తన సుదీర్ఘ కెరీర్‌లో లోటుగా ఉన్న ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని అందుకునేందుకు సెర్బియా దిగ్గజం విజయం దూరంలో నిలిచాడు. వరుసగా ఐదో ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడుతున్న 37 ఏళ్ల జొకోవిచ్ తొలిసారి పసిడి పతక పోరుకు అర్హత సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ సెమీఫైనల్లో జొకోవిచ్ 6–4, 6–2తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలిచాడు. తద్వారా ఒలింపిక్స్ టెన్నిస్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన పెద్ద వయసు్కడిగా గుర్తింపు పొందాడు.
నేడు జరిగే ఫైనల్లో ఈ ఏడాది ఫ్రెంచ్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నల చాంపియన్ అల్‌కరాజ్ (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఇద్దరూ 3–3తో సమంగా ఉన్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో జొకోవిచ్ కాంస్య పతకం గెలిచాడు. 2012 లండన్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జొకోవిచ్ 2016 రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment