క్వార్టర్స్‌లో సాకేత్ | Saket Maine enter into quater finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాకేత్

Published Thu, Apr 28 2016 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

క్వార్టర్స్‌లో సాకేత్

క్వార్టర్స్‌లో సాకేత్

యానింగ్ (చైనా): కున్‌మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత రెండో ర్యాంకర్ సాకేత్ మైనేనికి మిశ్రమ ఫలితాలు లభించాయి. సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన ఈ హైదరాబాద్ ప్లేయర్... డబుల్స్ విభాగంలో మాత్రం తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు.

బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సాకేత్ 6-3, 7-6 (7/4)తో నికొలస్ బారింటస్ (కొలంబియా)పై విజయం సాధించాడు. డబుల్స్ తొలి రౌండ్‌లో సాకేత్-మహేశ్ భూపతి (భారత్) జంట 4-6, 4-6తో డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)-అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆర్థర్ డీగ్రీఫ్ (బెల్జియం)తో సాకేత్ ఆడతాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement