కరణ్-అర్జున్ వచ్చేశారు!
కరణ్-అర్జున్ వచ్చేశారు!
Published Sun, Nov 22 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM
కోల్‌కతా: పురుషుల టెన్నిస్‌లో ఆ ఇద్దరు దిగ్గజాలైతే, మహిళల టెన్నిస్‌కు ఆమె ఏకైక క్వీన్. భారత టెన్నిస్ హేమాహేమీలు ముగ్గురు ఒకే ‘చిత్రం’లో చేరారు. కోల్‌కతాలో ఈ నెల 25న జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా కలిసి ప్రాక్టీస్ చేశారు. ఈ కలయికను సెల్ఫీగా మలచి సానియా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. షారుఖ్-సల్మాన్‌ల సూపర్ హిట్ మూవీ డైలాగ్‌ను గుర్తు చేస్తూ ‘ నా కరణ్-అర్జున్ వచ్చేశారు. ఇద్దరిలో ఎవరు ఎవరో వారే తేల్చుకుంటారు’ అని సరదాగా కామెంట్ చేసింది. ఐపీటీఎల్ ప్రమోషన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని సానియా అకాడమీలో రెండో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుంది.
Advertisement
Advertisement