జింఖానా, న్యూస్‌లైన్: వశిష్ట ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బాలికల అండర్-12 విభాగంలో సంజన మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. సైనిక్ పురిలోని కార్నివాల్ క్లబ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం రెండో రౌండ్‌లో సంజన 6-0తో మేఘనపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో నిఖిత 6-0తో శ్రేయపై, అమూల్య 6-0తో అమాండా జేవియర్‌పై, శ్రీహర్షిత 6-3తో చిన్మయిపై, రాచెల్ 6-1తో నేహాపై, సృజన 6-1 సుమనపై గెలుపొందారు.
ఇతర ఫలితాలు: బాలికల విభాగం అండర్-8 రెండో రౌండ్: దివ్యా రెడ్డి 6-0తో దియపై, అపూర్వ 6-2తో శ్రీనిధి రెడ్డిపై నెగ్గారు. అండర్-10 రెండో రౌండ్: అదితి 6-3తో నేహాపై, విదిత 6-1తో శ్రీనిధి రెడ్డిపై, షైక్ కామ్రీన్ 6-1తో అభయపై గెలిచారు.
అండర్-14 రెండో రౌండ్: సుమన 6-0తో రితికా రెడ్డిపై, నిఖిత 6-4తో సృజనపై, నవ్య 6-4తో చిన్మయిపై, శ్రీహర్షిత 6-0తో అక్షితా రెడ్డిపై, రితిక 6-1తో తేజ మానసపై, సయ్యద్ ఆఫ్రీన్ 6-2తో మేఘనా రెడ్డిపై, శ్రేయా రాజ్ 6-4తో ఆన ంద వ ల్లిపై గెలిచారు. బాలుర విభాగం అండర్-8 రెండో రౌండ్: చాణక్య 5-4తో విజయ్‌తేజ పై, పూర్వా పారిఖ్ 5-3తో కబీర్‌పై, నిఖిల్ 5-2తో సంజయ్‌పై నెగ్గారు. అండర్-10 రెండో రౌండ్: యువరాజ్ 6-5తో హర్షపై, శశిధర్ 6-0తో అజ్లాన్ అలీపై, ఆశీష్ 6-1తో నిఖిల్ స్వాతి ప్రసాద్‌పై విజయం సాధించారు. అండర్-12 రెండో రౌండ్: కౌషిక్ కుమార్ రెడ్డి 6-2తో ఆదిత్యపై, రాహుల్ 6-0తో అభిషేక్‌పై, బ్రిహత్ 6-5తో కార్తీక్ రెడ్డిపై, యువరాజ్ 6-1తో లిఖిత్‌పై, ఖాసిం అలీ 6-4తో హితేష్‌పై, శశిధర్ 6-4తో శ్రీకార్తీక్‌పై, రేహాన్ 6-0తో నిఖిల్ సాయి రాఘవ్‌పై, వంశీకృష్ణా రెడ్డి 6-1తో ప్రణీత్ రెడ్డిపై గెలిచారు.
అండర్-14 మూడో రౌండ్: ఉద్ధవ్ ఠాకూర్ 6-0తో నిఖిల్‌పై, మోహిత్ సాయి కుమార్ 7-5తో అల్లాన్‌పై, రాహుల్ 6-0తో కపిల్‌పై, ఆదిత్య 6-3తో బ్రిహత్‌పై, అశోధన్ 6-2తో రెవంత్‌పై, కుషాల్ 6-5తో పి. నిఖిల్‌పై, అఖిలేష్ రెడ్డి 6-2తో అర్చిత్‌పై, అభిషేక్ 6-5తో ఆయుష్‌పై నెగ్గారు.
మూడో రౌండ్‌లో సంజన
Published Wed, Oct 16 2013 11:53 PM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM
Advertisement
Advertisement