ప్రిక్వార్టర్స్‌లో భూపతి జంట | Bhupathi pair of pre-quarters final | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో భూపతి జంట

Published Thu, May 5 2016 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

Bhupathi pair of pre-quarters final

న్యూఢిల్లీ: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మహేశ్ భూపతి (భారత్)-ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) ద్వయం శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో భూపతి-మార్టిన్ జంట 6-7 (3/7), 7-5, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)-గిడో పెల్లా (అర్జెంటీనా) జోడీని ఓడించింది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భూపతి జంట ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది.

నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో కీలకదశలో పాయింట్లు నెగ్గి విజయాన్ని దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్‌లో అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా)-నెనాద్ జిమోనిచ్ (సెర్బియా)లతో భూపతి-మార్టిన్ తలపడతారు. ఇదే టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ జంట రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా)కు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement