క్వార్టర్స్‌లో పేస్ జోడి | quarters pace Body Open tennis tournament | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో పేస్ జోడి

Published Fri, Feb 19 2016 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

quarters pace Body Open tennis tournament

డెల్‌రే బీచ్ (అమెరికా): భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్-జెర్మీ చార్డీ (ఫ్రాన్స్)జోడి.... డెల్‌రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ పేస్-చార్డీ 6-4, 7-5తో నాలుగోసీడ్ అమెరికా ద్వయం ఎరిక్ బట్రోక్-స్కాట్ లిప్‌స్కైలపై నెగ్గారు. గంటా 12 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. పేస్ జంట నాలుగు ఏస్‌లను సంధించింది. 119 పాయింట్లతో 66 గెలుచుకుని మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. రెండుసార్లు సర్వీస్ చేజార్చుకున్న పేస్-చార్డీ... ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. క్వార్టర్స్‌లో పేస్ జోడి... మార్సెల్లో గ్రానోలెర్స్ (స్పెయిన్)-సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)తో తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement