హైదరాబాద్ నగరం చాలా బాగుందని, ఇక్కడి అతిథ్యం ఇంకా బాగుందని టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ అన్నారు.
మూసాపేట (హైదరాబాద్) : హైదరాబాద్ నగరం చాలా బాగుందని, ఇక్కడి అతిథ్యం ఇంకా బాగుందని టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ అన్నారు. మంగళవారం కూకట్‌పల్లిలోని సుజనాఫోరం మాల్‌లో ఎస్‌వీఎం ఫన్ సెంటర్‌ను ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా మార్టినా హింగిస్, థామస్ జాన్సన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు వినోద కేంద్రంలో బౌలింగ్ గేమింగ్ ఎంతో ఉత్సాహంగా ఆడారు. హింగిస్ మాట్లాడుతూ... హైదరాబాద్ నగరంలో ఆడటం సంతోషంగా ఉందని, నిన్న మ్యాచ్ గెలవడం ఆనందాన్నిచ్చిందన్నారు. టైటిల్ కోసం కృషి చేస్తామని చెప్పారు.