గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): వైద్యం, వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్యలో రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉండేదని, నిజామ్, బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులే ఉండేవని గుర్తుచేశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్యరంగంలో ఎంతో ప్రగతి సాధించామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రతి జిల్లాకు ఓ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని హరీశ్ అన్నారు. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నామని, అలాగే పీజీలో 8 సీట్లతో రెండవ స్థానంలో ఉన్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తితో పాటు వైద్యులను తయారు చేయడంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. ఎంబీబీఎస్ ఫీజులు రాష్ట్రంలోనే తక్కువని, వైద్య విద్యార్థులకు అందించే స్టైఫండ్ అన్ని రాష్ట్రాలకంటే ఇక్కడే ఎక్కువ అని చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు పీజీలో రిజర్వేషన్ సదుపాయం కల్పి స్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
నగరం నలుదిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్ గ్లోబల్ హెల్త్ హబ్‌గా మారిందని, ఇతర దేశాలకు చెందినవారంతా వైద్యసేవలు, చికిత్సల కోసం హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారని తెలిపారు. త్వరలోనే గాంధీ ఆస్పత్రిలో అవయవ మార్పిడి, ఫెర్టిలిటీ, ఎంసీహెచ్ భవనాలు, అధునాతన అపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు, సదుపాయాలు కల్ప0చామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ అందజేశారు. డీఎంఈ రమే‹Ùరెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, పలువురు హెచ్‌ఓడీలు, ఆర్‌ఎంఓలు, వైద్యులు, వైద్యవిద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment