలు
►భారత టెన్నిస్‌లో మళ్లీ రభస ►రియో ఒలింపిక్స్ ‘మిక్స్డ్’ జోడీపై చర్చ ►రాబోయే మూడు నెలలు కీలకం నాలుగేళ్ల క్రితం... లండన్ ఒలింపిక్స్ ముందు... భారత టెన్నిస్‌లో పెద్ద వివాదమే రేగింది. డెడ్‌లైన్ సమీపించేవరకు డబుల్స్‌లో పాల్గొనే క్రీడాకారులెవరో తేలలేదు. సానియా-పేస్ జతగా మిక్స్డ్ బరిలోకి దిగగా... పేస్‌తో కలిసి డబు ల్స్ ఆడేందుకు బోపన్న, భూపతి నిరాకరించారు. మొత్తం మీద ఆనాడు జరిగిన చర్చతో సానియా తలపట్టుకుంది. ‘నా అభిప్రాయాన్ని ఎవరూ అడగడం లేదు. పురుషాధిక్య సమాజం అయిపోయింది’ అని సానియా వ్యాఖ్యానించే స్థాయికి పరిస్థితి వెళ్లింది. రకరకాల వివాదాల తర్వాత లండన్ వెళ్లినా మొత్తం అందరూ రిక్తహస్తాలతో వచ్చారు. ఈసారి మళ్లీ రియో ఒలింపిక్స్ దగ్గరకి రాగానే రభస మొదలైంది. పేస్, బోపన్న ఇద్దరూ రెగ్యులర్‌గా అన్ని టోర్నీలలో ఆడుతూ ఉండటం, భూపతి కొంతకాలంగా టెన్నిస్‌కు దూరంగా ఉండటం వల్ల... ఈసారి అంతా సాఫీగా సాగుతుందని భావించిన తరుణంలో, భూపతి మళ్లీ రాకెట్ పట్టాడు. ఈసారి సానియా సూపర్ ఫామ్‌లో ఉంది. ప్రపంచ నంబర్‌వన్. కాబట్టి దాదాపుగా పతకం ఖాయం అనే భావనలో అందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ముగ్గురూ సానియా జతగా రియోలో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ప్రస్తుతం టెన్నిస్ డబుల్స్‌లో సానియా ఓ సంచలనం. మహిళల డబుల్స్ నంబర్‌వన్ క్రీడాకారిణిగా తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. అటు పేస్, బోపన్న కూడా నిలకడగా విజయాలు సాధిస్తున్నారు. కాబట్టి రియో ఒలింపిక్స్‌కు ఈసారి పేస్-బోపన్న డబుల్స్‌లో, సానియా-పేస్ మిక్స్‌డ్‌లో వెళ్లే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సీన్ మారిపోయింది. భూపతి మళ్లీ రాకెట్ పట్టి టోర్నీలు ఆడుతున్నాడు. దీంతో ఈ రభస ఆరు నెలల ముందే మొదలైంది. ఈసారి ఎవరితో కలిసి ఆడతావ ని సానియాను ముందే మీడియా అడిగింది. ‘ఒలింపిక్స్‌కు ఇంకా చాలా సమయం ఉంది. మిక్స్డ్ డబుల్స్‌లో నా భాగస్వామి ఎవరనేది ఇంకా నిర్ణయించుకోలేదు’ అని ఆమె నుంచి సమాధానం వస్తోంది. మరోవైపు గత లండన్ ఒలింపిక్స్ సమయంలో జరిగిన పరిణామాలు ఈసారి పునరావృతం కాకూడదని, పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా జట్లను ఎంపిక చేయాలని 42 ఏళ్ల లియాండర్ పేస్ ఇప్పటికే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధికారులకు విజ్ఞప్తి చేశాడు. బోపన్న, సానియాలకు నేరుగా ఎంట్రీ! రియో ఒలింపిక్స్ అర్హత నిబంధనలను పరిశీలిస్తే ఈ ఏడాది జూన్ 6న వెలువడే ర్యాంకింగ్స్ ఆధారంగా ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది. పురుషుల, మహిళల డబుల్స్‌లో టాప్-24లో ఉండే ఆటగాళ్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. వీళ్లు తమ భాగస్వామిగా తమ దేశానికే చెందిన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఎంచుకునే వీలుంది. అయితే వాళ్లు గత మూడేళ్లలో (2013 నుంచి 2016 వరకు) డేవిస్ కప్‌లో లేదా ఫెడ్ కప్‌లో తప్పనిసరిగా దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ఈ నిబంధనను తప్పనిసరిగా పాటిస్తే మాత్రం మహేశ్ భూపతికి ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ఎందుకంటే మహేశ్ భూపతి చివరిసారి 2011లో డేవిస్‌కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది జూలై వరకు భారత్‌కు డేవిస్ కప్ మ్యాచ్ లేదు. అయితే ఈ నిబంధనను కచ్చితంగా పాటించాల్సిన అవసరంలేదని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) అధికారొకరు తెలిపారు. ‘డేవిస్‌కప్‌లో ఆడి ఉండాలనే నిబంధనను పరిగణనలోకి తీసుకోకూడదని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఒలింపిక్ కమిటీకి... జాతీయ టెన్నిస్ సంఘం అప్పీల్ చేస్తే సదరు ఆటగాడికి ఒలింపిక్స్‌లో ఆడించే వెసులుబాటును కల్పిస్తారు’ అని ఐటీఎఫ్ అధికారి వివరించారు. ప్రస్తుతం పురుషుల డబుల్స్‌లో ర్యాంకింగ్స్‌లో రోహన్ బోపన్న 8వ స్థానంలో... లియాండర్ పేస్ 52వ, మహేశ్ భూపతి 286వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉంది. ఫలితంగా రోహన్ బోపన్న, సానియా మీర్జాలకు రియో ఒలింపిక్స్‌కు నేరుగా ఎంట్రీ లభించడం ఖాయమైందనుకోవాలి. కంబైన్డ్ ర్యాం కింగ్ ప్రకారమైతే మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న-సానియా కలిసి ఆడొచ్చు. ఒకవేళ లియాండర్ పేస్‌ను తమ భాగస్వామిగా రోహన్ బోపన్న, సానియా మీర్జా వద్దనుకుంటే మాత్రం... రియో ఒలింపిక్స్‌లో పేస్ ఆడాలనుకుంటే జూన్ 6వ తేదీలోపు డబుల్స్‌లో టాప్-24 ర్యాంకింగ్స్‌లో నిలవాలి. టాప్-24లోకి వస్తే పేస్ తనకిష్టమైన భాగస్వామిని ఎంచుకోవచ్చు. గత లండన్ ఒలింపిక్స్ సమయంలో ఇలాగే జరిగింది. 2012లో పేస్ మూడో ర్యాంక్‌లో ఉం డగా... బోపన్న 12వ ర్యాంక్‌లో, మహేశ్ భూపతి 14వ ర్యాంక్‌లో ఉన్నారు. ఫలితంగా బోపన్న-భూపతి ఒక జోడీగా బరిలోకి దిగగా... పేస్ విష్ణువర్ధన్‌ను ఎంచుకున్నాడు. కంబైన్డ్ ర్యాంకింగ్ ఆధారంగా పేస్-సానియాలు మిక్స్డ్ డబుల్స్‌లో ఆడారు. ఫామ్‌లో లేని పేస్ గత కొంతకాలంగా లియాండర్ పేస్ ఫామ్‌లో లేడు. ఈ ఏడాది అతను పాల్గొన్న నాలుగు టోర్నీల్లో ముగ్గురు వేర్వేరు భాగస్వాములతో కలిసి ఆడాడు. ఒక్క టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకోలేదు. గతేడాది జనవరిలో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో కలిసి పేస్ చివరిసారిగా ఆక్లాండ్ ఓపెన్ టైటిల్‌ను సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతనికి మరో టైటిల్ కూడా లభించలేదు. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లు మాత్రం కేవలం గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనే జరుగుతాయి. రియో ఒలింపిక్స్‌కు ముందు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఉన్నాయి. ఒకవేళ ఒలింపిక్స్కల్లా సమన్వయం కుదరాలంటే భారత స్టార్స్ పేస్, బోపన్న, భూపతిలలో ఒకరితో కలిసి సానియా ఈ రెండు టోర్నీల్లో ఆడితే బాగుంటుంది. గతంలో పేస్‌తో కలిసి సానియా 2006 దోహా ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించగా... భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009), ఫ్రెంచ్ ఓపెన్ (2012) టోర్నీల్లో విజేతగా నిలిచింది. సీన్లోకి మహేశ్ భూపతి! ఇప్పటివరకైతే లియాండర్ పేస్, రోహన్ బోపన్న, సానియా మీర్జాలకే రియో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయని భావించారు. అయితే గత రెండేళ్లుగా అంతగా ఫామ్‌లో లేని 41 ఏళ్ల మహేశ్ భూపతి గాయం నుంచి కోలుకున్నాక మళ్లీ రాకెట్ పట్టాడు. ఢిల్లీలో జరుగుతోన్న ఏటీపీ చాలెంజర్ టోర్నీలో యూకీ బాంబ్రీతో కలిసి బరిలోకి దిగాడు. దాంతో మరోసారి ఒలింపిక్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భూపతి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే భూపతి మాత్రం దాంట్లో నిజం లేదంటున్నాడు. ‘ఇప్పటికైతే రియో ఒలింపిక్స్‌లో ఆడాలనే ఆలోచన లేదు. మోకాలి గాయం నుంచి కోలుకున్నాను. కేవలం ఆటను ఆస్వాదించడానికే మళ్లీ రాకెట్ పట్టాను. ఆడాలనే ఆకాంక్ష తగ్గిన మరుక్షణమే రాకెట్‌ను పక్కన పెట్టేస్తాను. అది వచ్చే వారం కూడా జరగొచ్చు’ అని మహేశ్ భూపతి వ్యాఖ్యానిస్తున్నాడు. అతని మాటల్లో ఎంత నిజం ఉందో రాబోయే కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.