ఆస్ట్రేలియా ఓపెన్:ఫైనల్ కు చేరిన జోకోవిచ్ | Djokovic defeats Wawrinka in semi final match | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్:ఫైనల్ కు చేరిన జోకోవిచ్

Published Fri, Jan 30 2015 6:01 PM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

ఆస్ట్రేలియా ఓపెన్:ఫైనల్ కు చేరిన జోకోవిచ్

ఆస్ట్రేలియా ఓపెన్:ఫైనల్ కు చేరిన జోకోవిచ్

మెల్ బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ లో నువాక్ జోకోవిచ్ ఫైనల్ కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో జోకోవిచ్ 7-6(7-1),3-6, 6-4, 4-6, 6-0 తేడాతో వావ్రింకాను ఓడించాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ రెండో సెమీ ఫైనల్లో జోకోవిచ్ తన అనుభవాన్ని ఉపయోగించాల్సి వచ్చింది.  టై బ్రేక్ దారి తీసిన తొలి సెట్ లో జోకోవిచ్ సునాయాసంగా విజయంగా సాధించాడు. అయితే ఆ ఆశలకు సెకెండ్ సెట్ లో గండికొట్టాడు వావ్రింకా.  రెండో సెట్ ను వావ్రింకా గెలుచుకుని జోకోవిచ్ కు సవాల్ విసిరాడు.

 

అనంతరం మూడు సెట్ జోకోవిచ్ కైవశం చేసుకున్నా.. నాల్గో సెట్ ను మాత్రం కోల్పోయాడు. దీంతో నాలుగు సెట్ లు పూర్తయ్యే సరికి ఇద్దరు సమ ఉజ్జీలుగా నిలవడంతో ఐదో సెట్ కీలకంగా మారింది. ఈ సెట్ లో ఏమాత్రం పొరపాట్లను దరిచేరనీయని జోకోవిచ్ సునాయాసంగా గెలుచుకుని తుది పోరుకు సిద్దమయ్యాడు.జోకోవిచ్-ఆండీ ముర్రేల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement