airport ...
-
హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం..
జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలోకి చొరబడిన ఓ ఆగంతకుడు కాల్పుల కలకలం సృష్టించాడు. శనివారం రాత్రి విమానాశ్రయంలోకి కారుతో సహా దూసుకువచ్చిన ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన దరిమిలా హాంబర్గ్ విమానాశ్రయంలో ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. ‘కస్టడీ వివాదం’ ఈ ఘటనకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 8 గంటలకు ఒక అగంతకుడు కారులో భద్రతా ప్రాంతం గుండా ఎయిర్‌స్ట్రిప్‌కి ఆనుకొని ఉన్న రహదారి పైకి కారుతో సహా దూసుకువచ్చాడు. అనంతరం తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. కాగా ప్రస్తుతానికి విమానాల టేకాఫ్‌లు, ల్యాండింగ్లను నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 27 విమానాలు దెబ్బతిన్నాయని సమాచారం. కాల్పులు జరిపిన ఆ వ్యక్తి కారులో నుండి రెండు మండుతున్న బాటిళ్లను బయటకు విసిరినట్లు పోలీసులు తెలిపారు.దీంతో మంటలు చెలరేగాయన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్‌లో మళ్లీ భూప్రకంపనలు.. తీవ్రత ఎంతంటే.. -
అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమి గ్రేషన్/భద్రతా అధికారులు ఎయిర్‌పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది. దాదాపు వారం రోజుల నుంచి ఇలా ఒకరిద్దరిని పంపేస్తున్నా.. ఇప్పుడు ఒక్కరోజే 20 మందికిపైగా విద్యార్థులను వెనక్కి పంపడంతో విషయం బయటికి వచ్చిందని అమెరికాలోని తెలుగు సంఘాలు చెప్తున్నాయి. అయితే పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా..: అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు. ముందే టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు రాస్తారు. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్‌గా చూపిస్తారు. ఇందుకోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అనుభవం సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయి. డాక్యుమెంట్లపై అనుమానాలు.. సోషల్ మీడియా ఖాతాలు అమెరికాలో ‘సాక్షి’ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం.. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారు. అమెరికాలో ఆటా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాలో ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వాసుదేవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్‌టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపేశారు. నాటా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా మన విద్యార్థులను తిప్పి పంపడానికి కారణాలను కేవలం భారత కాన్సులేట్‌కు మాత్రమే చెబుతుంది. దీనితో ఆ వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి. -
ఢిల్లీ తరహాలో ఎయిర్పోర్ట్ వరకు హైదరాబాద్ ‘మెట్రో’
దేశ రాజధాని న్యూఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌లో మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మెట్రో రైలులో వేగంగా ఎయిర్‌పోర్టుని చేరుకునేలా సరికొత్త ప్రాజెక్టుకు రూపు ఇస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రోరైల్ ప్రాజెక్టును రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించేందుకు అక్షరాలా రూ.4 వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. రాయదుర్గం నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా మీదుగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 31 కి.మీ మేర ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. దీంతో రాయదుర్గం నుంచి కేవలం 25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలవుతుంది. ఈ మెట్రో కారిడార్ ఏర్పాటుతో గ్రేటర్ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల అవస్థలు తప్పనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్ల నుంచి విమానాశ్రయానికి కనెక్టివిటీ లేదు. రాయదుర్గం నుంచి రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతున్న విషయం విదితమే. 5 కి.మీకి ఒక స్టేషన్! విమానాశ్రయ మార్గంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లను ఔటర్‌రింగ్‌రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పాజంక్షన్, కిస్మత్పూర్, గండిగూడా చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. పిల్లర్ల ఏర్పాటుకు వీలుగా మట్టి నాణ్యత పరీక్షలు చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. త్వరలో స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టతరానుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నిధుల అన్వేషణలో ఎస్పీవీ యంత్రాంగం.. రాయదుర్గం–శంషాబాద్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ ఏర్పాటుకు వీలుగా స్పెషల్ పర్పస్ వెహికిల్ (ప్రత్యేకయంత్రాంగం)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ యంత్రాంగంలో హైదరాబాద్ మెట్రోరైలు, టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ విభాగాలున్నాయి. ప్రస్తుతం ఈవిభాగాల ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. గతేడాది బడ్జెట్లో సుమారు రూ.వెయ్యి కోట్లను హెచ్ఎంఆర్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో ప్రాజెక్టును మొదలుపెడతారా..లేక ఇతర మార్గాల్లో రుణ సేకరణ ద్వారా ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని సమకూర్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. కాగా ప్రస్తుతం నగరంలో ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం రూట్లలో 69.1 కి.మీ మేర మెట్రో రైలు సదుపాయం అందుబాటులో ఉంది. చదవండి:కూకట్పల్లి టూ కోకాపేట్.. త్వరలో లైట్ రైల్ ? -
ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లో వర్షం : వైరల్
లండన్ : లూటన్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. నిత్యం బిజీగా ఉండే ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లో కుండపోతగా వర్షం కురిసింది. యూరో న్యూస్ కథనం ప్రకారం.. శుక్రవారం లూటన్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పైకప్పు గుండా కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. టెర్మినల్‌లో వర్షం కురవటం ఏంటని కాసేపు తికమకపడ్డారు. తమ సామాగ్రి తడిసిపోకుండా ఉండేలా సురక్షితమైన ప్రదేశం కోసం నానా తంటాలు పడ్డారు. గత కొన్ని రోజులుగా యు.కే అంతటా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షం కారణంగా 15 నిమిషాలు ప్రయాణికులకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. ట్విట్టర్ వేదికగా పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. -
ఎయిర్పోర్ట్... సైట్ క్లియరెన్స్
కొత్తగూడెం: కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో నాలుగు ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సంబంధించి కమిటీ సమావేశం జరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో మూడు, కొత్తగూడెంలోని రేగళ్లలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం సైట్ క్లియరెన్స్ ఇచ్చింది.