ఇలా ప్రిపేర్ అయితే పతకం వస్తుందా? | Paes, Bopanna prepared at all for Rio Games: Bhupathi | Sakshi
Sakshi News home page

ఇలా ప్రిపేర్ అయితే పతకం వస్తుందా?

Published Mon, Aug 29 2016 7:57 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

ఇలా ప్రిపేర్ అయితే పతకం వస్తుందా?

ఇలా ప్రిపేర్ అయితే పతకం వస్తుందా?

భారత టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్, రోహన్ బోపన్న రియో ఒలింపిక్స్కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని వెటరన్ ఆటగాడు మహేష్ భూపతి తప్పుపట్టాడు. రియో ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ డబుల్స్లో పేస్, బోపన్న జోడీ తొలిరౌండ్లోనే ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

'ఈ మెగా ఈవెంట్కు ముందు పేస్, బోపన్నలు సరిగా సాధన చేయలేదు. అత్యున్నత స్థాయి ఈవెంట్లు, మ్యాచ్లు ఆడలేదు. వీళ్లు పతకాలు గెలుస్తారని అంచనా వేయలేదు. 2004, 2008 ఒలింపిక్స్కు ముందు నేను, లియాండర్ ఎన్నో ఈవెంట్లలో ఆడాం. ఒత్తిడిని అధిగమించడానికి ఇది  ఎంతో కీలకం. అయితే ఈ ఏడాది ఇలా సాధన చేయలేదు కాబట్టే విఫలమయ్యాం' అని మహేష్ భూపతి అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement