మరో టైటిల్ వేటలో.. | sania mirza and martina hingis enter into final of china open | Sakshi
Sakshi News home page

మరో టైటిల్ వేటలో..

Published Fri, Oct 9 2015 3:27 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

మరో టైటిల్ వేటలో..

మరో టైటిల్ వేటలో..

బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి మరో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. చైనా ఓపెన్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జోడి 6-2, 6-3 తేడాతో చెన్ లియాంగ్-యఫాన్ వాంగ్(చైనా) జోడీపై గెలిచి ఫైనల్ కు చేరింది.  వరుస సెట్లను కైవసం చేసుకున్న సానియా జోడి మరో టైటిల్ వేటకు సిద్ధమైంది.

 

ఇప్పటికే వింబుల్డన్, యూఎస్ గ్రాండ్ స్లామ్ లతో సహా ఏడు టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ ఇండో-స్విస్ జోడీ మరో టైటిల్ ను తమ ఖాతాలో వేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఒకవేళ ఈ టైటిల్ ను గెలిచినట్లయితే వరుసగా నాల్గో టైటిల్ ను సాధించిన అరుదైన ఘనతను సానియా -హింగిస్ ల జోడీ సొంతం చేసుకుంటుంది. గత మూడు టోర్నమెంట్లలో ప్రత్యర్థికి సానియా జోడీ ఒక్క సెట్ ను కూడా  కోల్పోకుండా తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement