సానియా-హింగిస్ ప్రపంచ రికార్డు | Sania Mirza and Hingis record-equalling 28th consecutive win | Sakshi
Sakshi News home page

సానియా-హింగిస్ ప్రపంచ రికార్డు

Published Wed, Jan 13 2016 3:11 PM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

సానియా-హింగిస్ ప్రపంచ రికార్డు

సానియా-హింగిస్ ప్రపంచ రికార్డు

సిడ్నీ: టెన్నిస్ మహిళల డబుల్స్ లో సంచలనాలు సృష్టిస్తోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ తాజాగా మరో రికార్డు నమోదు చేసింది. గతేడాది ఓవరాల్గా 10 డబ్ల్యూటీఏ టైటిల్స్ నెగ్గిన సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్లో వరుసగా 28 మ్యాచ్లు గెలిచి అత్యధిక విజయాలు సాధించిన జోడిగా నిలిచారు. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ మ్యాచ్లో చైనాకు చెందిన చెన్ లియాంగ్, సువాయ్ పెంగ్ జోడిపై 6-2, 6-3 తేడాతో డబుల్స్ నంబర్ వన్ ద్వయం గెలిచింది.

సుమారు గంటపాటు జరిగిన మ్యాచ్లో చైనా జోడీపై విజయంతో ఈ ఇండో-స్విస్ ద్వయం సిడ్నీ ఓపెన్‌లో సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేయడంతో పాటు ఒకసారి తమ సర్వీస్ నిలబెట్టుకున్నారు. ఈ విజయంతో 1994లో డబుల్స్ ద్వయం గిగి ఫెర్నాండేజ్, నటాషా జ్వెరేవా నెలకొల్పిన వరుస విజయాల రికార్డును సానియా-హింగిస్ సమం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement