Hamburg
-
హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం..
జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలోకి చొరబడిన ఓ ఆగంతకుడు కాల్పుల కలకలం సృష్టించాడు. శనివారం రాత్రి విమానాశ్రయంలోకి కారుతో సహా దూసుకువచ్చిన ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన దరిమిలా హాంబర్గ్ విమానాశ్రయంలో ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. ‘కస్టడీ వివాదం’ ఈ ఘటనకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 8 గంటలకు ఒక అగంతకుడు కారులో భద్రతా ప్రాంతం గుండా ఎయిర్‌స్ట్రిప్‌కి ఆనుకొని ఉన్న రహదారి పైకి కారుతో సహా దూసుకువచ్చాడు. అనంతరం తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. కాగా ప్రస్తుతానికి విమానాల టేకాఫ్‌లు, ల్యాండింగ్లను నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 27 విమానాలు దెబ్బతిన్నాయని సమాచారం. కాల్పులు జరిపిన ఆ వ్యక్తి కారులో నుండి రెండు మండుతున్న బాటిళ్లను బయటకు విసిరినట్లు పోలీసులు తెలిపారు.దీంతో మంటలు చెలరేగాయన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్‌లో మళ్లీ భూప్రకంపనలు.. తీవ్రత ఎంతంటే.. -
Hamburg shooting: జర్మనీ చర్చిలో నరమేధం!
బెర్లిన్: జర్మనీలో నరమేధం చోటు చేసుకుంది. గురువారం రాత్రి హాంబర్గ్‌లోని ఓ చర్చిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి కారకులు ఎవరు? కారణాలేంటన్నది తెలియాల్సి ఉంది. ఘటన నేపథ్యంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు, స్థానికులను బయటికి రావొద్దని సూచించారు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హాంబర్గ్ యెహోవా విట్నెస్ సెంటర్ అది. మూడు అంతస్థుల భవనం. మొదటి ఫ్లోర్ నుంచి తుపాకీ పేలిన శబ్ధం వినిపించిందంటూ విపత్తు హెచ్చరిక యాప్ ద్వారా అధికారులకు సమాచారం అందించారు ఎవరో. ఆ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. లోనికి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే.. కింది ఫ్లోర్లో రక్తపు మడుగుల్లో కొందరు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని గమనించారు. వాళ్లలో కొందరు అప్పటికే ప్రాణం కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. పైఫ్లోర్‌లో ఓ వ్యక్తి మృతదేహాం పడి ఉండడాన్ని గుర్తించారు. బహుశా ఆ వ్యక్తే కాల్పులకు పాల్పడి ఉంటాడని, ఘాతుకం అనంతరం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. కాల్పులకు పాల్పడింది అతనేనా? లేదా ఆ దుండగుడు పరారీలో ఉన్నాడా? అసలు కాల్పులకు ఎందుకు పాల్పడ్డారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు జర్మనీ మీడియా సంస్థలు చనిపోయింది ఆరుగురే అని చెప్తుండగా.. పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు హైఅలర్ట్ జారీ చేసిన పోలీసులు.. స్థానికులను బయటకు రావొద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందాలని కోరారు. ఇదిలా ఉంటే.. జిహాదీలు, స్థానిక అతివాద గ్రూపుల దాడులతో జర్మనీ గత కొన్నేళ్లుగా దాడులకు గురవుతోంది. ప్రముఖంగా చెప్పుకోవాలంటే.. డిసెంబర్ 2016లో బెర్లిన్‌లోని ఓ క్రిస్మస్ మార్కెట్లో ఐసిస్ ఉగ్రవాదులు దాడికి పాల్పడగా.. 12 మంది మరణించారు. ఇక ఫిబ్రవరి 2020లో హనౌ నగరంలో అతివాద సంస్థ వ్యక్తి ఒకడు జరిపిన కాల్పుల్లో పది మంది దుర్మరణం పాలయ్యారు. -
HAMBURG: రన్నరప్ బోపన్న జంట
న్యూఢిల్లీ: తన కెరీర్లో 22వ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. హాంబర్గ్ యూరోపియన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జర్మనీలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 2–6, 4–6తో అన్‌సీడెడ్ లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. విజేతగా నిలిచిన గ్లాస్‌పూల్–హెలియోవారా జోడీకి 1,08,770 యూరోల (రూ. 88 లక్షల 69 వేలు) ప్రైజ్‌మనీ, 500 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ బోపన్న జంటకు 58 వేల యూరోల (రూ. 47 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీ, 300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
HAMBURG OPEN 2022: ఫైనల్లో బోపన్న జంట
న్యూఢిల్లీ: హాంబర్గ్ యూరోపియన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–మాట్వి మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. జర్మనీలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 3–6, 6–3, 10–3తో టాప్ సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబాలస్ (అర్జెంటీనా) జంటపై సంచలన విజయం సాధించింది. లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్లాండ్), టిమ్ పుయెట్జ్ (జర్మనీ)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం తలపడుతుంది. 42 ఏళ్ల బోపన్న తన కెరీర్లో ఇప్పటివరకు 21 డబుల్స్ టైటిల్స్ సాధించగా... ఈ ఏడాది రెండు టోర్నీలలో విజేతగా నిలిచాడు. -
ఉగ్ర స్థావరాల అంతమే లక్ష్యం
► జీ 20 దేశాల ఉమ్మడి ప్రకటన.. ► హాంబర్గ్‌లో కూటమి సదస్సు ప్రారంభం హాంబర్గ్: ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు, స్వేచ్ఛా వాణిజ్య విస్తరణే లక్ష్యంగా జర్మనీలోని హాంబర్గ్‌లో శుక్రవారం జీ20 దేశాల సదస్సు ప్రారంభమైంది. మొత్తం 19 దేశాల అధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సభ్య దేశాల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య చర్చలు ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని, అదే సమయంలో ఉగ్రసాయానికి చెక్ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జీ20 సదస్సు తీర్మానించింది. శుక్రవారం తొలి రోజు భేటీ అనంతరం జీ20 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తూ.. ప్రపంచంలో ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలన్నింటినీ అంతమొందించాలని నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నాయి. ‘ఉగ్రవాదుల్ని చట్టం ముందు నిలబెట్టాలి. అందుకోసం భద్రత, ప్రయాణం, వలసలు, ఇంటర్‌పోల్ తదితర విభాగాల్లో ప్రస్తుతమున్న అంతర్జాతీయ సమాచార వ్యవస్థను మెరుగుపర్చాలి. ఉగ్రవాదుల విదేశీ ప్రయాణ ఉద్దేశ్యాన్ని ముందుగానే గుర్తించేలా నిఘా విభాగాలు తమ మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలి. ఉగ్రవాదుల లక్ష్యమేంటి.. వారి గమ్యస్థానం ఏమిటి? అన్న సమాచారం పంచుకోవాలి. ప్రపంచంలో ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలు ఉండకూడదు. విమానయాన రంగంలో భద్రతా వ్యవస్థలకు పొంచి ఉన్న ముప్పు, ఇతర ప్రమాదాల్ని గుర్తించేందుకు ఒకరికొకరు సహకరించుకోవాలి. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అడ్డుకునేందుకు కట్టుబడి ఉన్నాం. ఉగ్రవాదులకు చేరే నిధులకు అడ్డుకట్ట వేసేలా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఐసిస్, అల్‌కాయిదా, డాయేష్ తదితర ఉగ్రవాద సంస్థలకు అందుతున్న ఆర్థిక సాయాన్ని అడ్డుకునేందుకు చర్యల్ని బలోపేతం చేయాలి. ఉగ్రసాయం విషయంలో ప్రపంచంలో ఎలాటి సురక్షిత ప్రదేశాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదులు తమ లక్ష్యాల కోసం ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయాల’ని ఉమ్మడి ప్రకటనలో జీ 20 దేశాలు వెల్లడించాయి. సదస్సు ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు కరచాలనంతో ఒకరినొకరు పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం ఇరువురు నేతలు ముఖాముఖి చర్చలు జరిపారు. భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘పుతిన్, నేను అనేక అంశాలపై సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపామ’ని పేర్కొన్నారు. జీ20 సదస్సు సందర్భంగా జపాన్, దక్షిణ కొరియా, కెనడా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, వియత్నాం దేశాధినేతలతో మోదీ విడిగా చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని మే, జర్మనీ చాన్సలర్ మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రన్‌తో కొద్దిసేపు ముచ్చటిస్తూ కనిపించారు. పెట్రో బాంబులతో దాడి సదస్సుకు వ్యతిరేకంగా హాంబర్గ్‌లో ఆందోళనలు, హింసాఘటనలు జరిగాయి. కొందరు పెట్రోల్ బాంబులతో కార్లకు నిప్పుపెట్టారని.. పరిస్థితిని అదుపులోకి తెచ్చామని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు పలు దుకాణాల అద్దాల్ని పగులకొట్టడంతో పాటు, పోలీసు హెలికాప్టర్ల సమీపంలో మంటలతో కలకలం రేపారు.