జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలోకి చొరబడిన ఓ ఆగంతకుడు కాల్పుల కలకలం సృష్టించాడు. శనివారం రాత్రి విమానాశ్రయంలోకి కారుతో సహా దూసుకువచ్చిన ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ఘటన దరిమిలా హాంబర్గ్ విమానాశ్రయంలో ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. ‘కస్టడీ వివాదం’ ఈ ఘటనకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 8 గంటలకు ఒక అగంతకుడు కారులో భద్రతా ప్రాంతం గుండా ఎయిర్‌స్ట్రిప్‌కి ఆనుకొని ఉన్న రహదారి పైకి కారుతో సహా దూసుకువచ్చాడు. అనంతరం తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. కాగా ప్రస్తుతానికి విమానాల టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లను నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 27 విమానాలు దెబ్బతిన్నాయని సమాచారం. కాల్పులు జరిపిన ఆ వ్యక్తి కారులో నుండి రెండు మండుతున్న బాటిళ్లను బయటకు విసిరినట్లు పోలీసులు తెలిపారు.దీంతో మంటలు చెలరేగాయన్నారు.
ఇది కూడా చదవండి: నేపాల్‌లో మళ్లీ భూప్రకంపనలు.. తీవ్రత ఎంతంటే..
Comments
Please login to add a commentAdd a comment