భూపతి జోడి ఓటమి
సెమీస్‌లో బోపన్న జోడి
దుబాయ్ ఓపెన్
దుబాయ్: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ సీనియర్ ఆటగాడు మహేశ్ భూపతి ప్రస్థానం ముగిసింది. డెనిస్ ఇస్తోమిన్ జతగా బరిలోకి దిగిన భూపతి గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఒకప్పటి తన సహచరుడు, భారత్‌కే చెందిన రోహన్ బోపన్న-ఐజమ్ ఖురేషి (పాకిస్థాన్) జోడి చేతిలో ఓడిపోయాడు.
టైబ్రేకర్‌కు దారితీసిన ఈ హోరాహోరీ పోరులో రెండో సీడ్ బోపన్న జోడి 5-7, 7-6(3), 10-7 తేడాతో గెలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో తోమాజ్ బెడ్నారెక్
(పోలండ్)-లూకాస్ డ్లౌహీ (చెక్ రిపబ్లిక్) జంటతో బోపన్న ద్వయం తలపడనుంది.
భూపతికి ఇదే ఆఖరా?
అంతర్జాతీయ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (ఐటీపీఎల్) పేరిట సొంత లీగ్ నిర్వహించే పనిలో ఉన్న మహేశ్ భూపతి.. తాజా ఓటమితో కెరీర్‌కు ఇక ఫుల్‌స్టాప్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సెలక్టివ్ టోర్నీల్లో మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్న భూపతికి ఈ సీజన్‌లో దుబాయ్ ఓపెన్ కేవలం రెండో టోర్నీ మాత్రమే కాగా, ఇకపై అతడు ఆడకపోవచ్చన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. అయితే ఈ విషయమై భూపతి మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.