![HAMBURG OPEN 2022: Rohan Bopanna and Matwe Middelkoop enter to mixed finals - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/23/BOPANNA-DODIG-NOTE.jpg.webp?itok=kVd1C8VZ)
న్యూఢిల్లీ: హాంబర్గ్ యూరోపియన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాట్వి మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. జర్మనీలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 3–6, 6–3, 10–3తో టాప్ సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబాలస్ (అర్జెంటీనా) జంటపై సంచలన విజయం సాధించింది.
లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్‌లాండ్), టిమ్ పుయెట్జ్ (జర్మనీ)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం తలపడుతుంది. 42 ఏళ్ల బోపన్న తన కెరీర్‌లో ఇప్పటివరకు 21 డబుల్స్ టైటిల్స్ సాధించగా... ఈ ఏడాది రెండు టోర్నీలలో విజేతగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment