
బియాన్‌స నంబర్ వన్
పాప్ స్టార్ బియాన్‌స ‘ఫోర్‌బ్స’ జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోని శక్తిమంతులైన వందమంది సెలబ్రిటీల జాబితాను ‘ఫోర్‌బ్స’ మ్యాగజీన్ మంగళవారం విడుదల చేసింది.
ఓప్రా విన్‌ఫ్రే, లేడీ గాగా వంటి వారిని అధిగమించి బియాన్‌స అగ్రస్థానానికి ఎగబాకడం విశేషం. బియాన్‌స వార్షికాదాయం 115 మిలియన్ డాలర్లు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోబియాన్‌స ప్రపంచాన్ని ఏలుతోందని ‘ఫోర్‌బ్స’ ప్రశంసలు కురిపించింది.