సెర్బియాతో జరిగే డేవిస్ కప్‌కు సీనియర్ ఆటగాళ్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతిని ఆడించాలా?
డేవిస్‌కప్‌కు సీనియర్ల ఎంపికపై ఏఐటీఏ
ముంబై: సెర్బియాతో జరిగే డేవిస్ కప్‌కు సీనియర్ ఆటగాళ్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతిని ఆడించాలా? లేక యువ ఆటగాళ్లతోనే ముందుకెళ్లాలా అనేది జాతీయ సెలక్షన్ కమిటీ తేల్చుకోవాల్సి ఉందని అఖిల భారత టె న్నిస్ సంఘం (ఐటా) కార్యదర్శి భరత్ ఓజా స్పష్టం చేశారు.
తాము ఈ టోర్నీకి అందుబాటులో ఉంటామని ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇటీవలప్రకటించారు. ‘మా కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్, కోచ్ జీషన్ అలీతో పాటు సెలక్షన్ కమిటీ కూడా ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సీనియర్ ఆటగాళ్లను పిలిపించాలా లేక యువ జట్టుతోనే ముందుకెళ్లాలా అనేది తేల్చాలి’ అని ఓజా అన్నారు. సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు సెర్బియాతో మ్యాచ్‌ల కోసం జట్టును జూలైలో ప్రకటించనున్నారు.