open tennis tournment
-
HAMBURG OPEN 2022: ఫైనల్లో బోపన్న జంట
న్యూఢిల్లీ: హాంబర్గ్ యూరోపియన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–మాట్వి మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. జర్మనీలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 3–6, 6–3, 10–3తో టాప్ సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబాలస్ (అర్జెంటీనా) జంటపై సంచలన విజయం సాధించింది. లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్లాండ్), టిమ్ పుయెట్జ్ (జర్మనీ)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం తలపడుతుంది. 42 ఏళ్ల బోపన్న తన కెరీర్లో ఇప్పటివరకు 21 డబుల్స్ టైటిల్స్ సాధించగా... ఈ ఏడాది రెండు టోర్నీలలో విజేతగా నిలిచాడు. -
అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీకి షేక్ జాఫ్రీన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బధిర టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జాఫ్రీన్ యూత్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి జూన్ 1 వరకు జర్మనీలోని హంబర్గ్‌లో ఈ టోర్నీ జరగనుంది. నగరానికి చెందిన జీవీకే ఫౌండేషన్ స్పాన్సర్షిప్ చేయడంతో ఆమె అక్కడికి బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు బధిర టెన్నిస్ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమెకు మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ ఉచిత శిక్షణ ఇస్తోంది. గతేడాది బల్గేరియాలోని సోఫియాలో జరిగిన బధిర ఒలింపిక్స్‌లో జాఫ్రీన్ చక్కని ఆటతీరు ప్రదర్శించింది. అక్కడ ఆమె క్వార్టర్ ఫైనల్ దాకా పోరాడింది. 2012లో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ బధిర టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆమె సింగిల్స్, డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించింది. మూడుసార్లు జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున కాంస్య పతకాలు గెలిచింది. -
భూపతి జోడి ఓటమి
సెమీస్‌లో బోపన్న జోడి దుబాయ్ ఓపెన్ దుబాయ్: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ సీనియర్ ఆటగాడు మహేశ్ భూపతి ప్రస్థానం ముగిసింది. డెనిస్ ఇస్తోమిన్ జతగా బరిలోకి దిగిన భూపతి గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఒకప్పటి తన సహచరుడు, భారత్‌కే చెందిన రోహన్ బోపన్న-ఐజమ్ ఖురేషి (పాకిస్థాన్) జోడి చేతిలో ఓడిపోయాడు. టైబ్రేకర్‌కు దారితీసిన ఈ హోరాహోరీ పోరులో రెండో సీడ్ బోపన్న జోడి 5-7, 7-6(3), 10-7 తేడాతో గెలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో తోమాజ్ బెడ్నారెక్ (పోలండ్)-లూకాస్ డ్లౌహీ (చెక్ రిపబ్లిక్) జంటతో బోపన్న ద్వయం తలపడనుంది. భూపతికి ఇదే ఆఖరా? అంతర్జాతీయ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (ఐటీపీఎల్) పేరిట సొంత లీగ్ నిర్వహించే పనిలో ఉన్న మహేశ్ భూపతి.. తాజా ఓటమితో కెరీర్‌కు ఇక ఫుల్స్టాప్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సెలక్టివ్ టోర్నీల్లో మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్న భూపతికి ఈ సీజన్లో దుబాయ్ ఓపెన్ కేవలం రెండో టోర్నీ మాత్రమే కాగా, ఇకపై అతడు ఆడకపోవచ్చన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. అయితే ఈ విషయమై భూపతి మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
