చరిత్ర సృష్టించిన సానియా జోడీ | Mirza-Hingis pair creates world record in Tennis doubles history | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సానియా జోడీ

Published Thu, Jan 14 2016 12:38 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

చరిత్ర సృష్టించిన సానియా జోడీ

చరిత్ర సృష్టించిన సానియా జోడీ

సిడ్నీ: సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట మహిళల డబుల్స్‌లో వరుస విజయాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గురువారం జరిగిన సిడ్నీ ఇంటర్నేషనల్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ మ్యాచ్లో శ్వేదోవా-ఓలారు జోడిపై 4-6, 6-3, 10-8తేడాతో నెగ్గడం ద్వారా వరుసగా 29 మ్యాచ్ల్లో విజయాలు సాధించిన తొలి జోడీగా సానియా-హింగిస్ రికార్డు సృష్టించారు. ఈ గెలుపుతో ఇండో-స్విస్ ద్వయం సిడ్నీ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది.

బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 6-2, 6-3తో చెన్ లియాంగ్-పెంగ్ షుయె (చైనా) జంటను ఓడించి 1994లో గీగీ ఫెర్నాండెజ్ (ప్యూర్టోరికో-అమెరికా), నటాషా జ్వెరెవా (బెలారస్) జంట నెలకొల్పిన 28 వరుస విజయాల రికార్డును సమం చేసిన విషయం విదితమే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement