డబుల్స్‌ జోడీపై నిర్ణయం తీసుకోలేదు | Doubles combination not yet finalized, says Mahesh Bhupathi | Sakshi
Sakshi News home page

డబుల్స్‌ జోడీపై నిర్ణయం తీసుకోలేదు

Published Wed, Apr 5 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

డబుల్స్‌ జోడీపై నిర్ణయం తీసుకోలేదు

డబుల్స్‌ జోడీపై నిర్ణయం తీసుకోలేదు

డేవిస్‌ కప్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి
 

బెంగళూరు: ఉజ్బెకిస్తాన్‌తో జరిగే డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లో భారత డబుల్స్‌ జోడీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి తెలిపారు. ఆసియా ఓషియానియా జోన్‌ గ్రూప్‌–1 రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఈనెల 7 నుంచి 9 వరకు జరగనుంది. అయితే జట్టు తరఫున నలుగురు సింగిల్స్‌ ఆటగాళ్లను భూపతి ఎంచుకోవడంతో డబుల్స్‌ జోడీపై ఆసక్తి పెరిగింది. లియాండర్‌ పేస్, రోహన్‌ బోపన్నలను రిజర్వ్‌లుగా ఉంచారు. ‘విజయాలతో మూడు పాయింట్లు ఎలా సాధించాలనే దానిపైనే మా దృష్టి ఉంది. ఏ ఒక్క మ్యాచ్‌ గురించో ఆలోచించడం సరికాదు. చాలా రోజులుగా డబుల్స్‌ మ్యాచ్‌ గురించే చాలా మంది మాట్లాడుతున్నారు. మరో రెండు రోజుల దాకా స్పష్టత రాదు’ అని భూపతి తేల్చారు. అయితే యూకీ బాంబ్రీ గాయం కారణంగా దూరం కావడంతో పేస్, బోపన్నలో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి.    

ఇస్టోమిన్‌ దూరం:  మరోవైపు ఉజ్బెకిస్తాన్‌ స్టార్‌ ప్లేయర్, ప్రపంచ 71వ ర్యాంకర్‌ డెనిస్‌ ఇస్టోమిన్‌ గాయం కారణంగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు. ఎడమ పాదంలో గాయమవడంతో అతను రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోనున్నాడని ఉజ్బెకిస్తాన్‌ కెప్టెన్‌ పీటర్‌ లెబెడ్‌ తెలిపారు.  

క్వార్టర్‌ ఫైనల్లో శ్యామ్‌
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ కాకర శ్యామ్‌ కుమార్‌ (49 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్‌ బాక్సర్‌ థాని నరీన్‌రామ్‌పై శ్యామ్‌ గెలుపొందాడు. శ్యామ్‌తోపాటు మనోజ్‌ కుమార్‌ (69 కేజీలు), రోహిత్‌ టోకస్‌ (64 కేజీలు) కూడా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే వికాస్‌ కృషన్‌ (75 కేజీలు), శివ థాపా (60 కేజీలు), దేవేంద్రో సింగ్‌ (52 కేజీలు)తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement