
సానియా- భూపతి; పేస్-నవ్రతిలోవా జంటగా...
న్యూఢిల్లీ: దేశంలో టెన్నిస్ ఆట కు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ క్రీడాకారిణి సానియా మీర్జా, మహేశ్ భూపతి ఓ జంటగా... లియాండర్ పేస్, మార్టినా నవ్రతిలోవా మరో జంటగా మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈనెల 27 నుంచి నాలుగు నగరాల్లో నాలు గు టెస్టు సిరీస్‌ల పేరిట వీరు అభిమానులను అలరించనున్నారు. తొలి మ్యాచ్ ఢిల్లీలో జరుగుతుంది. కోల్‌కతా, బెంగళూ రు, హైదరాబాద్‌లలో మిగతా మ్యాచ్‌లను ఆడతారు. మూడు సెట్‌ల పాటు జరిగే ఈ మ్యాచ్‌లకు ముందు వర్ధమాన ఆటగాళ్లకు క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నారు.