సానియా జంట శుభారంభం | Story image for sania mirza from IBNLive Sania Mirza-Martina Hingis extend winning streak in Sydney | Sakshi
Sakshi News home page

సానియా జంట శుభారంభం

Published Wed, Jan 13 2016 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

సానియా జంట శుభారంభం

సానియా జంట శుభారంభం

సిడ్నీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ తమ విజయపరంపరను కొనసాగిస్తోంది. గతవారం బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఈ ఇండో-స్విస్ ద్వయం సిడ్నీ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో ఈ టాప్ సీడ్ జంట 6-2, 6-3తో అనస్తాసియా రొడియోనోవా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జోడీపై అలవోకగా గెలిచింది. సానియా జంటకిది వరుసగా 27వ విజయం కావడం విశేషం. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (ఆస్ట్రేలియా) జంట కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్‌లో బోపన్న-మెర్జియా 6-7 (2/7), 6-3, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)-హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)లపై విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement