
సెమీస్‌లో సానియా జంట
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ జంట 6-4, 6-2తో డానియెలా హంతుచోవా (స్లొవేకియా)-కరీన్ నాప్ (ఇటలీ) జోడీపై గెలిచింది. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ ద్వయం మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసినప్పటికీ తమ ప్రత్యర్థి జంట సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సెమీస్‌లో లీసా రేమండ్ (అమెరికా)-సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)లతో సానియా-హింగిస్ తలపడతారు.