ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత వెటరన్ రోహన్ బోపన్న సరికొత్త చరిత్ర సృష్టించాడు. 43 ఏళ్ల బోపన్న.. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్-2024 పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6 (7-0), 7-5తో ఇటలీ ద్వయం సిమోన్ బొలెల్లి- ఆండ్రియా వావోసోరిపై విజయం సాధించింది. రోహన్ బోపన్న కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.
ఈ విజయంతో ఓ అరుదైన ఘనతను బోపన్న తన పేరిట లిఖించుకున్నాడు. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన అతి పెద్ద వయసు ఆటగాడిగా రోహన్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అమెరికా టెన్నిస్ ప్లేయర్ మైక్ బ్రియాన్ (41 ఏండ్ల 76 రోజులు) పేరిట ఉండేది. తాజా విజయంతో బోపన్న(43 ఏళ్ల 329 రోజులు) మైక్ బ్రియాన్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఇక అద్బుత విజయం అందుకున్న బోపన్న-ఎబ్డెన్‌ల జోడీకి ట్రోఫీతో పాటు రూ.6.06 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్‌ను అరియానా సబలెంకా సొంతం చేసుకుంది. ఫైనల్లో చైనాకు చెందిన ఝెంగ్ కిన్వెన్‌ను 6-3, 6-2తో సబలెంకా చిత్తు చేసింది.
చదవండి: ENG Vs IND 1st Test: ఎంత పని చేశావు భరత్.... కోపంతో ఊగిపోయిన బుమ్రా! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment