Austraalian Open
-
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో బోపన్న సరికొత్త చరిత్ర..
ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత వెటరన్ రోహన్ బోపన్న సరికొత్త చరిత్ర సృష్టించాడు. 43 ఏళ్ల బోపన్న.. మాథ్యూ ఎబ్డెన్తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్-2024 పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6 (7-0), 7-5తో ఇటలీ ద్వయం సిమోన్ బొలెల్లి- ఆండ్రియా వావోసోరిపై విజయం సాధించింది. రోహన్ బోపన్న కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో ఓ అరుదైన ఘనతను బోపన్న తన పేరిట లిఖించుకున్నాడు. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన అతి పెద్ద వయసు ఆటగాడిగా రోహన్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అమెరికా టెన్నిస్ ప్లేయర్ మైక్ బ్రియాన్ (41 ఏండ్ల 76 రోజులు) పేరిట ఉండేది. తాజా విజయంతో బోపన్న(43 ఏళ్ల 329 రోజులు) మైక్ బ్రియాన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అద్బుత విజయం అందుకున్న బోపన్న-ఎబ్డెన్‌ల జోడీకి ట్రోఫీతో పాటు రూ.6.06 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్‌ను అరియానా సబలెంకా సొంతం చేసుకుంది. ఫైనల్లో చైనాకు చెందిన ఝెంగ్ కిన్వెన్ను 6-3, 6-2తో సబలెంకా చిత్తు చేసింది. చదవండి: ENG Vs IND 1st Test: ఎంత పని చేశావు భరత్.... కోపంతో ఊగిపోయిన బుమ్రా! వీడియో వైరల్ -
మహిళల సింగిల్స్ తుది పోరు నేడే
ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో మహిళల సింగిల్స్ విజేత ఎవరో నేడు తేలనుంది. శనివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్, జపాన్ స్టార్ నయోమి ఒసాకాతో 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) తలపడుతుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ ఒసాకా స్థాయికి తగ్గ ఆటతీరును కనబరిస్తే చాలు... ఫైనల్‌ను లాంఛనంగా ముగించేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 2019లో ఇక్కడ టైటిల్ గెలిచిన ఒసాకా గతేడాది యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది. ఇక ఈ టోర్నీలో అయితే కఠినమైన ప్రత్యర్థుల్ని, దిగ్గజాన్ని ఓడించి మరీ తుదిపోరుకు చేరుకుంది. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్)ను ప్రిక్వార్టర్స్‌లో ఓడించిన జపాన్ స్టార్... సెమీస్‌లో అమెరికా దిగ్గజం సెరెనాకు చెక్ పెట్టింది. నేటి మ్యాచ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఒసాకానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మరోవైపు బ్రాడీ ఓడించిందంతా అనామక క్రీడాకారిణిలనే. 25 ఏళ్ల అమెరికన్‌కు అసలు ఫైనల్ చేరిన అనుభవమే లేదు. -
చేజారిన ఆశలు : సెరెనా భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల సెమీ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా చేతిలో ఓటమి పాలయ్యారు. రాడ్ లావర్ ఎరీనాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఒసాకా చేతిలో 6-3, 6-4 తేడాతో ఆమె ఓడిపోయారు. కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన 39 ఏళ్ల సెరెనా ఈ ఓటమికి తన తప్పిదాలే కారణమని ఒప్పుకున్నారు. ఈ టోర్నమెంట్లో సెరెనా విలియమ్స్ 24 వ టైటిల్‌ను గెలుచుకుని రికార్టు సృష్టిస్తారని భావించారు. కానీ అనూహ్య ఓటమితో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ ప్రయాణం ముగిసింది. అయితేఈ సందర్భంగా సెరెనా టెన్నిస్‌కు వీడ్కోలు చెపుతారా అనే చర్చ తీవ్రమైంది. నిజానికి ఇది తాను గెలవాల్సిన మ్యాచ్ అంటూ సెరెనా విలియమ్స్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో టెన్నిస్‌కు గుడ్ బై చెప్పనున్నారా అన్న ప్రశ్నకు కన్నీటి పర్యంతమైన ఆమె అకస్మాత్తుగా సమావేశంనుంచి నిష్క్రమించడం అందరినీ విస్మయ పర్చింది. ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిట్ దక్కించుకున్న సెరెనా పైనల్ రేసునుంచి తప్పుకోవడంతో ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. నాకు తెలియదు..ఆసీస్ ప్యాన్స్ ఆదరణ చాలా అద్భుతంగా ఉంది. చాలా ఆనందంగా ఉందని సమాధానమిచ్చారు. కానీ ఒకవేళ తాను వీడ్కోలు చెప్పాల్సి వస్తే..ఎవరికీ చెప్పను... ఐయామ్ డన్ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా శనివారం జరగనున్న ఫైనల్లో నాల్గవ గ్రాండ్ స్లామ్ టైటిల్కోసం జెన్నిఫర్ బ్రాడి లేదా కరోలినా ముచోవాతో ఒసాకా తలపడాల్సి ఉంటుంది. Here is the audio of Serena's tearful exit from the #AusOpen press room after discussing how she might say farewell... (📸by @NickMcCarvel) pic.twitter.com/yJUdgOCYyY — Ben Rothenberg (@BenRothenberg) February 18, 2021 Congratulations on a great fortnight, @serenawilliams. We can't wait to see you back here next year 💕#AusOpen | #AO2021 pic.twitter.com/ccugVe6lcj — #AusOpen (@AustralianOpen) February 18, 2021 -
ఒక్క కరోనా కేసు.. ఆరు టోర్నీల మ్యాచ్‌లు వాయిదా
మెల్బోర్న్: ప్రపంచ వ్యాప్తంగా మొదటి నుంచి ఇప్పటిదాకా కఠినమైన కరోనా వైరస్ ప్రొటోకాల్ పాటిస్తున్న దేశమేదైనా ఉందంటే అది ఆస్ట్రేలియానే! ఒక్క కరోనా కేసు నమోదైనా సరే పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. బుధవారం నమోదైన ఒక్క కరోనా కేసు ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సిద్ధమవుతున్న ఆటగాళ్లను ఉలిక్కిపడేలా చేసింది. ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సన్నాహకంగా మెల్బోర్న్లో పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం ఆరు టోర్నీలు జరుగుతున్నాయి. మెల్బోర్న్లో ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్లో ఓ కార్మికుడికి కోవిడ్–19 సోకినట్లు పరీక్షల్లో తేలింది. దాంతో ఆ హోటల్లో బస చేసిన ఆటగాళ్లు గురువారం ఈ టోర్నీలలో ఆడే మ్యాచ్‌లన్నీ వాయిదా వేశారు. అతనితో కాంటాక్టులో ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు వెళ్లాలని ఆదేశించారు. మళ్లీ వారందరికీ పరీక్షలు చేసి నెగెటివ్ అని తేలాకే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. -
స్టార్స్ అందరూ వస్తున్నారు
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఈసారీ స్టార్ క్రీడాకారులందరూ బరిలోకి దిగనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరిగే ఈ టోరీ్నకి సంబంధించి శనివారంతో ఎంట్రీల తుది గడువు ముగిసింది. మాజీ విజేత అజరెంకా మినహా పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో టాప్–50లోని క్రీడాకారులందరూ తమ ఎంట్రీలను ఖరారు చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో నంబర్‌వన్ నాదల్ (స్పెయిన్)తోపాటు జొకోవిచ్ (సెర్బియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్)... మహిళల సింగిల్స్‌లో టాప్ ర్యాంకర్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా), ఏడుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా) మెల్బోర్న్కు రానున్నారు. -
సింధుకు చుక్కెదురు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది తన తొలి టైటిల్ కోసం మరికొంత కాలం నిరీక్షించక తప్పదు. ఈ సీజన్లో పాల్గొన్న ఏడో టోర్నమెంట్లోనూ ఆమెకు నిరాశ ఎదురైంది. సింధుతోపాటు ఒకేరోజు పురుషుల సింగిల్స్ విభాగంలో ముగ్గురు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు ఓడిపోవడంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. న్యూఢిల్లీ: అందివచ్చిన అవకాశాలను చేజార్చుకోవడంతో భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు ఊహించని పరాజయం ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో సింధు పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. సిడ్నీలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సింధు 19–21, 18–21తో ప్రపంచ 29వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు రెండు గేముల్లోనూ ఒకదశలో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేక చతికిలపడింది. జిందాపోల్‌తో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో సింధు ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. చివరిసారి సింధు 2016 సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీలో జిందాపోల్ చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్, సమీర్ వర్మ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. చైనా దిగ్గజం లిన్ డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 17–21, 22–20, 14–21తో ఓడిపోయాడు. రెండో సీడ్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ 23–25, 9–21తో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్‌లో గట్టిపోటీనిచ్చిన సాయిప్రణీత్ రెండో గేమ్‌లో చేతులెత్తేశాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 16–21, 21–7, 13–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 19–21, 18–21తో లి జున్హుయ్–లియు యుచెన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
నాదల్ శ్రమించి...
