సాకేత్ జోరు | Saketh joru | Sakshi
Sakshi News home page

సాకేత్ జోరు

Published Sat, Feb 20 2016 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

సాకేత్ జోరు

సాకేత్ జోరు

న్యూఢిల్లీ : ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించిన సాకేత్... డబుల్స్ విభాగంలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) ద్వయం 6-3, 6-3తో టాప్ సీడ్ దివిజ్ శరణ్ (భారత్)-ఫ్లావియో సిపొల్లా (ఇటలీ) జంటపై సంచలన విజయం సాధించింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6-4, 6-1తో జె లీ (చైనా)ను ఓడించాడు. శనివారం జరిగే డబుల్స్ ఫైనల్లో మహేశ్ భూపతి-యూకీ బాంబ్రీ (భారత్) జంటతో సాకేత్-సనమ్ తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement