Number One
-
భారత కొత్త నంబర్‌వన్‌గా శ్రీవల్లి రష్మిక
మహిళల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో భారత కొత్త నంబర్‌వన్ ప్లేయర్‌గా హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక అవతరించింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లో 22 ఏళ్ల రష్మిక రెండు స్థానాలు పడిపోయి 302వ స్థానంలో నిలిచింది. మూడు నెలలుగా భారత నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ ప్లేయర్ సహజ యామలపల్లి ఏకంగా 18 స్థానాలు పడిపోయి 304వ ర్యాంక్‌కు చేరుకోవడం రషి్మకకు కలిసొచి్చంది. భారత్‌కే చెందిన అంకిత రైనా 306వ ర్యాంక్‌లో, వైదేహి 405వ ర్యాంక్‌లో ఉన్నారు. -
ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పాదనలో భారత్ నంబర్ వన్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను భారత్ ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ఒక ఏడాదిలో 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది రెండవ అతిపెద్ద ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిదారు కంటే రెండు రెట్లు అధికం. యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం ఉత్పత్తి అవుతోంది.ఈ అధ్యయనం ప్రకారం ఈ 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ గ్లోబల్ సౌత్ నుండి వస్తుంది. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన కోస్టాస్ వెలిస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఒకచోట చేరిస్తే, అది న్యూయార్క్ నగరంలోగల సెంట్రల్ పార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తుకంటే అధికంగా ఉంటుంది. పరిశోధకులు ఈ అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 50 వేలకు పైగా నగరాలు, పట్టణాలలో స్థానికంగా ఉత్పత్తి అయిన వ్యర్థాలను పరిశీలించారు.ఈ అధ్యయన ఫలితాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం బహిరంగ వాతావరణంలో కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశీలించింది. ప్రపంచ జనాభాలో 15 శాతం మంది నుంచి వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పారవేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఆగ్నేయాసియా, సబ్-సహారా ఆఫ్రికాలో అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తికి ఇదే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. ఈ 15 శాతం జనాభాలో భారతదేశంలోని 25.5 కోట్ల మంది ఉన్నారు.నైజీరియాలోని లాగోస్ ప్రపంచంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ ప్లాస్టిక్ కాలుష్యాన్ని విడుదల చేస్తోంది. ఇదేవిధంగా న్యూఢిల్లీ, లువాండా, అంగోలా, కరాచీ, ఈజిప్ట్‌లోని కైరోలు ప్లాస్టిక్ కాలుష్య కారకాల విడుదలలో అగ్రస్థానంలో ఉన్నాయి. చైనా ఈ విషయంలో నాల్గవ స్థానంలో ఉంది. వ్యర్థాలను తగ్గించడంలో ఆ దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోందని వెల్లడయ్యింది. -
దేశంలో నంబర్‌వన్ ఐఎస్బీ
రాయదుర్గం: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మరోసారి దేశంలోని బిజినెస్ స్కూళ్లలో టాప్‌లో నిలిచింది. ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ర్యాంకింగ్స్–2024ను సోమవారం విడుదల చేశారు. ఈ ర్యాంకింగ్స్‌లో వరుసగా మూడవ ఏడాదీ హైదరాబాద్ ఐఎస్బీ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఆసియా స్థాయిలో నంబర్–2గా గుర్తింపు పొందింది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ర్యాంకింగ్స్‌ను ప్రతి ఏటా విడుదల చేస్తుంటారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించగా.. భవిష్యత్తు ఉపయోగం విషయంలో ఐఎస్బీ నంబర్ వన్ స్థానం పొందింది. బోధనా పద్ధతులు, మెటీరియల్స్ విషయంలో 25, డబ్బుకు తగిన విలువలో 15, తయారీ రంగంలో 27, ప్రోగ్రామ్ డిజైన్‌లో 28వ స్థానం పొందింది. గత ఏడాది 29..ఈ ఏడాది 26 అంతర్జాతీయ స్థాయిలో చూస్తే (గ్లోబల్ ర్యాంకింగ్స్) ఈ ఏడాది ఐఎస్బీ 26వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ర్యాంకు మెరుగుపర్చుకోవడం విశేషం. 2023లో ఐఎస్బీ 29వ స్థానంలో నిలిచింది. కాగా దేశంలో ఐఎస్బీ మూడేళ్లుగా నంబర్ వన్ స్థానంలో నిలువడంపై విద్యాసంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ లెరి్నంగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రొఫెసర్ దీపామణి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రపంచానికి భవిష్యత్తు నాయకులను అందజేసే అంతర్జాతీయ స్థాయి నిర్వహణ సంస్థగా ఐఎస్బీ భవిష్యత్తులో మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు సంస్థ డీన్ పర్యవేక్షణలో అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. -
భారత నంబర్‌వన్‌గా శ్రీజ
న్యూఢిల్లీ: రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్ నంబర్‌వన్ ర్యాంకర్‌గా అవతరించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీజ ఒక స్థానం మెరుగుపర్చుకొని 38వ ర్యాంక్‌లో నిలిచింది. ఇప్పటి వరకు భారత నంబర్‌వన్‌గా ఉన్న మనిక బత్రా రెండు స్థానాలు పడిపోయి 39వ ర్యాంక్‌కు చేరుకుంది. భారత్ నుంచి యశస్విని 99వ ర్యాంక్‌లో, అర్చన కామత్ 100వ ర్యాంక్‌లో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న 25 ఏళ్ల శ్రీజ ఈ ఏడాది నిలకడగా రాణిస్తూ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సర్క్యూట్లో రెండు టైటిల్స్ సాధించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆచంట శరత్ కమల్‌తో కలిసి శ్రీజ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో శరత్ కమల్ 37వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సత్యన్ జ్ఞానశేఖరన్ 60వ స్థానంలో, మానవ్ ఠక్కర్ 61వ స్థానంలో, హర్మీత్ దేశాయ్ 64వ ర్యాంక్‌లో ఉన్నారు. హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ 147వ ర్యాంక్‌లో నిలిచాడు. -
‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
మోంటెకార్లో: భారత ఆటగాడు రోహన్ బోపన్న 44 ఏళ్ల వయసులో టెన్నిస్ వరల్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఇటీవలే నంబర్‌వన్‌కు చేరాడు. సింగిల్స్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన అతి పెద్ద వయస్కుడిగా (36 ఏళ్లు) గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య తమ వయసుకు సంబంధించిన ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘టెన్నిస్ మనకు ఎంతో నేర్పించింది. అనుభవం మంచి విజయాలు అందిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత ఉంది‘ అని బోపన్న వ్యాఖ్యానించగా... ‘అనుభవం మాత్రమే కాదు. ప్రతీ రోజు ఆట పట్ల అంకితభావం చూపడమే మనల్ని ఈ స్థానంలో నిలిపింది’ అని జొకోవిచ్ బదులిచ్చాడు. ఇద్దరు నంబర్‌వన్ ఆటగాళ్లు కలిసిన అరుదైన ఘట్టం సెర్బియా, భారత టెన్నిస్‌కు సంబంధించి ప్రత్యేకమైందన్న జొకోవిచ్...త్వరలోనే భారత గడ్డపై ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ తమ సంభాషణను నమస్తేతో జొకోవిచ్ ముగించాడు. -
బుమ్రా నంబర్‌వన్
దుబాయ్: భారత్ నుంచి ఎంతోమంది పేస్ బౌలర్లు టెస్టుల్లో పలుమార్లు అత్యుత్తమ ప్రదర్శనతో అలరించారు. కానీ ఏనాడూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకోలేకపోయారు. అయితే ఆ లోటును తీరుస్తూ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని అందుకున్న తొలి భారతీయ పేస్ బౌలర్‌గా అవతరించాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 30 ఏళ్ల బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి తన కెరీర్లో తొలిసారి ఈ ఫార్మాట్లో టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. విశాఖపట్నంలో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో బుమ్రా తన పేస్ పదునుతో తొమ్మిది వికెట్లు (6/45; 3/46) పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించడంతోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం గెల్చుకున్నాడు. బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 881 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. గత ర్యాంకింగ్స్‌లో ‘టాప్’ ర్యాంక్‌లో ఉన్న భారత స్పిన్నర్ అశ్విన్ రెండు స్థానాలు పడిపోయి 841 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ 851 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి నలుగురు బౌలర్లు మాత్రమే ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. గతంలో భారత స్పిన్నర్లు బిషన్‌సింగ్ బేడీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనత సాధించగా... పేస్ బౌలర్ రూపంలో బుమ్రా తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు 34 టెస్టులు ఆడిన బుమ్రా 155 వికెట్లు తీసుకున్నాడు. తాజా టాప్ ర్యాంక్‌తో బుమ్రా మరో రికార్డు కూడా నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలో మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన తొలి బౌలర్‌గా గుర్తింపు పొందాడు. బుమ్రా 2017 నవంబర్ 4న తొలిసారి టి20 ఫార్మాట్లో... 2018 ఫిబ్రవరి 4న తొలిసారి వన్డే ఫార్మాట్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా వన్డేల్లో ఆరో ర్యాంక్‌లో, టి20ల్లో వందో ర్యాంక్‌లో ఉన్నాడు. మరోవైపు టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 37 స్థానాలు ఎగబాకి 29వ ర్యాంక్‌లో నిలిచాడు. తదుపరి టెస్టులకూ దూరం! న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలరీత్యా భారత స్టార్ కోహ్లి ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు. అయితే తదుపరి మూడు టెస్టులకూ కోహ్లి సేవలు జట్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఈనెల 15 నుంచి 19 వరకు రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి 27 వరకు రాంచీలో జరగనున్నాయి. చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి 11 వరకు ధర్మశాలలో జరగుతుంది. తాను జట్టుకు ఎప్పుడు అందుబాటులో ఉంటాననే విషయంపై కోహ్లి బీసీసీఐకి ఇంకా సమాచారం ఇవ్వలేదని తెలిసింది. -
‘వైద్యం’లో తెలంగాణ నంబర్ వన్
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): వైద్యం, వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్యలో రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉండేదని, నిజామ్, బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులే ఉండేవని గుర్తుచేశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్యరంగంలో ఎంతో ప్రగతి సాధించామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి జిల్లాకు ఓ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని హరీశ్ అన్నారు. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నామని, అలాగే పీజీలో 8 సీట్లతో రెండవ స్థానంలో ఉన్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తితో పాటు వైద్యులను తయారు చేయడంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. ఎంబీబీఎస్ ఫీజులు రాష్ట్రంలోనే తక్కువని, వైద్య విద్యార్థులకు అందించే స్టైఫండ్ అన్ని రాష్ట్రాలకంటే ఇక్కడే ఎక్కువ అని చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు పీజీలో రిజర్వేషన్ సదుపాయం కల్పి స్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. నగరం నలుదిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్ గ్లోబల్ హెల్త్ హబ్‌గా మారిందని, ఇతర దేశాలకు చెందినవారంతా వైద్యసేవలు, చికిత్సల కోసం హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారని తెలిపారు. త్వరలోనే గాంధీ ఆస్పత్రిలో అవయవ మార్పిడి, ఫెర్టిలిటీ, ఎంసీహెచ్ భవనాలు, అధునాతన అపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు, సదుపాయాలు కల్ప0చామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ అందజేశారు. డీఎంఈ రమే‹Ùరెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, పలువురు హెచ్ఓడీలు, ఆర్‌ఎంఓలు, వైద్యులు, వైద్యవిద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నెంబర్ 1 హీరోగా నాని
-
'కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం'
ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌కు టీమిండియా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్- నవంబర్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. దీనికి ముందు టీమిండియా వరుసగా వన్డే సిరీస్‌లు ఆడుతూ విజయాలు దక్కించుకుంటూ వస్తుంది. ఇప్పటికే లంకతో వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డేలోనూ కివీస్‌ను టీమిండియా ఓడించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలచే సువర్ణావకాశం లభించనుంది. ఈ విషయం ఇప్పటికే ఐసీసీ తన ట్విటర్లో పేర్కొంది. ''మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడిస్తే వన్డేల్లో నెంబర్‌వన్ ర్యాంకు సొంతం చేసుకోనుంది'' అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, టీమిండియాలు 113 రేటింగ్ పాయింట్లతో ఉన్నప్పటికి మ్యాచ్‌లు, పాయింట్ల ఆధారంగా వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ టీమిండియా న్యూజిలాండ్‌ను మూడో వన్డేల్లో ఓడిస్తే రెండు రేటింగ్ పాయింట్లతో మొత్తంగా 115 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. రానున్న వన్డే వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాకు ఇది మంచి బూస్టప్ అని చెప్పొచ్చు. ఒకవేళ టీమిండియా కివీస్‌తో మూడో వన్డేలో ఓడినా రెండో స్థానంలో నిలిచే అవకాశం కూడా ఉంది. మరి మంగళవారం ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో టీమిండియా గెలిచి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ICC confirms if India beat New Zealand in the 3rd ODI, India will be number 1 in ranking. — Johns. (@CricCrazyJohns) January 22, 2023 చదవండి: విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్ ముద్ర చెరిపేయాల్సిందే 'టీమిండియా రైట్ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా! -
అరుదైన రికార్డ్.. ఆ విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్
సాక్షి, అమరావతి: సంక్షేమంలో ఇప్పటికే అనేక రికార్డుల్ని నెలకొల్పిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం.. మరో వైపు పారిశ్రామిక వృద్ధిలోనూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్.. డీపీఐఐటీ రూపొందించిన నివేదిక ఏపీ సత్తా ఏంటో దేశానికి చాటి చెప్పింది. దేశంలో గడిచిన ఏడు నెలల్లో ఏ రాష్ట్రం సాధించనన్ని పెట్టుబడులను ఏపీ సాధించినట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో ఒడిశా రాష్ట్రం నిలిచింది. దేశం మొత్తం మీద గత ఏడు నెలల్లో వచ్చిన పెట్టుబడుల్లో 45 శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలే సాధించాయి. చదవండి: వైద్యం, ఆరోగ్యం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు అందులో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 40 వేల 361 కోట్ల పెట్టుబడుల్ని సాధించి నంబర్ వన్ గా నిలిచింది. ఈ ఏడు నెలల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కలిసి లక్షా 71 వేల 285 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అందులో ఏపీ, ఒడిశాలో 45 శాతం వచ్చాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకమైన పారిశ్రామిక విధానాలను అమలుచేయడంతో ప్రతిష్టాత్మకమైన పారిశ్రామిక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. దీంతో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో అగ్రగామిగా నిలిచింది. ఎంఓయూలను వాస్తవిక పెట్టుబడులుగా మలచడంలోనూ దేశంలో మొదటి స్థానంలో ఏపీ ఉంది. ఎగుమతుల్లోనూ ఏడో స్థానం నుండి నాలుగో స్థానానికి రాష్ట్రం ఎదిగింది. ఇవన్నీ కేవలం సీఎం జగన్ గత మూడేళ్ల పాలనా సంస్కరణలు, నిర్ణయాల వల్లనే సాధ్యమైంది. ఇప్పుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఏపీ పెట్టుబడుల ఆకర్షణలో గత ఏడు నెలల్లో అగ్రస్థానంలో నిలిచిందని ప్రకటించింది. కొద్ది రోజుల కిందట జరిగిన కేబినెట్ సమావేశంలోనూ ఏపీ ప్రభుత్వం లక్షా 26 వేల 748 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు, ఎనర్జీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రాబోయే ఏడేళ్లలో 40 వేల 330 ఉద్యోగాలు రానున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు ఏపీకి వస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
Aquaculture: ఆక్వాలో ఆంధ్రాదే అగ్రస్థానం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆక్వారంగ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తుల్లో నంబర్ వన్‌గా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా సాగుకు విద్యుత్‌కు సబ్సిడీ ప్రకటించారు. ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ యాక్టు, ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్టు – 2020 ద్వారా నాణ్యమైన ఉత్పత్తులకు మార్గం సుగమం చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆక్వా పరిశ్రమ తారాజువ్వలా దూసుకుపోతోంది. 974 కిలోమీటర్ల తీరప్రాంతంలో .. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఐదు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. దేశంలో ఉత్పత్తవుతున్న మత్స్య సంపదతో పోలిస్తే 31 శాతం వాటాను ఏపీ ఆక్రమించింది. వెనామీ రొయ్యలు, పండుగప్ప రకం చేపలు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. రాష్ట్రంలో కొల్లేరు ప్రాంతం చేపల పరిశ్రమకు పెట్టింది పేరుగా మారింది. ఒక్క కృష్ణా జిల్లాలో 1.80లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇప్పటి వరకూ రిజర్వాయర్లలో చేప పిల్లలను మాత్రమే వదిలేవారు. ఈ ఏడాది నుంచి మత్స్యకారుల వేట నిమిత్తం రొయ్య పిల్లలను సైతం విడిచిపెడుతున్నారు. ఏటేటా పెరుగుతున్న ఉత్పత్తులు.. ఏపీ నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.19 వేల కోట్ల విలువైన 18.46 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు జరిగాయని మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంపెడా) ప్రకటించింది. దిగుబడుల విషయానికొస్తే 2018–19లో 13.42 లక్షల టన్నులు, 2019–20లో 15.91 లక్షల టన్నులు, 2020–21లో 18.46 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు పెరిగాయి. ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) చట్టం – 2020, ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్, సవరణ) చట్టం 2020ను ప్రవేశపెట్టింది. ఈ చట్టాల ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు, మేతలకు అవకాశం ఏర్పడుతున్నది. ఈ చట్టాల ద్వారా ఆక్వా రైతులు రెన్యూవల్, నూతన లైసెన్సులు పొందాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు లైసెన్సులు పొందారు. అండగా ప్రభుత్వం.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆక్వా సాగుకు విద్యుత్ సబ్సిడీ కల్పించింది. రాష్ట్రంలో 60,472 ఆక్వా విద్యుత్ సర్వీసులకు యూనిట్ కేవలం రూ.1.50కే సరఫరా చేస్తున్నది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.720 కోట్ల భారం పడుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.332 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభం కానున్నాయి. సచివాలయ స్థాయిలో ఈ–ఫిష్ బుకింగ్ చేసి, వైఎస్సార్ మత్స్య పొలంబడి కేంద్రాల ద్వారా ఆక్వా రైతులకు అవగాహన కలిగిస్తున్నది. ఇవే కాకుండా వేట నిషేధ సమయంలో భృతి, డీజిల్‌పై సబ్సిడీ, ఎక్స్‌గ్రేషియా, ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఆక్వాకు ఊపిరి పోశారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రంగానికి ఊపిరిపోశారు. కరోనా సమయంలోనూ ఉత్పత్తుల రవాణాకు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. ముఖ్యంగా ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందించడం వల్ల డీజిల్ ఖర్చులు తగ్గాయి. దీంతో లక్షల్లో రైతులకు ఆర్థిక ఊరట కలిగింది. – మంగినేని రామకృష్ణ, ఆక్వా రైతు, కైకలూరు దిగుబడులు పెరిగాయి.. ప్రభుత్వం ఆక్వా రంగం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తోంది. అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నాణ్యమైన సీడు, ఫీడు సరఫరాకు చర్యలు తీసుకున్నది. ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల ఏటేటా ఆక్వా ఉత్పత్తులు పెరుగుతున్నాయి. ఆక్వా ఉత్పత్తుల్లో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. – లాల్ మహమ్మద్, జాయింట్ డైరెక్టరు, మత్స్యశాఖ, కృష్ణాజిల్లా -
నయా నంబర్‌వన్..డానిల్ మెద్వెదెవ్
లండన్: టెన్నిస్ రాకెట్ పట్టిన ఎవరికైనా కెరీర్లో రెండు లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఏదైనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలువడం... రెండోది ఏనాటికైనా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకోవడం... రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఈ రెండు లక్ష్యాలను అందుకున్నాడు. గత ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న 26 ఏళ్ల మెద్వెదెవ్ సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ప్రపంచ తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. 2020 ఫిబ్రవరి నుంచి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను రెండో స్థానానికి నెట్టేసి మెద్వెదెవ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్ 8,615 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. జొకోవిచ్ 8,465 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. ‘వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. రాకెట్ పట్టినప్పటి నుంచి నా లక్ష్యాల్లో ఇదొకటి. టాప్ ర్యాంక్ చేరుకున్నాక నాకు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంది సందేశాలు పంపించారు. వారందరికీ ధన్యవాదాలు’ అని మెద్వెదెవ్ వ్యాఖ్యానించాడు. ► పురుషుల టెన్నిస్‌లో ‘బిగ్ ఫోర్’గా పేరొందిన ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా), ఆండీ ముర్రే (బ్రిటన్)లలో ఎవరో ఒకరు 2004 ఫిబ్రవరి 2 నుంచి ఇప్పటి వరకు ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతూ వస్తున్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నలుగురు కాకుండా మెద్వెదెవ్ రూపంలో మరో ప్లేయర్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలువడం విశేషం. ► ఆండీ ముర్రే (2016 నవంబర్ 7) తర్వాత కొత్త నంబర్‌వన్ ర్యాంకర్‌గా మెద్వెదెవ్ నిలిచాడు. ► యెవ్గెనీ కఫెల్నికోవ్ (1999; మే 3), మరాత్ సఫిన్ (2000, నవంబర్ 20) తర్వాత ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ పొందిన మూడో రష్యా ఆటగాడిగా మెద్వెదెవ్ గుర్తింపు పొందాడు. నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాక కఫెల్నికోవ్ వరుసగా ఆరు వారాలు, సఫిన్ వరుసగా తొమ్మిది వారాలు టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. ► 1996 ఫిబ్రవరి 11న మాస్కోలో జన్మించిన మెద్వెదెవ్ 2014లో ప్రొఫెషనల్‌గా మారాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదెవ్ 2016 నవంబర్‌లో తొలిసారి టాప్–100లోకి వచ్చాడు. అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆరేళ్ల వ్యవధిలో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. ► ఇప్పటివరకు మెద్వెదెవ్ మొత్తం 13 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. ఇందులో ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీ (యూఎస్ ఓపెన్–2021), నాలుగు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్, సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ టైటిల్ (2020) ఉన్నాయి. ► 1973 ఆగస్టులో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న 27వ ప్లేయర్ మెద్వెదెవ్ కావడం విశేషం. -
మరోసారి సంచలనం సృష్టించిన షావోమీ..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ మరో సంచలనాన్ని సృష్టించింది. 2021 జూన్ నెలలో మొట్టమొదటి సారిగా ప్రపంచంలోనే నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా షావోమీ నిలిచింది. ఈ ఏడాది జూన్ మాసంలో షావోమీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్మార్ట్ఫోన్లను విక్రయించింది. డేటా పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ ప్రకారం ఆఫ్రికా, చైనా, యూరోప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను విస్తరించడంతో అమ్మకాలు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. షావోమీ సంస్థను 2010లో స్థాపించగా కంపెనీ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌ను 2011 సంవత్సరంలో విడుదల చేసింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా షావోమీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. షావోమీ అమ్మకాలు మే నెలతో పోలిస్తే జూన్ నెలలో గణనీయంగా 26 శాతం పెరిగాయి. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల పరంగా షావోమీ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు 17.1 శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది. షావోమీ బ్రాండ్ తరువాత ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ 15.7 శాతం, ఆపిల్ 14.3 శాతం వాటాలను సొంతం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అత్యధిక అమ్మకాలు జరిపిన రెండో బ్రాండ్‌గా షావోమీ నిలిచింది. షావోమీ ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ స్మార్ట్ఫోన్లను విక్రయించింది. ఆఫ్రికా, చైనా, యూరప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో హువావే స్మార్ట్‌ఫోన్ వెనక్కి తగ్గడంతో ఆ గ్యాప్‌ను షావోమీ భర్తీ చేసిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరక్టర్ తరుణ పాఠఖ్ వెల్లడించారు. జూన్ నెలలో చైనా, యూరప్, మిడిల్ ఈస్ట్, భారత మార్కెట్లలో షావోమీ స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వియత్నాంలో కోవిడ్-19 వేవ్ రాకతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తి కూడా దెబ్బతింది. ఈ కారణంగానే శాంసంగ్ వెనుకబడి ఉండవచ్చునని కౌంటర్‌పాయింట్ సంస్థ తమ నివేదికలో పేర్కొంది. -
మళ్లీ ముకేశ్ టాప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. సుమారు 8,870 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 6,56,000 కోట్లు) సంపదతో ఫోర్బ్స్ ఇండియా 2020 కుబేరుల లిస్టులో వరుసగా పదమూడోసారీ నంబర్ వన్‌గా నిల్చారు. గౌతమ్ అదానీ, శివ్ నాడార్ ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నారు. వంద మంది సంపన్నుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో దివీస్ ల్యాబ్స్ ఎండీ మురళి దివి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రమోటర్ల కుటుంబం, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చైర్మన్ పీపీ రెడ్డి , అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి ఉన్నారు. కరోనా వైరస్ మహమ్మారి భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ టాప్ 100 సంపన్నుల్లో సగం మంది సంపద గణనీయంగానే పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది. ‘వీరందరి సంపద గతేడాదితో పోలిస్తే 14 శాతం పెరిగి 51,700 కోట్ల డాలర్లకు చేరింది‘ అని పేర్కొంది. ముకేశ్ అంబానీ సంపద మరో 3,730 కోట్ల డాలర్లు పెరిగిందని వివరించింది. -
దూసుకుపోతున్న విశాఖ నగరం
విశ్వ నగరి విశాఖ స్వచ్ఛత విషయంలోనూ అత్యున్నతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రజలు భుజానికెత్తుకున్నారు. సిటిజన్ ఫీడ్‌బ్యాక్ విషయంలో ఇన్నాళ్లూ వెనుకబడిన విశాఖ నగరం ఇప్పుడు ప్రజా చైతన్యంతో ఏకంగా మొదటి స్థానానికి చేరుకుంది. ఈ నెల 31 వరకూ ప్రజలు ఇదే రీతిలో స్పందించి ఈ స్థానాన్ని నిలబెడితే టాప్–10లో నిలుస్తుంది. మరోవైపు ఇప్పటి వరకూ వచ్చిన ప్రాతిపదికల ఆధారంగా చూస్తే రాష్ట్రంలో నంబర్ వన్‌గా విశాఖ నగరం ఉంది. అదే దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఏడో స్థానంలో నిలిచింది. మొత్తంగా వైజాగ్ స్వచ్ఛ సర్వేక్షణ్–2020లో అప్రతిహతంగా దూసుకుపోవాలంటే ప్రజలు ఇదే తరహాలో ప్రోత్సహించాలి. సాక్షి, విశాఖపట్నం: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఢిల్లీ బృందం చేపట్టే కీలకమైన ప్రత్యక్ష పరిశీలన ఈ నెల 31లోగా జరుగుతుంది. విశాఖ నగరానికి ఈ నెల 10లోపు వచ్చే అవకాశం ఉందని జీవీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ బృందం అడిగే ఎనిమిది కీలక ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తే మహా నగరం మంచి ర్యాంకుని సాధిస్తుంది. ఆ ప్రశ్నలివీ.. 1. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మీ సిటీ పాల్గొంటుందని మీకు తెలుసా..? • అవునని సమాధానం వస్తే అత్యధిక మార్కులు వస్తాయి. 2). మీ పరిసరాల పరిశుభ్రత స్థాయిపై మీ సిటీకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు.? • గరిష్టంగా 10 మార్కులు ఇవ్వవచ్చు. 10కి పది ఇస్తే ర్యాంకుకి ఉపయోగపడుతుంది. 3). వాణిజ్య, పబ్లిక్ ప్రాంతాల్లో శుభ్రత స్థాయిపై మీ సిటీకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు.? • 10 మార్కులు వరకూ ఇవ్వవచ్చు. 10కి పది ఇస్తే ర్యాంకు సాధించేందుకు వీలవుతుంది. 4). మీ చెత్త పట్టుకెళ్లేవారు తడి పొడి చెత్త వేరుగా ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నారా.? • అవును.. ప్రతి రోజూ అడుగుతున్నారు అని చెబితే ఉపయుక్తంగా ఉంటుంది. 5). మీ సిటీలోని రోడ్డు డివైడర్స్ పచ్చదనం పెంపొందించేలా మొక్కలతో కవర్ చేశారా.? • అవును, అన్ని రోడ్లు డివైడర్లు గ్రీనరీతో నిండాయి అని చెబితే ర్యాంకుకి ఉపయోగపడుతుంది. 6). మీ సిటీలోని పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్స్ పరిశుభ్రతకు ఎన్ని మార్కులు ఇస్తారు.? • 10 మార్కులు వరకూ ఇవ్వవచ్చు. 10కి పది ఇస్తే ర్యాంకు సాధించేందుకు వీలవుతుంది. 7). మీ సిటీ ఓడీఎఫ్(బహిరంగ మల విసర్జన రహిత) స్థితి మీకు తెలుసా.? • ఇటీవలే జీవీఎంసీ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ నగరంగా ధ్రువీకరించబడింది. కాబట్టి.. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ నగరంగా చెబితే చాలు. 8). మీ సిటీ గార్బేజ్ ఫ్రీ సిటీ స్టార్ రేటింగ్ స్థితి మీకు తెలుసా.? •జీవీఎంసీ 5 స్టార్ రేటింగ్ నగరంగా గుర్తింపు పొందేందుకు దరఖాస్తు చేసుకుంది. ►ఇప్పటివరకు స్వచ్ఛతలో రాష్ట్ర స్థాయి ర్యాంకు– 1 ►ఇప్పటివరకు స్వచ్ఛతలో దేశ స్థాయిలో ర్యాంకు– 7 ►ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్ నగరంగా ధ్రువపత్రం సాధించిన జీవీఎంసీ ►గార్బేజ్ ఫ్రీ సిటీగా 5 స్టార్ రేటింగ్‌కు దరఖాస్తు ప్రజలే వారధులు.. స్వచ్ఛతలో నగరాన్ని అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టేందుకు జీవీఎంసీ తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజలు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. కీలకమైన ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇస్తే.. వైజాగ్ మంచి ర్యాంకు సాధించగలదు. కమిషనర్ సూచనలతో నగర వ్యాప్తంగా 8 ప్రశ్నలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రజల సహకారం ఈ నెల 31 వరకూ అందిస్తే.. టాప్–10లోకి దూసుకుపోతాం. – విశ్వనాథ సన్యాసిరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్ -
పారిశ్రామికాభివృద్ధిలో మనమే నంబర్–1
► హైదరాబాద్‌లో శరవేగంగా ఏరోస్పేస్ రంగం అభివృద్ధి: కేటీఆర్ ► ఇప్పటికే రెండు ప్లాంట్లు..త్వరలో మూడోది ఏర్పాటు చేస్తాం ► పరిశ్రమలకు నగరం కేంద్రంగా మారింది ► ఇప్పటిదాకా 2.30 లక్షల మందికి ఉపాధి కల్పించాం ► త్వరలో రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని వెల్లడి ► ఆదిబట్లలో న్యూకాన్ యూనిట్ ప్రారంభం ఇబ్రహీంపట్నం రూరల్: పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌లో ఏరోస్పేస్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఇప్పటికే శంషాబాద్, ఆదిబట్లలో రెండు ఏరోస్పేస్ ప్లాంట్లు ఉన్నాయని, మూడో ప్లాంట్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల–నాదర్గుల్ పారిశ్రామిక వాడలో రక్షణ రంగ విడిభాగాల తయారీ కేంద్రం న్యూకాన్ ఏరోస్పేస్ యూనిట్‌ను హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజుతో కలసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అహ్వానం పలుకుతోందన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటును సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. ఏరోస్పేస్, రక్షణరంగ సంస్థల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందశాతం అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. మధ్య, భారీ తరహా పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, టీఎస్ఐపాస్తో పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ పరిశ్రమల ఏర్పాటును సులభతరం చేసినట్టు వివరించారు. టీఎస్ఐపాస్ ప్రారంభించిన రెండేళ్లలోనే రాష్ట్రంలో 4,100 యూనిట్లు ఏర్పాటు చేసి 2.30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని వెల్లడించారు. త్వరలో హైదరాబాద్‌లో రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలను తయారుచేయడం కోసం నగరంలో వైమానిక విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం లండన్‌కు చెందిన ట్రాన్స్ఫీల్డ్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు. పారిశ్రామికాభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి పారిశ్రామికాభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. సీఎం నిర్ణయాల వల్లే తెలంగాణకు అధిక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. పరిశ్రమలు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సతీశ్‌రెడ్డి, ఇస్రో డైరెక్టర్ ఎస్.సోమనాథ్, న్యూకాన్ చైర్మన్ హేమంత్ జలాన్, బీడీఎల్ సీఎండీ ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయండి కేంద్ర గనుల శాఖను కోరిన మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేంద్రం ఆలస్యం చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర గనుల శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్‌తో శనివారం సమావేశమయ్యారు. ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని, వెనుకబడ్డ ఖమ్మం ప్రాంతంలో యువతకు ఉద్యోగవకాశాలు కల్పించే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అత్యవసరమని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. కనీసం విభజన చట్టంలో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చడంలో కేంద్రం సఫలం కాలేదన్నారు. బీడీ కార్మికులకు అండగా ఉంటాం బీడీ కార్మికులకు రాష్ట్రం అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. శనివారం బీడీ పరిశ్రమల యాజమాన్యాలతో ఆయన సమావేశమయ్యారు. బీడీ పరిశ్రమపై జీఎస్టీ పన్ను రేటు తగ్గించాలని కోరుతూ కేంద్రానికి ఇప్పటికే సీఎం లేఖ రాశారని, హైదరాబాద్‌లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సీఎం ప్రస్తావిస్తారని చెప్పారు. -
నంబర్ వన్‌గానే..
హైదరాబాద్:మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, హైదరాబాద్ అమ్మాయి సానియా మీర్జా నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. మహిళల సీజన్ ముగింపు టెన్నిస్ టోర్నీ డబ్యూటీఏ ఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్స్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ల జోడి ఓడినప్పటికీ.. సానియా తన వ్యక్తిగత నంబర్ వన్ ర్యాంకును పదిలంగా ఉంచుకుంది. తద్వారా మహిళల డబుల్స్‌లో వరుసగా రెండో ఏడాది కూడా సానియా నంబర్ ర్యాంకును సాధించినట్లయ్యింది. డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీ లో భాగంగా శనివారం జరిగిన సెమీస్ పోరులో సానియా-మార్టినా ఓటమి పాలైంది. దాంతో సానియా వ్యక్తిగత నంబర్ వన్ ర్యాంకుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తొలుత భావించారు. అయితే సెమీస్ లో సానియా జోడిని ఓడించిన ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా) జంట డబ్యూటీఏ ఫైనల్స్ టైటిల్ గెలిచారు. దాంతో సానియా ర్యాంకుకు ఎటువంటి ప్రమాదం ఏర్పడలేదు. ఒకవేళ బెథానీ-సఫరోవా జోడి గెలిస్తే మాత్రం సానియా తన ర్యాంకును కోల్పోయేది. మరోసారి నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోవడం పట్ల సానియా మీర్జా ఆనందం వ్యక్తం చేసింది. 'చాలా సంతోషంగా ఉంది. రెండో ఏడాది కూడా నంబర్ వన్‌గా నిలిచాను. ఇదొక అద్భుతమైన నా ప్రయాణంగా భావిస్తున్నా' అని సానియా తెలిపింది. -
ఎక్సైజ్ శాఖలో ఇప్పుడు నేనే నంబర్ వన్!
ఎక్సైజ్ శాఖలో మొన్నటివరకు పెత్తనం కోసం ఆరాటపడి బదిలీవేటు వేయించుకున్న సంఘటనలు చూసైనా ఇంకా కొంత మంది అధికారులు గుణపాఠాలు నేర్వడం లేదని అబ్కారీ శాఖలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎక్సైజ్ శాఖ మొత్తం ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది.. నేనే నెంబర్ వన్ అని అబ్కారీ శాఖలోని ఓ ఉన్నతాధికారి హైదరాబాద్‌లోని జూబ్లీ క్లబ్లో గొప్పలు చెబుతున్నారట. సదరు ఉన్నతాధికారి వ్యాఖ్యల్ని సొంత శాఖలో సిబ్బంది జోరుగా ప్రచారం చేస్తున్నారట. ఇది విన్న అధికారులు కొందరు ‘‘ఆయనకు పేకాట ఆడేందుకే సమయం సరిపోవడం లేదు.. సొంత శాఖపై పట్టు సాధిస్తేనే కదా.. నెంబర్ వన్ అయ్యేది.. ఇక ఆయన ఎప్పుడు నెంబర్ వన్ కావాలి’’ అని నిష్టూరాలాడుతున్నారట. ఆయన వెనక అధికార పార్టీ అండ ఉందేమో కానీ.. నెంబర్ వన్ ఎప్పటికీ కాలేరని సిబ్బంది ఉద్ఘాటిస్తున్నారట. నెంబర్ వన్ అని ఊగి.. చినబాబు, నేను తమ్ముళ్లమే.. అని బీరాలు పలికి చివరకు బయటకు వెళ్లిన ఉన్నతాధికారిని చూసైనా క్లబ్లో కోతలు కోస్తున్న అధికారి మారరా? అని అబ్కారీ శాఖలో గుసగుసలాడుకుంటున్నారు. -
నన్ను విజేతని చేసిన రాత్రి!
నిద్రలేని రాత్రులు నెంబర్‌వన్ అనడంలో కాస్త అహంకారం ధ్వనిస్తోంది.కృష్ణగారు చాలా మంచి వ్యక్తి. అహంకారమన్నదే తెలియని మనిషి. ఆయనకు అనవసరంగా అహంకారాన్ని ఆపాదిస్తున్నానేమో అని కలత చెందాను. ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని నిద్రలేని రాత్రులు తప్పకుండా ఉంటాయి. నాకూ ఉన్నాయి. కానీ అన్నీ పంచుకోవాలని నేను అనుకోవడం లేదు. ఓ వ్యక్తి దూరమయ్యాడనో, ఓ సంఘటన కలిచి వేసిందనో నిద్ర లేకుండా గడిపిన క్షణాల్ని పంచుకోబోను. ఎందుకంటే నేను సింపథీ కోరుకోను. అందుకే నన్ను విజేతని చేసిన ఓ రాత్రి గురించి చెబుతాను. అప్పుడు నా కెరీర్ మంచి వేగంగా పరిగెడుతోంది. రాజేంద్రుడు - గజేంద్రుడు, మాయలోడు చిత్రాలు వరుసగా సక్సెస్ అయ్యాయి. తరువాతి సినిమాను కృష్ణ గారితో తీయాలని నిర్ణయం అయిపోయింది. ఆ చిత్రం పేరు ‘నెంబర్‌వన్’ అని అనౌన్స్ చేసేశాను. అప్పుడు మొదలయ్యింది అసలు సమస్య. అప్పటికి చిరంజీవి, బాలయ్య తదితరులు మంచి స్వింగ్‌లో ఉన్నారు. కృష్ణగారికి కాస్త సినిమాలు తగ్గాయి. అలాంటి సమయంలో ఆయనతో ‘నెంబర్‌వన్’ అనే సినిమా తీయడంలో ఉద్దేశమేమిటి, ఆయనే ఇండస్ట్రీలో నెంబర్‌వన్ అనా? అనే ప్రశ్న తలెత్తింది. అది చాలా ఇబ్బంది పెట్టే ప్రశ్న. నాకసలు అలాంటి ఉద్దేశమే లేదు. కానీ అందరికీ మాత్రం నా టైటిల్ అదే సందేహాన్ని కలిగించింది. కొందరైతే స్వయంగా నా దగ్గరకు వచ్చారు. ‘కెరీర్ బాగుంది, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు, ఇందుకు ఇలాంటి రిస్క్, మీకు చెడ్డపేరు వస్తుంది’ అన్నారు. దాంతో నాకు భయమేసింది. అనవసరంగా కమిటయ్యానా అనిపించింది. ఆలోచనలో పడ్డాను. రెండు మూడు రోజులు అదే టెన్షన్లో ఉన్నాను. ఓ రోజు రాత్రయితే అసలు నిద్రే పట్టలేదు. అయితే టైటిల్ మార్చాలన్న ఆలోచన మాత్రం నాకు రాలేదు. ఎందుకంటే... ‘కొబ్బరిబొండాం’ టైటిల్ పెట్టినప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తాయి. కొబ్బరిబొండాం, జాంగిరి, జిలేబీ కూడా సినిమా పేర్లేనా అని కొందరు కామెంట్ చేశారు. అప్పడాలు, సాంబార్లు కూడా సినిమా పేర్లుగా పెట్టేస్తారా అంటూ ఎంతోమంది విమర్శించారు. కానీ సినిమా రిలీజయ్యాక మాత్రం ఆ పేరు కరెక్ట్ అని అందరూ అంగీకరించారు. ఇప్పుడు కూడా నా టైటిల్ కరెక్ట్ అని నాకు తెలుసు. కానీ అపార్థాలు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి, టైటిల్‌ని ఎలా జస్టిఫై చేయాలి, ఆడియెన్స్‌ని ఎలా కన్విన్స్ చేయాలి అన్నదే నా తపన. ఆ రాత్రంతా కంటి మీదికి కునుకు రాలేదు. అందరూ అనేదాంట్లో తప్పు లేదు. నెంబర్‌వన్ అనడంలో కాస్త అహంకారం ధ్వనిస్తోంది. కృష్ణగారు చాలా మంచి వ్యక్తి. అహంకారమన్నదే తెలియని మనిషి. ఆయనకు అనవసరంగా అహంకారాన్ని ఆపాదిస్తున్నానేమో అని కలత చెందాను. నాలుగున్నర, ఐదు కావస్తుండగా మనసులో ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ‘ఇంటి బాధ్యతలు ఎవరు తీసుకుంటారో అతడే ఆ ఇంటికి పెద్ద, ఆ కుటుంబంలో అతడే నెంబర్‌వన్’... ఇదే ఆ ఆలోచన. ఆనందం వచ్చేసింది. మనసు తేలిక పడింది. నా సమస్య పరిష్కారమైపోయిందనిపించింది. దాంతో గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోయాను. ఉదయం రచయిత దివాకర్‌బాబు గారి దగ్గరకు వెళ్లి నా ఆలోచనను చెప్పాను. ఆయన దానిని అందమైన ఫార్మాట్‌గా మార్చారు. ఆ ఫార్మాట్లోనే ‘నెంబర్‌వన్’ రిలీజయ్యింది. మంచి సక్సెస్ అయ్యింది. నెగిటివ్ ఆలోచనలకు, కామెంట్లకు ఫుల్స్టాప్ పెట్టింది. ప్రశంసల జల్లు కురిపించింది. ఈ అనుభవం నాకో గొప్ప సత్యాన్ని అవగతమయ్యేలా చేసింది. అదేంటంటే... విజయాల్ని అందుకునే ప్రయత్నంలో నిద్రలేని రాత్రులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. నిద్రపోకుండా చేసిన ఆలోచనలు కొన్నిసార్లు మన జీవితాల్నే మార్చేస్తాయి. - సమీర నేలపూడి -
సూపర్ స్టార్‌కు జోడీ లేదా?
తాజా చిత్రంలో సూపర్ స్టార్‌కు హీరోయిన్ లేరట. లింగా చిత్రం తరువాత సూపర్‌స్టార్ రజినీకాంత్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారన్న విషం తెలిసిందే. లింగా చిత్ర సమస్యలు సూపర్‌స్టార్ చాలా డిస్ట్రబ్ చేశాయని చెప్పవచ్చు. చిత్రం హిట్ అయినా, ఫట్ అయినా తనకు సంబంధం లేదని నిర్ణయానికి వచ్చిన రజినీ ఈ సారి తన వయసుకు తగ్గ పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం. అట్టకత్తి, మెడ్రస్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు రంజిత్ రజినీ కోసం మంచి కమర్షియల్ అంశాలతో కూడిన కథను వండారట. ఇందులో సూపర్ స్టార్ దాదా పాత్రను పోషించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఆయనకు హీరోయిన్ ఉండరట. అయితే ఒక ముఖ్య పాత్రలో ప్రముఖ నటినొకరిని నటింప చేయడానికి ఆమెతో చర్చలు జరుగుతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు కలైపులి ఎస్ ధాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ టాక్. చిత్రం వచ్చే నెలలో చెన్నైలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం తరువాత రజినీ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తారని సమాచారం. దీనికి నెంబర్ ఒన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. దీన్ని ఐన్గారన్ ఫిలింస్ కరుణామూర్తి నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది మొదలవుతుందని కోలీవుడ్ టాక్. -
ధనార్జనలో నం-1 : అనుష్క
ధనార్జనలో నం-1 ధనార్జనలోనూ నంబర్ ఒన్ నటి అనుష్కనే. నటి నాయికలు నటనకు ప్రాధాన్యతనిస్తే నేటి నాయికలు ధనానికి ప్రాముఖ్యానిస్తున్నారన్నది సినీ విజ్ఞుల భావన. అందుకు తగ్గట్టుగానే ఆదాయమే ధ్యేయంగా మారుతున్నారు మన హీరోయిన్లు. ధనార్జనకు ఉన్న అవకాశాలన్నీ పుష్కలంగా వాడేసుకుంటున్నారు. అలా ధనాన్ని అధికంగా కూడబెడుతున్న నాయికల్లో నటి అనుష్కకదే నంబర్ ఒన్ స్టార్ అంటున్నారు. హీరోయిన్గా టాప్ రేంజ్లో ప్రకాశిస్తున్న ఈ బ్యూటీ ఇటు సినిమాల్లోనూ అటు వాణిజ్య ప్రకటనలతోనూ మరో వైపు ప్రముఖ వాణిజ్యసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ కోట్లు సంపాదిస్తున్న నంబర్ ఒన్ హీరోయిన్. అనుష్కానేనని అంటున్నారు. నిజానికి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా నయనతార పేరు నమోదయినా, ఆమె వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉండడంతో అనుష్క ధనార్జన కంటే ఈ మలయాళ భామ ఆదాయం తక్కువేనట. ఇక నటి సమంత, కాజల్, త్రిష, హన్సిక లాంటి తారలు కూడా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ భారీ స్థాయిలో సంపాదించుకుంటున్నారు. అయితే అనుష్క భారీ వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారన్నది తాజా సమాచారం. ఇటీవల ఒక మొబైల్ ఫోన్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పంద పత్రాలపై సంతకం చేసి కోటికిపైగా పారితోషికం పుచ్చుకున్నారన్నది సమాచారం. అనుష్క ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్ సరసన లింగా చిత్రంతోపాటు అజిత్‌కు జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. తెలుగులో భారీ చారిత్రాత్మక చిత్రాలు రుద్రమాదేవి, బాహుబలి చిత్రాల్లో నటిస్తున్నారు. -
అశ్విన్‌కు నెంబర్‌వన్ ర్యాంక్
దుబాయ్: ఐసీసీ ర్యాంకింగ్స్ ఆలౌరౌండర్ల జాబితాలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో అశ్విన్ (40, 46 నాటౌట్) బ్యాట్ రాణించడంతో ర్యాంక్ మెరుగుపడింది. తాజా జాబితాలో అశ్విన్ 372 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఫిలాండర్ (365)ను వెనక్కినెట్టి నెంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబల్, స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. -
బియాన్స నంబర్ వన్
పాప్ స్టార్ బియాన్స ‘ఫోర్బ్స’ జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోని శక్తిమంతులైన వందమంది సెలబ్రిటీల జాబితాను ‘ఫోర్బ్స’ మ్యాగజీన్ మంగళవారం విడుదల చేసింది. ఓప్రా విన్ఫ్రే, లేడీ గాగా వంటి వారిని అధిగమించి బియాన్స అగ్రస్థానానికి ఎగబాకడం విశేషం. బియాన్స వార్షికాదాయం 115 మిలియన్ డాలర్లు. ఎంటర్టైన్మెంట్ రంగంలోబియాన్స ప్రపంచాన్ని ఏలుతోందని ‘ఫోర్బ్స’ ప్రశంసలు కురిపించింది. -
విరాట్‌కు మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్
దుబాయ్: భారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. శనివారం విడుదల చేసిన తాజా బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. గత జనవరిలో చేజార్చుకున్న అగ్రపీఠాన్ని.. ఆసియా కప్‌లో రాణించడం ద్వారా మళ్లీ సొంతం చేసుకున్నాడు. ఆసియా కప్‌కు ముందు విరాట్.. దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిల్లీర్స్ కంటే రెండు రేటింగ్ పాయింట్లు వెనకబడి రెండో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో రాణించడం ద్వారా విరాట్ డివిల్లీర్స్‌ను వెనక్కినెట్టి నెంబర్ వన్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌పై (136) సెంచరీ నమోదు చేసిన కోహ్లీ.. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 189 పరుగులు చేశాడు. కాగా ఆఫ్ఘనిస్థాన్‌పై బ్యాటింగ్‌కు దిగలేదు. ప్రస్తుత జాబితాలో డివిల్లీర్స్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇతర భారత ఆటగాళ్లలో శిఖర్ ధవన్ మూడు, రోహిత్ శర్మ ఒకటి, రవీంద్ర జడేజా 12 స్థానాలు ఎగబాకి వరసగా 8, 22, 50వ ర్యాంక్‌లు సాధించారు. -
నాకు ఇంకా సంతృప్తి లేదు
టాలీవుడ్ నంబర్‌వన్ హీరోయిన్ అనగానే... తడుముకోకుండా వచ్చే సమాధానం సమంత. వరుస విజయాలతో సాటిలేని హీరోయిన్లా దూసుకుపోతోందీ చెన్నయ్ చందమామ. అయితే... టాప్ పొజిషన్ని ఎంజాయ్ చేస్తున్నా, కెరీర్ పరంగా తృప్తి లేదంటూ ఇటీవల మీడియా సాక్షిగా వాపోయారు సమంత. ‘‘వరుసగా హిట్స్ వస్తున్నాయని ఆనంద పడాలో, మంచి నటిగా ఇంకా నిరూపించుకోలేకపోయానని బాధ పడాలో అర్థం కావడం లేదు. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నీ నాకు మంచి పేరునే తెచ్చాయి. అయితే... ఆర్టిస్టుగా అంతటితో సతృప్తి పొందలేను. ఇంకా సాధించాలి. సమంత స్టార్ మాత్రమే కాదు, గొప్ప నటి కూడా అని అందరూ ప్రశంసించాలి. అలాంటి పేరు తెచ్చే పాత్ర కోసమే ఎదురు చూస్తున్నా. నటిగా ఎలాంటి పాత్రనైనా చేసే సత్తా నాకుంది. డీ గ్లామరైజ్డ్ క్యారెక్టరైనా ఫర్వాలేదు. పారితోషికం గురించి కూడా పెద్దగా పట్టించుకోను’’ అని తన ఆకాంక్షను వెలిబుచ్చారు సమంత.