మొదటి మూడు రౌండ్లలో సునాయాస విజయాలు సాధించిన ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్కు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి అసలు పరీక్ష ఎదురైంది. అర్జెంటీనా యువతార డీగో ష్వార్ట్‌జ్‌మన్‌తో దాదాపు నాలుగు గంటలపాటు సాగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ స్పెయిన్ స్టార్ తన అనుభవాన్నంతా రంగరించి గట్టెక్కాడు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ మారిన్ సిలిచ్‌తో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కరోలిన్ వొజ్నియాకి, నాలుగో సీడ్ స్వితోలినా అలవోక విజయాలతో క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టారు. మెల్బోర్న్: గతేడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి జోరు మీదున్న స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ కొత్త సీజన్లోనూ దూసుకెళ్తున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో ఈ టాప్ సీడ్ ప్లేయర్ క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. 24వ సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెం టీనా)తో 3 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నాదల్ 6–2, 6–7 (4/7), 6–3, 6–3తో గెలుపొంది పదోసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన నాదల్ తాజా విజయంతో తన నంబర్‌వన్ ర్యాంక్‌ను పదిలం చేసుకున్నాడు. ‘మ్యాచ్ గొప్పగా సాగింది. ఒకదశలో అలసిపోయినా తుదివరకు పోరాడగలిగి విజయం దక్కించుకున్నాను’ అని నాదల్ వ్యాఖ్యానిం చాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఒక్క సెట్ కూడా కోల్పోని నాదల్ ఈ పోటీలో ఒక సెట్ చేజార్చుకున్నాడు. అంతేకాకుండా తన సర్వీస్ మూడుసార్లు కోల్పోయాడు. మరోవైపు ష్వార్ట్‌జ్‌మన్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు శక్తివంతమైన గ్రౌండ్షాట్లతో నాదల్‌ను ఇబ్బంది పెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో నాదల్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో సిలిచ్ 6–7 (2/7), 6–3, 7–6 (7/0), 7–6 (7/3)తో పదో సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)ను ఓడించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 7–6 (7/3), 7–6 (7/4), 4–6, 7–6 (7/4)తో 17వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై గెలుపొంది మూడోసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరగా... బ్రిటన్ ఆశాకిరణం కైల్ ఎడ్మండ్ 6–7 (4/7), 7–5, 6–2, 6–3తో ఆండ్రియా సెప్పి (ఇటలీ)ని ఓడించి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. స్వితోలినా తొలిసారి... మహిళల సింగిల్స్‌లో ఆదివారం ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోలేదు. రెండో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) ఐదేళ్ల తర్వాత, నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) తొలిసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖాయం చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో వొజ్నియాకి 6–3, 6–0తో 19వ సీడ్ మగ్ధలినా రిబరికోవా (స్లొవేకియా)పై... స్వితోలినా 6–3, 6–0తో డెనిసా అలెర్టోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) 4–6, 6–4, 8–6తో 32వ సీడ్ కొంటావీట్ (ఎస్తోనియా)పై, ఎలీస్ మెర్టెన్స్ (బెల్జియం) 7–6 (7/5), 7–5తో పెట్రా మార్టిక్ (క్రొయేషియా)పై విజయం సాధించారు. పేస్ జంట నిష్క్రమణ పురుషుల డబుల్స్‌లో లియాండర్ పేస్–పురవ్ రాజా (భారత్) జంట పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో పేస్–పురవ్ ద్వయం 1–6, 2–6తో సెబాస్టియన్ కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–తిమియా బాబోస్ (హంగేరి) జోడీ 6–2, 6–4తో విటింగ్టన్–ఎలెన్ పెరెజ్ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచింది. నన్ను అనుసరించాలని కోరుకోవట్లేదు! ► తన పిల్లల గురించి ఫెడరర్ మెల్బోర్న్: టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో అతను ఒకడు... 19 గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత... సహజంగానే అతని పిల్లలు తండ్రి అడుగు జాడల్లో నడుస్తారని, భవిష్యత్తులో టెన్నిస్ స్టార్లుగా ఎదుగుతారని చాలా మంది భావిస్తారు. అయితే రోజర్ ఫెడరర్ మాత్రం అలా జరగాలని కోరుకోవట్లేదు. ఏదైనా ఆటలో ప్రవేశం ఉంటే మంచిదే కానీ తనలాగా ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాళ్లుగా మారతారో లేదో చెప్పలేనన్నాడు. ‘వారు నన్ను అనుసరించాలని ఆశించడం లేదు. ఎందుకంటే నా పిల్లలు కూడా మరో 25 ఏళ్ల పాటు ప్రొఫెషనల్‌గా మారి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూనే ఉండాలని నేను కోరుకోకపోవడమే దానికి కారణం. అయితే ఆటలు కానీ వ్యాపారంలాంటి మరో రంగంలోకి కానీ వారు వెళతానంటే మద్దతుగా నిలుస్తాను. చిన్నప్పుడే ఆటలు ఆడే మంచి అలవాటు వారికి రావాలి. అది ఏ ఆటైనా సరే. అయినా సరదాగానైనా ఫెడరర్ పిల్లలు టెన్నిస్ ఆడకుంటే ఆశ్చర్యం కానీ ఆడితే ఏముంది’ అని ఈ దిగ్గజ ఆటగాడు వ్యాఖ్యానించాడు. ఫెడరర్, మిర్కా దంపతులకు కవలల జతలు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. -
ఆస్ట్రేలియా ఓపెన్:ఫైనల్ కు చేరిన జోకోవిచ్
మెల్ బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ లో నువాక్ జోకోవిచ్ ఫైనల్ కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో జోకోవిచ్ 7-6(7-1),3-6, 6-4, 4-6, 6-0 తేడాతో వావ్రింకాను ఓడించాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ రెండో సెమీ ఫైనల్లో జోకోవిచ్ తన అనుభవాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. టై బ్రేక్ దారి తీసిన తొలి సెట్ లో జోకోవిచ్ సునాయాసంగా విజయంగా సాధించాడు. అయితే ఆ ఆశలకు సెకెండ్ సెట్ లో గండికొట్టాడు వావ్రింకా. రెండో సెట్ ను వావ్రింకా గెలుచుకుని జోకోవిచ్ కు సవాల్ విసిరాడు. అనంతరం మూడు సెట్ జోకోవిచ్ కైవశం చేసుకున్నా.. నాల్గో సెట్ ను మాత్రం కోల్పోయాడు. దీంతో నాలుగు సెట్ లు పూర్తయ్యే సరికి ఇద్దరు సమ ఉజ్జీలుగా నిలవడంతో ఐదో సెట్ కీలకంగా మారింది. ఈ సెట్ లో ఏమాత్రం పొరపాట్లను దరిచేరనీయని జోకోవిచ్ సునాయాసంగా గెలుచుకుని తుది పోరుకు సిద్దమయ్యాడు.జోకోవిచ్-ఆండీ ముర్రేల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో మహేష్ భూపతి ఓటమి
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత ఏస్ ఆటగాడు మహేష్ భూపతి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలిరౌండ్లో భూపతి జోడీ ఓటమి చవిచూసింది. జర్మిలా గజ్డోసోవాతో జతకట్టిన భూపతి 6-4, 6-7 (7), 8-10తో హవా చింగ్ (చైనీస్ తైపీ), జేమీ ముర్రే (బ్రిటన్) ద్వయం చేతిలో ఓడిపోయాడు. విలియమ్స్ సిస్టర్స్ ముందంజ అమెరికా నల్లకలువలు సెరెనా, వీనస్ విలియమ్స్ సిస్టర్స్ మహిళల సింగిల్స్‌లో ముందంజ వేశారు. మూడో రౌండ్లో సెరెనా 4-6, 6-2, 6-0తో ఎలీనా స్విటోలీనా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో వీనస్ విలియమ్స్ కూడా తొలి సెట్ కోల్పోయిన అనంతరం ప్రత్యర్థి కెమిల్లా జియోర్గి (ఇటలీ)ని చిత్తుచేసింది.