ఆ జంట సూపర్! | sania mirza and martina hingis pair succeed | Sakshi
Sakshi News home page

ఆ జంట సూపర్!

Published Sat, Sep 26 2015 5:56 PM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

ఆ జంట సూపర్!

ఆ జంట సూపర్!

గ్వాంగ్‌జూ: మహిళల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) తో జత కట్టిన అనంతరం భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన టైటిల్ వేటలో ముందుకు దూసుకుపోతోంది.  ఈ ఏడాది హింగిస్ తో జత కట్టిన తరువాత మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్  ర్యాంక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా..  రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను కూడా చేజిక్కించుకుంది.  2015 వ సంవత్సరాన్ని ఇండియన్ వెల్స్ టైటిల్ తో శుభారంభం చేసిన ఈ జోడి... ఆపై మియామి ఓపెన్ ను, ఫ్యామిలీస్ సర్కిల్స్  టైటిల్స్ ను సాధించింది.

 

అనంతరం  వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ తో పాటు, యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్స్ సానియా-హింగిస్ ల జోడి సాధించి సత్తాను చాటుకున్నారు.  తాజాగా గ్వాంగ్ జూ డబ్యుటీఏ టైటిల్ ను కూడా సానియా జోడి దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో చైనా జోడీపై గెలిచి టైటిల్ ను కైవసం చేసుకోవడం ద్వారా  సానియా జోడి తమ టైటిల్ సంఖ్యను ఆరుకు పెంచుకుంది. ఈ ఏడాది ఏడు డబుల్స్ టైటిల్స్ ను సాధించిన సానియా .. హింగిస్ తో జోడి కట్టిన తరువాత ఆరు టైటిల్ ను సాధించడం గొప్ప విషయమే.

 

గతేడాది డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ తర్వాత కారా బ్లాక్ (జింబాబ్వే)తో విడిపోయిన సానియా... ఈ ఏడాది సు వీ సెయి (చైనీస్ తైపీ)తో కలిసి నాలుగు టోర్నమెంట్లలో ఆడింది. ఖతార్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ఈ జంట మిగతా మూడు టోర్నీల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. దాంతో పరస్పర అవగాహనతో  వారి భాగస్వామ్యానికి తెరపడింది. అటు తరువాత హింగిస్ తో జతకట్టిన సానియా వరుస విజయాలను నమోదు చేస్తోంది. అద్భుతమైన విజయాలు సాధిస్తున్న ఈ జోడి నిజంగా సూపర్ కదూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement