మరో టైటిల్ కు రెండు అడుగుల దూరంలో... | Sania and Martina enter China Open doubles semis | Sakshi
Sakshi News home page

మరో టైటిల్ కు రెండు అడుగుల దూరంలో...

Published Thu, Oct 8 2015 5:17 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

మరో టైటిల్ కు రెండు అడుగుల దూరంలో...

మరో టైటిల్ కు రెండు అడుగుల దూరంలో...

బీజింగ్: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది మరో టైటిల్ వేటలో దూసుకుపోతోంది. తన భాగస్వామి మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)తో కలిసి చైనా ఓపెన్ డబ్యూటీఏ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్ కు చేరింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ ల జోడీ 7-6(5), 6-4 తేడాతో జులియా(జర్మనీ)-కరోలినా ప్లిస్కోవా(చెక్ ) జోడీపై విజయం సాధించి సెమీస్ కు చేరింది.

 

ఒక గంటా 20 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్  ను టై బ్రేక్ ద్వారా దక్కించుకున్న సానియా జోడీ.. రెండో గేమ్ లో మాత్రం దూకుడును కొనసాగించి ఆ సెట్ ను కైవసం చేసుకుంది.  ఇప్పటికే వింబుల్డన్, యూఎస్ గ్రాండ్ స్లామ్ లతో సహా ఏడు టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ ఇండో-స్విస్ జోడీ మరో టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఒకవేళ ఈ టైటిల్ ను గెలిచినట్లయితే వరుసగా నాల్గో టైటిల్ ను సాధించిన అరుదైన ఘనతను సానియా -హింగిస్ ల జోడీ సొంతం చేసుకుంటుంది. గత మూడు టోర్నమెంట్లలో సానియా జోడీ ఒక్క సెట్ ను కూడా ప్రత్యర్థికి కోల్పోని  సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement