
కాలిఫోరి్నయా: భారత సంతతికి చెందిన అమెరికా యువ టెన్నిస్ ప్లేయర్ నిశేష్ బసవ రెడ్డి తన కెరీర్‌లో తొలి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ సింగిల్స్ టైటిల్ సాధించాడు. టిబురోన్ ఓపెన్ ఏటీపీ–75 చాలెంజర్ టోరీ్నలో 19 ఏళ్ల నిశేష్ చాంపియన్‌గా అవతరించాడు.
ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో నిశేష్ 6–1, 6–1తో అమెరికాకే చెందిన ఇలియట్ స్పిజిరిపై గెలుపొందాడు. విజేతగా నిలిచిన నిశే‹Ùకు 11,200 డాలర్ల (రూ. 9 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టైటిల్‌తో నిశేష్ ఏడు స్థానాలు ఎగబాకి ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 192వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన నిశేష్ తల్లిదండ్రులు 1999లో అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment