మరీ ఇంత దారుణమా?: మహేశ్‌ భూపతి | Mahesh Bhupathi Slams AITA After Sack Him As Davis Cup captain | Sakshi
Sakshi News home page

మరీ ఇంత దారుణమా?: మహేశ్‌ భూపతి

Published Thu, Nov 7 2019 4:05 PM | Last Updated on Thu, Nov 7 2019 4:07 PM

Mahesh Bhupathi Slams AITA After Sack Him As Davis Cup captain - Sakshi

న్యూఢిల్లీ:  తనను భారత డేవిస్‌కప్‌ నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్సీ పదవి నుంచి  తొలగించడంపై మాజీ టెన్నిస్‌ ఆటగాడు మహేశ్‌ భూపతి ఆవేదన వ్యక్తం చేశాడు. టెన్నిస్‌ కెరీర్‌కు ఎప్పుడో దూరమైన భూపతి.. డేవిస్‌కప్‌ ఆడే భారత జట్టుకు ఇప్పటివరకూ  కెప్టెన్‌గా వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే ఆలిండియా టెన్నిస్‌ అసోసియేషన్‌(ఐటా) అతన్ని కెప్టెన్సీ పదవి నుంచి అర్థాంతరంగా తొలగించడంపై భూపతి మండిపడ్డాడు. మరీ ఇంత దారుణంగా వ్యహరిస్తారా అంటూ ఐటా తీరును తప్పుబట్టాడు. ‘ నన్ను భారత డేవిస్‌కప్‌ కెప్టెన్సీ నుంచి తప్పించాలంటే ఆ పని ముందే చేయాల్సింది.

ఈ ఏడాది ఆరంభంలో ఇటలీతో జరిగిన డేవిస్‌కప్‌లో భారత్‌ ఓడిపోయినప్పుడే కెప్టెన్సీ నుంచి తప్పించాల్సింది. ఇప్పుడు దాన్ని సాకుగా చూపుతూ ఉన్నపళంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇక్కడ ఐటా వ్యవహరించిన తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక్కసారిగా నన్ను తప్పించడం వెనుక కుట్ర జరిగింది. నేను ఎప్పుడూ ఆటగాళ్ల కోసం వారి రక్షణ కోసం ఆలోచిస్తూ వచ్చాను. దానిలో భాగంగానే డేవిస్‌కప్‌ మ్యాచ్‌లు ఆడటానికి పాకిస్తాన్‌ వెళ్లలేమని ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌(ఐటీఎఫ్‌)కు తేల్చిచెప్పాను దాంతో తటస్థ వేదికపై ఆడటానికి ఐటీఎఫ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అక్టోబర్‌ 15వ తేదీన జరిగిన ఒక సమావేశానికి నేను కెప్టెన్సీ హోదాలో హాజరయ్యా.  ఉన్నట్టుండి నా కెప్టెన్సీకి స్వస్థి పలికారు.  నవంబర్‌ 4వ తేదీన నన్ను కెప్టెన్‌గా తొలగిస్తూ ఐటా సెక్రటరీ జనరల్‌ హిరోన్మయ్‌ ఛటర్జీ ఫోన్‌లో చెప్పారు. కానీ కారణాలు చెప్పలేదు. విభజించు-పాలించు  విధానాన్ని ఐటా అవలంభిస్తోంది’ అని మహేశ్‌ భూపతి విమర్శించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement