Jeremy Chardy
-
Wimbledon 2023: అల్కరాజ్ అలవోకగా...
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6–0, 6–2, 7–5తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ పది ఏస్‌లు సంధించి రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. చార్డీ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన ఈ స్పెయిన్ స్టార్ తన సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయాడు. నెట్ వద్దకు తొమ్మిదిసార్లు దూసుకొచ్చిన అల్కరాజ్ ఏడుసార్లు పాయింట్లు గెలిచాడు. 38 విన్నర్స్ కొట్టిన అతను 14 అనవసర తప్పిదాలు చేశాడు. మరో మ్యాచ్‌లో రెండుసార్లు చాంపియన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కూడా అలవోక విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. రియాన్ పెనిస్టన్ (బ్రిటన్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముర్రే 6–3, 6–0, 6–1తో విజయం సాధించాడు. వర్షం కారణంగా రెండో రోజు పలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. పైకప్పు కలిగిన సెంటర్ కోర్టు, నంబర్‌వన్ కోర్టులోని మ్యాచ్‌లు సజావుగా సాగాయి. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్) కష్టపడి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. రిబాకినా 4–6, 6–1, 6–2తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునిషియా) 6–3, 6–3తో మగ్ధలినా ఫ్రెచ్ (పోలాండ్)ను ఓడించింది. సోమవారం ఆలస్యంగా ముగిసిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 4–6, 6–4, 2–6తో 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. -
మ్యాచ్ పట్టించుకోకుండా పక్షులు, ఆకాశంకేసి చూస్తున్నారా!?
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకంది. చైర్ అంపైర్ చేసిన చిన్న తప్పిదం కారణంగా తాను మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చిందంటూ ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ జెరెమీ కార్డీ ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. విషయంలోకి వెళితే.. పురుషుల సింగిల్స్‌లో గురువారం బ్రిటన్‌కు చెందిన డాన్ ఎవన్స్(27వ ర్యాంక్), జెరెమీ కార్డీ మధ్య రెండో రౌండ్ మ్యాచ్ జరిగింది. తొలి సెట్లో ఇరువురు 3-3తో సమానంగా ఉన్నారు. కీలకమైన టైబ్రేక్ పాయింట్ సమయం కావడంతో ఇద్దరు సీరియస్‌గా ఆడుతున్నారు. ఎవన్స్ బంతిని సర్వీస్ చేయగా.. జెరెమీ షాట్ ఆడాడు. ఆ తర్వాతి టర్న్‌లో జెరెమీ ఫోర్‌హ్యాండ్ షాట్ ఆడే సమయంలో అతని జేబు నుంచి బంతి కిందపడింది. ఇది గమనించిన జెరెమీ చైర్ అంపైర్‌కు సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆమె పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎవన్స్ కూడా గమనించకుండా షాట్ కొట్టడం.. జెరెమీ షాట్ మిస్ కావడంతో బంతి నెట్‌కు తగిలింది. దీంతో ఎవన్స్‌కు పాయింట్ లభించినట్లయింది. అయితే దీనిపై జెరెమీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. చైర్ అంపైర్ మాత్రం పోనీలే అన్న తరహాలో ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో జెరెమీకి చిర్రెత్తుకొచ్చింది. ఎవన్స్ ఈ విషయంలో తాను దూరలేనని పక్కకి వెళ్లి కూర్చొన్నాడు. చైర్ అంపైర్‌తో జెరెమీ చాలా సేపు వాదించాడు. బంతి జేబులో నుంచి పడిందని సిగ్నల్ ఇచ్చినా పట్టించుకోలేదన్నాడు. మ్యాచ్‌ను చూడకుండా పైనున్న ఆకాశం, పక్షులను చూస్తూ కూర్చొన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కెరీర్లో మీ అంత బ్యాడ్ అంపైర్‌ను ఎప్పుడు చూడలేదన్నాడు. ఆ తర్వాత టోర్నీ నిర్వాహకులు వచ్చి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో జెరెమీ కార్డీ ఓటమి పాలయ్యాడు. డాన్ ఎవన్స్ చేతిలో జెరెమీ కార్డీ 6-4, 6-4, 6-1తో వరుస సెట్లలో ఖంగుతిన్నాడు. చైర్ అంపైర్‌తో వివాదం తనను విజయానికి దూరం చేసిందని జెరెమీ కార్డీ మ్యాచ్ ముగిసిన అనంతరం పేర్కొనడం ఆసక్తి కలిగించింది. Chardy and Evans lock horns over unclear tennis rule. 🤬 Which side are you on? 🤔 🖥 #AusOpen LIVE | https://t.co/80XjQpwKWh#9WWOS #Tennis pic.twitter.com/zY6EVp90Oq — Wide World of Sports (@wwos) January 19, 2023 -
క్వార్టర్స్‌లో పేస్ జోడి
డెల్రే బీచ్ (అమెరికా): భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్-జెర్మీ చార్డీ (ఫ్రాన్స్)జోడి.... డెల్రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ పేస్-చార్డీ 6-4, 7-5తో నాలుగోసీడ్ అమెరికా ద్వయం ఎరిక్ బట్రోక్-స్కాట్ లిప్స్కైలపై నెగ్గారు. గంటా 12 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. పేస్ జంట నాలుగు ఏస్‌లను సంధించింది. 119 పాయింట్లతో 66 గెలుచుకుని మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. రెండుసార్లు సర్వీస్ చేజార్చుకున్న పేస్-చార్డీ... ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. క్వార్టర్స్‌లో పేస్ జోడి... మార్సెల్లో గ్రానోలెర్స్ (స్పెయిన్)-సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)తో తలపడుతుంది.