నంబర్ వన్గానే.. | Sania Mirza retains World No. 1 status for second successive year | Sakshi
Sakshi News home page

నంబర్ వన్గానే..

Published Mon, Oct 31 2016 11:50 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

నంబర్ వన్గానే..

నంబర్ వన్గానే..

హైదరాబాద్:మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి,  హైదరాబాద్ అమ్మాయి సానియా మీర్జా నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. మహిళల సీజన్ ముగింపు టెన్నిస్ టోర్నీ డబ్యూటీఏ ఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్స్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ల జోడి ఓడినప్పటికీ.. సానియా తన వ్యక్తిగత నంబర్ వన్ ర్యాంకును పదిలంగా ఉంచుకుంది. తద్వారా మహిళల డబుల్స్లో వరుసగా రెండో ఏడాది కూడా సానియా నంబర్ ర్యాంకును సాధించినట్లయ్యింది.

డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీ లో భాగంగా శనివారం జరిగిన సెమీస్ పోరులో సానియా-మార్టినా ఓటమి పాలైంది. దాంతో సానియా వ్యక్తిగత నంబర్ వన్ ర్యాంకుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తొలుత భావించారు. అయితే  సెమీస్ లో సానియా జోడిని ఓడించిన ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా)  జంట డబ్యూటీఏ ఫైనల్స్ టైటిల్ గెలిచారు. దాంతో సానియా ర్యాంకుకు ఎటువంటి ప్రమాదం ఏర్పడలేదు. ఒకవేళ బెథానీ-సఫరోవా జోడి గెలిస్తే మాత్రం సానియా తన ర్యాంకును కోల్పోయేది.
 

మరోసారి నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోవడం పట్ల సానియా మీర్జా ఆనందం వ్యక్తం చేసింది. 'చాలా సంతోషంగా ఉంది. రెండో ఏడాది కూడా నంబర్ వన్గా నిలిచాను. ఇదొక అద్భుతమైన నా ప్రయాణంగా భావిస్తున్నా' అని సానియా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement