మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్లో భారత ఏస్ ఆటగాడు మహేష్ భూపతి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలిరౌండ్లో భూపతి జోడీ ఓటమి చవిచూసింది. జర్మిలా గజ్డోసోవాతో జతకట్టిన భూపతి 6-4, 6-7 (7), 8-10తో హవా చింగ్ (చైనీస్ తైపీ), జేమీ ముర్రే (బ్రిటన్) ద్వయం చేతిలో ఓడిపోయాడు.
విలియమ్స్ సిస్టర్స్ ముందంజ
అమెరికా నల్లకలువలు సెరెనా, వీనస్ విలియమ్స్ సిస్టర్స్ మహిళల సింగిల్స్లో ముందంజ వేశారు. మూడో రౌండ్లో సెరెనా 4-6, 6-2, 6-0తో ఎలీనా స్విటోలీనా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. మరో మ్యాచ్లో వీనస్ విలియమ్స్ కూడా తొలి సెట్ కోల్పోయిన అనంతరం ప్రత్యర్థి కెమిల్లా జియోర్గి (ఇటలీ)ని చిత్తుచేసింది.
ఆస్ట్రేలియా ఓపెన్లో మహేష్ భూపతి ఓటమి
Published Sat, Jan 24 2015 4:08 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM
Advertisement
Advertisement