రెండో రౌండ్లో సోమ్‌దేవ్
సిడ్నీ: అపియా ఇంటర్నేషనల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన తొలి రౌండ్లో సోమ్‌దేవ్ 6-2, 2-6, 6-4తో నీల్ డెసియన్ (బెల్జియం)పై విజయం సాధించాడు. గతవారం చెన్నై ఓపెన్‌లో అనామక క్రీడాకారుడు రామ్‌కుమార్ చేతిలో అనూహ్య ఓటమి నుంచి తేరుకున్న సోమ్‌దేవ్ మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. ఆదివారం జరిగే రెండో రౌండ్లో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)తో సోమ్‌దేవ్ ఆడుతాడు. సోమవారం మొదలయ్యే మెయిన్ ‘డ్రా’ పోటీల్లో లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడి; రోహన్ బోపన్న (భారత్)-ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) జంట బరిలోకి దిగుతాయి. -
ఉద్ధవ్‌కు టెన్నిస్ టైటిల్
జింఖానా, న్యూస్‌లైన్: వశిష్ట ఓపెన్ టెన్నిస్ టోర్నీ బాలుర అండర్-14 విభాగంలో ఉద్ధవ్ ఠాకూర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. సైనిక్‌పురిలోని కార్నివాల్ క్లబ్లో శ నివారం జరిగిన ఫైనల్లో ఉద్ధవ్ 7-4తో యశోధన్పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఉద్ధవ్ 6-3తో రాహుల్‌పై, యశోదన్ 6-4తో అభిషేక్‌పై నెగ్గారు. అండర్-12 విభాగంలో రాహుల్ 7-2తో శశిధర్‌పై గెలిచి విజేతగా నిలిచాడు. బాలికల అండర్-12 విభాగంలో అమూల్య 7-3తో నిఖితపై గెలుపొందింది. బాలుర అండర్-12 డబుల్స్ విభాగంలో లోకాదిత్య-కృష్ణారెడ్డి జోడి 6-5తో కౌషిక్-యశ్వంత్‌పై నెగ్గి టైటిల్ సాధించారు. వీరితో పాటు అండర్-14 డబుల్స్‌లో ఆదిత్య-సాయి కృష్ణ జోడి 6-1తో లోకాదిత్య-నిహాల్ జంటపై విజయం సాధించింది. బాలికల అండర్-12 డబుల్స్ విభాగంలో సంజన-సృజన జోడి 6-2తో అమాండా గ్జేవియర్-సాహ్విత రాజ్ జోడిపై గెలిచి విజేతగా నిలిచింది. -
అండర్-14 చాంప్ నిఖిత
జింఖానా, న్యూస్‌లైన్: వశిష్ట ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బాలికల అండర్-14 విభాగంలో సింహబట్ల నిఖిత టైటిల్ కైవసం చేసుకుంది. సైనిక్‌పురిలోని కార్నివాల్ క్లబ్లో జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్లో నిఖిత 7-4తో టి.నిఖితపై విజయం సాధించింది. బాలుర అండర్-10 విభాగం ఫైనల్లో శశిధర్ 7-3తో యశ్వంత్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. తనతో పాటు అండర్-8 విభాగంలో రోహిత్ సాయి చరణ్ 6-4తో పూర్వా పారిఖ్‌పై, బాలికల అండర్-8 విభాగంలో దియా రెడ్డి 7-4తో అపూర్వపై, అండర్-10 విభాగంలో అదితి 7-4తో షేక్ కమ్రీన్పై గెలుపొందారు. బాలుర అండర్-12 సెమీఫైనల్లో రాహుల్ 6-2తో బ్రిహత్ను, శశిధర్ 6-2తో షేక్ రెహాన్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకున్నారు. బాలికల అండర్-12 సెమీఫైనల్లో అమూల్య 6-3తో సృజనపై, సింహబట్ల నిఖిత 6-0తో విదీషిపై నెగ్గి ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఇతర ఫలితాలు : బాలుర అండర్-14 క్వార్టర్ ఫైనల్స్: ఉద్ధవ్ ఠాకూర్ 6-1తో మోహిత్ సాయి కుమార్‌పై, రాహుల్ 6-3తో ఆదిత్యపై, యశోదన్ 6-3తో కుషాల్పై, అఖిలేష్ రెడ్డి 6-0తో అభిషేక్‌పై గెలిచారు. -
ఫైనల్లో శశిధర్
జింఖానా, న్యూస్‌లైన్: వశిష్ట ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బాలుర అండర్-10 విభాగంలో శశిధర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. సైనిక్‌పురిలోని కార్నివాల్ క్లబ్లో గురువారం జరిగిన సెమీఫైనల్లో శశిధర్ 6-2తో యువరాజ్‌పై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. తనతో పాటు యశ్వంత్ 6-3తో ఆశిష్‌పై నెగ్గాడు. బాలుర అండర్-12 విభాగం క్వార్టర్ఫైనల్లో రాహుల్ 6-0తో కౌషిక్ కుమార్‌పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. శశిధర్ 6-2తో సయ్యద్ ఖాసిమ్ అలీపై, బ్రిహత్ 6-1తో యువరాజ్‌పై, షేక్ రెహాన్ 6-4తో వంశీకృష్ణా రెడ్డిపై గెలుపొందారు. ఇతర ఫలితాలు. బాలుర అండర్-8 సెమీఫైనల్: రోహిత్ సాయి చరణ్ 5-1తో నిఖిల్ స్వాతి ప్రసాద్‌పై, చాణక్యపై పూర్వా పారిఖ్ (వాకోవర్ ద్వారా) నెగ్గారు. అండర్-14 మూడో రౌండ్: ఉద్ధవ్ ఠాకూర్ 6-0తో ఐ. నిఖిల్‌పై, మోహిత్ సాయి కుమార్ 7-5తో అల్లాన్పై, రాహుల్ 6-0తో కపిల్‌పై, ఆదిత్య 6-3తో బ్రిహత్పై, యశోధన్ 6-2తో రేవంత్‌పై, కుషాల్ 6-5తో పి.నిఖిల్‌పై, అఖిలేశ్ రెడ్డి 6-2తో అర్చిత్‌పై, అభిషేక్ 6-5తో ఆయుష్‌పై నెగ్గారు. బాలికల అండర్-8 ఫైనల్స్: దియా రెడ్డి 7-4తో అపూర్వపై విజయం సాధించింది. అండర్-10 సెమీఫైనల్: అదితి 6-2తో రక్షితపై, షేక్ కామ్రీన్ 6-0తో విదితపై గెలిచారు. అండర్-12 క్వార్టర్ ఫైనల్ : సృజన 6-2తో ఏంజెలా రాచెల్పై, అమూల్య 6-5తో శ్రీహర్షితపై, విదూషి 6-1తో రితికా రెడ్డిపై, నిఖిత 6-1తో సంజనపై గెలుపొందారు. అండర్-14 సెమీఫైనల్: ఎస్. నిఖిత 6-5తో శ్రీహర్షితపై, టి.నిఖిత 6-4తో రితికపై నెగ్గారు. -
మూడో రౌండ్లో సంజన
జింఖానా, న్యూస్‌లైన్: వశిష్ట ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బాలికల అండర్-12 విభాగంలో సంజన మూడో రౌండ్లోకి ప్రవేశించింది. సైనిక్ పురిలోని కార్నివాల్ క్లబ్లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం రెండో రౌండ్లో సంజన 6-0తో మేఘనపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో నిఖిత 6-0తో శ్రేయపై, అమూల్య 6-0తో అమాండా జేవియర్‌పై, శ్రీహర్షిత 6-3తో చిన్మయిపై, రాచెల్ 6-1తో నేహాపై, సృజన 6-1 సుమనపై గెలుపొందారు. ఇతర ఫలితాలు: బాలికల విభాగం అండర్-8 రెండో రౌండ్: దివ్యా రెడ్డి 6-0తో దియపై, అపూర్వ 6-2తో శ్రీనిధి రెడ్డిపై నెగ్గారు. అండర్-10 రెండో రౌండ్: అదితి 6-3తో నేహాపై, విదిత 6-1తో శ్రీనిధి రెడ్డిపై, షైక్ కామ్రీన్ 6-1తో అభయపై గెలిచారు. అండర్-14 రెండో రౌండ్: సుమన 6-0తో రితికా రెడ్డిపై, నిఖిత 6-4తో సృజనపై, నవ్య 6-4తో చిన్మయిపై, శ్రీహర్షిత 6-0తో అక్షితా రెడ్డిపై, రితిక 6-1తో తేజ మానసపై, సయ్యద్ ఆఫ్రీన్ 6-2తో మేఘనా రెడ్డిపై, శ్రేయా రాజ్ 6-4తో ఆన ంద వ ల్లిపై గెలిచారు. బాలుర విభాగం అండర్-8 రెండో రౌండ్: చాణక్య 5-4తో విజయ్‌తేజ పై, పూర్వా పారిఖ్ 5-3తో కబీర్‌పై, నిఖిల్ 5-2తో సంజయ్‌పై నెగ్గారు. అండర్-10 రెండో రౌండ్: యువరాజ్ 6-5తో హర్షపై, శశిధర్ 6-0తో అజ్లాన్ అలీపై, ఆశీష్ 6-1తో నిఖిల్ స్వాతి ప్రసాద్‌పై విజయం సాధించారు. అండర్-12 రెండో రౌండ్: కౌషిక్ కుమార్ రెడ్డి 6-2తో ఆదిత్యపై, రాహుల్ 6-0తో అభిషేక్‌పై, బ్రిహత్ 6-5తో కార్తీక్ రెడ్డిపై, యువరాజ్ 6-1తో లిఖిత్‌పై, ఖాసిం అలీ 6-4తో హితేష్‌పై, శశిధర్ 6-4తో శ్రీకార్తీక్పై, రేహాన్ 6-0తో నిఖిల్ సాయి రాఘవ్‌పై, వంశీకృష్ణా రెడ్డి 6-1తో ప్రణీత్ రెడ్డిపై గెలిచారు. అండర్-14 మూడో రౌండ్: ఉద్ధవ్ ఠాకూర్ 6-0తో నిఖిల్‌పై, మోహిత్ సాయి కుమార్ 7-5తో అల్లాన్పై, రాహుల్ 6-0తో కపిల్‌పై, ఆదిత్య 6-3తో బ్రిహత్పై, అశోధన్ 6-2తో రెవంత్పై, కుషాల్ 6-5తో పి. నిఖిల్‌పై, అఖిలేష్ రెడ్డి 6-2తో అర్చిత్‌పై, అభిషేక్ 6-5తో ఆయుష్‌పై నెగ్గారు.