'మహేశ్ భూపతికి అర్హత ఉంది'
చెన్నై: భారత టెన్నిస్‌కు రెండు కళ్లుగా భావించే లియాండర్ పేస్, మహేశ్ భూపతి కలిసి ఎన్ని విజయాలు సాధించినా ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం అందరికీ తెలిసిందే. అయితే మహేశ్ భూపతిని భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ నియమించడాన్ని లియాండర్ పేస్ సమర్ధించాడు. భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా చేసే అన్ని అర్హతలూ భూపతికి ఉన్నాయని పేర్కొన్నాడు. దాంతో పాటు తన వీడ్కోలుపై కూడా సూచాయగా కొన్ని విషయాలను పేస్ వెల్లడించాడు.
'నేను ప్రస్తుతం సరదాగా కోసం ఆడుతున్నాను. నేను గేమ్ను ప్రేమిస్తున్నాను కాబట్టే ఇంకా ఆడుతున్నా. నేను వీడ్కోలు తీసుకునే నిర్ణయం తప్పకుండా వస్తుంది. ఆ సమయంలో అందరికీ చెప్పే టెన్నిస్ జీవితం నుంచి వైదొలుగుతా. మీరంతా నన్ను 20 ఏళ్లుగా అభిమానిస్తున్నారు. రాబోవు కాలంలో ఏమి జరుగుతుందో చూద్దాం. డేవిస్ కప్ కెప్టెన్గా చేసే అన్ని అర్హతలు మహేశ్ భూపతికి ఉన్నాయి. డేవిస్ కప్ కు భూపతికి ఎందుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ చేయకూడదు' అని భూపతి పేర్కొన్నాడు.